రాఫెల్ వచ్చేస్తోంది

Publish Date:Jul 29, 2020

Advertisement

భారత వైమానికదళంలో బ్రహ్మస్తం

భారత వైమానిక దళంలో మరో అద్భతమైన అస్త్రం చేరబోతుంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధ విమానాల్లో అత్యంత ఆధునిక ఫైటర్ జెట్ గా గుర్తింపు పొందిన రాఫెల్ భారత్  భూభాగంపై ల్యాండ్ కానుంది. రెండు రోజుల కిందట ఫ్రాన్స్ లో టేకాఫ్ అయిన ఈ యుద్ధ విమానం హర్యానలోని అంబాలా ఎయిర్ బేస్ స్టేషన్ లోకు చేరుకోనున్నాయి. దేశ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వైమానిక దళాధినేత రాకేష్ కుమార్ భడౌరియా, సైనిక ఉన్నతాధికారులు స్వాగతం పలకనున్నారు.  ఏడు వేలకు పైగా కిలోమీటర్ల దూర ప్రయాణించిన ఈ యుద్ధ విమానాలు గగనతలంలోనే ఇంధనం నింపుకోని సురక్షితంగా గమ్యస్థానం చేరుతున్నాయి.  అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన రాఫెల్ జెట్ విమనాల తయారీ కోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్‌తో  2016లో ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 36 యుద్ధ విమానాల విలువ 58 వేల కోట్ల రూపాయలు. మనదేశం కొనుగోలు చేసిన 36 రాఫెల్ యుద్ధ విమానాల్లో ఐదు మాత్రమే ఇప్పుడు భారత్ కు చేరుకుంటున్నాయి. దేశ సరిహద్దుల్లో యుద్ధవాతావరణం అలుముకున్న ప్రస్తుత సమయంలో వీటిని సాధ్యమైనంత త్వరగా దేశ సరిహద్దుల్లోకి చేర్చే ప్రయత్నాలు వైమానిక దళం చేస్తోంది.

రాఫెల్ యుద్ధవిమానం బరువు పది టన్నులు.  పొడవు 15.30 మీటర్లు, దీని రెక్కల పొడవు 10.90 మీటర్లు. ఎత్తు 5.30 మీటర్లు.  ఒకసారి ఇంధనం నింపితే నిరవధికంగా 3,700 కిలోమీటర్ల దూరం దూసుకుపోతుంది. గంటకు 1912కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లే ఈ యుద్ధ విమానం 900కిలోల బరువును అవలీలగా తీసుకుపోగలదు. నెక్స్ జెనరేషన్ టెక్నాలజీతో రూపొందిన ఈ జెట్ ఫ్టైట్ విజువలు రేంజ్ కు మించిన దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదిస్తాయి. రెండు ఇంజన్లతో పనిచేసే ఈ ఫైటర్ జెట్ ఎయిర్ టూ ఎయిర్, ఎయిర్ టూ ల్యాండ్, ఎయిర్ టూ సర్ఫెస్ లో ఉన్న లక్ష్యాలను ఛేదించే మిసైల్స్ ను ఇవి ప్రయోగిస్తాయి. హర్పూర్, అలారం, పీజీఎం 100,  సైడ్ విండర్, అపాచి, మేజిక్ అండ్ మైకా వంటి యుద్ధ సామాగ్రిని ఇవి గమ్యస్థానానికి అతి త్వరగా చేర్చే సామర్థ్యం ఉంది.  300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించడానికి అనువైన ప్రత్యేక సాంకేతిక వ్యవస్థ ఈ యుద్ధ విమానాల్లో ఉంటుంది. శత్రుసేనలపై నిమిషానికి 2500 రౌండ్ల పాటు కాల్పులు జరిపేలా 30 ఎంఎం క్యానన్‌ను ఇవి సంధించగల సామర్ధ్యం వీటిలో ఉంది.

వీటిలో మరో ప్రత్యేకత గగనతలం లోనే ఇంధనం నింపుకోగలవు.ఫ్రాన్స్‌తో భారత్ 2016లో ఒప్పందం చేసుకుంది. ఈ విమానాలు ఒక్కసారి ఇంధనాన్ని నింపుకుంటే 3,700 కి.మీ దూరం వరకు ప్రయాణం చేయగలవు.  పైలట్లకు రాత్రివేళల్లో స్పష్టంగా కనిపించేందుకు హెల్మెట్‌ మౌంటెడ్‌ డిస్ప్లే, రాడార్‌ రిసీవర్లు ఇందులో అమర్చారు. అంతేకాదు శత్రువుల సిగ్నల్‌ వ్యవస్థలకు అంతరాయం కలిగించే లో-బ్యాండ్‌ జామర్లు, ఇన్‌ఫ్రారెడ్‌ సెర్చ్‌, ట్రాకింగ్‌ లాంటి అత్యంత ఆధునిక సాంకేతిక వ్యవస్థలు రాఫెల్‌లో ఉన్నాయి. ఈ యుద్ధ విమానం అత్యంత ఎత్తైన ప్రదేశాల్లోనే కాదు అతిశీతల పరిస్థితుల్లో కూడా సమర్థంగా దూసుకుపోతాయి. మన దేశ సరిహద్దుల్లో ఉన్న ఎత్తైన మంచుపర్వతాల వెనుక పొంచి ఉండే శత్రుసైన్యాన్ని, వారి స్థావరాలను ఈ యుద్ధ విమానం నామరూపాలు లేకుండా చేయగలదు.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.