క్రేన్లు కూలి ఐదుగురు దుర్మరణం.. శంకరపల్లిలో ఘోర విషాదం

Publish Date:Apr 27, 2026

Advertisement

హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లి మండలంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా రెండు భారీ  క్రేన్లు కూలిపోవడంతో ఐదుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన మహాలింగాపురం గ్రామ పరిధిలోని నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ  సెంట్రల్ వర్క్‌షాప్‌లో చోటుచేసుకుంది.

ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు తమ విధుల్లో నిమగ్నమై ఉన్నారు. అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై భారీ గాలివాన మొదలవ్వడంతో మంది కార్మికులు రక్షణ కోసం సమీపంలోని ఒక తాత్కాలిక షెడ్డు కిందకు వెళ్లారు. అయితే, ప్రకృతి ప్రకోపం వారిని మృత్యురూపంలో వెంటాడింది. తీవ్రమైన గాలుల ధాటికి ట్రాకులపై ఉన్న క్రేన్లు అదుపుతప్పాయి. ఒక క్రేన్ వేగంగా కదులుతూ పక్కనే ఉన్న మరో భారీ క్రేన్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ తాకిడికి ఆ రెండు యంత్రాలు ఒక్కసారిగా కార్మికులు ఆశ్రయం పొందుతున్న షెడ్డుపై కుప్పకూలాయి.   ఈ ప్రమాదంలో బిహార్‌కు చెందిన నలుగురు, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఒక కార్మికుడు మరణించారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అత్యవసర సేవా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలుచేపట్టారు.  గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.  మృతదేహాలను పోస్టుమార్టం కోసం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

  క్రేన్లను నిలిపి ఉంచే సమయంలో వేయాల్సిన  సేఫ్టీ లాక్ లు వేయకపోవడమే ఈ ఘోరానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే బలమైన గాలులకు క్రేన్లు పట్టాల మీద కదిలి ఒకదానికొకటి ఢీకొన్నాయని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి  పోలీసులు ఎన్సీసీ యూనిట్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. పని ప్రదేశాల్లో కార్మికుల భద్రతను విస్మరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని కోరుతున్నారు. 

By
en-us Political News

  
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓపీఎల్) ఏకపక్ష వైఖరి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డిజిల్ సంక్షోభం తలెత్తిందని తేలింది.
ములుగు అడవి ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి పోలీసులు కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు.
హైదరాబాద్ నగరంలో మరోసారి అగ్నిప్రమాదం కలకలం రేపింది.
సెర్చ్ ఇంజిన్‌గా మొదలైన గూగుల్.. విశాఖలో ఏర్పాటు చేయబోతున్న సెంటర్ ద్వారా దేశానికే గ్రోత్ ఇంజిన్ కాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
అమరావతి నుంచి హైదరాబాద్‌, చెన్నైల మధ్య బుల్లెట్ ట్రైన్‌‌ను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది
ధర్మేంద్ర నుంచి అషు రెడ్డి సుమారు 5 కిలోల బంగారం, ఖరీదైన కార్లు, స్థిరాస్తులను పొందారు. ఈ మొత్తం విలువ రూ. 9.35 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అయితే, పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి అషు రెడ్డి మొహం చాటేయడమే కాకుండా.. తనపైనే తప్పుడు కేసులు పెడతానని బెదిరించినట్లు బాధితుడి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
పల్నాడులో ఇంధన విక్రయాలలో అక్రమాలకు పాల్పడుతున్న మూడు పెట్రోల్ బంకులను కలెక్టర్ సీజ్ చేశారు. నరసరావుపేట, చిలకలూరిపేట, పిడుగురాళ్ల లో నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు జరుపుతున్న మూడు ఫిల్లింగ్ స్టేషన్లను సీజ్ చేశారు.
శివారు అమ్మాపురం గ్రామానికి చెందిన కిన్నెర గుంశావలి కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురై తన ఇద్దరు కుమారులను స్థానిక వ్యవసాయ మార్కెట్ ఎదురుగా ఉన్న కాలీఫ్లవర్ పొలంలోని వేప చెట్టుకు ఉరేసి చంపేసి అనంతరం తానుకూడా ఆ చెట్టుకే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ ముగ్గురిలో బెయిల్ కోసం రోహిత్ రెడ్డి ఒక్కరే హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసులో అరెస్టైన ముగ్గురిలో మొదటిగా రోహిత్ రెడ్డి బెయిలుపై బయటకు వచ్చారు.
రవాణా, విద్యుత్ , పర్యాటక రంగాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణం ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల వల్ల సిక్కిం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటమే కాకుండా, సరిహద్దు ప్రాంతాల్లో అనుసంధానత మరింత బలోపేతం కానుంది.
హపూర్‌కు చెందిన ఒక యువకుడికి, అదే ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే, పెళ్లి రోజున వరుడు తన స్నేహితులతో కలిసి పూటుగా మద్యం సేవించి వివాహ వేదిక వద్దకు చేరుకున్నాడు. కనీసం స్టడీగా నడవలేని స్థితిలో పెళ్లివేదికపైకి వచ్చి తూలిపడిన వరుడి తీరు చూసి షాక్ తిన్న వధువు.. క్షణం ఆలస్యం చేయకుండా తనకు ఈ పెళ్లి వద్దని తేల్చి చెప్పేసింది.
రాష్ట్ర స్థాయి కమిటీ మినహా.. ప్రస్తుతం ఉన్న జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేశారు. అంతే కాకుండా పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలను సంపూర్ణంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుకు అప్పగించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.