Publish Date:Apr 16, 2022
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు...రాష్ట్ర రాజకీయాలలో తన పని పూర్తయ్యిందని భావిస్తున్నారా? జాతీయ రాజకీయాలపై సీరియస్ గా దృష్టి సారించారా? అన్న విషయంపై చాల కాలంగా రాజకీయాలలోనూ...ప్రజా బాహుల్యంలోనూ ఆసక్తికర చర్చలే జరుగుతూ వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఆయన జాతీయ రాజకీయ ప్రవేశం అన్నది ఒక అడుగు ముందుకు...రెండడుగులు వెనక్కు అన్న చందంగానే సాగింది.
అయితే ఇటీవలి పరిణామాలను గమనిస్తున్న వారికి వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఆయన జాతీయ రాజకీయాలపైనే పూర్తి దృష్టి కేంద్రీకృతం చేస్తారని అనిపించక మానదు. ఇటీవలే హస్తినలో పది రోజులు మకాం వేసిన ఆయన ఇప్పుడు మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. ఈ సారి పర్యటనలో ఆయన రైతులతో భేటీలకే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం అందిస్తారు.
కేంద్రంలో బీజేపీతో ఆయన ఇటీవలి కాలంలో ఘర్షణ వైఖరి అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రంతో అమీతుమీ తేల్చుకోవాలనే ఉద్దేశంలో ఉన్న ఆయనకు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఒకింత తలనొప్పిగానే మారాయి. ఉద్యోగాల ప్రకటన, వడ్ల పోరాటం ఇలా ఆయన మాటల మంత్రాలకు గతంలోల ప్రజల హర్షామోదాల చింతకాయలు రాలడం లేదు. జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలను కలుపుకుని ఫ్రంట్ కట్టాలన్న ఆయన వ్యూహాలూ పారడం లేదు. రాష్ట్రంలో వ్యతిరేకతను అధిగమించాలంటే కేంద్రంపై యుద్ధం ప్రకటించడ ద్వార జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీల మద్దతు కూడగట్టడమే మార్గమన్న భావనతో ఆయన అందివస్తుందనుకున్న ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీ యేతర పార్టీల నేతలతో జరిపిన వరుస భేటీలు ఫలితమివ్వకపోవడంతో ఆయన రైతు సమస్యలను ఆయధంగా కేంద్రంపై యుద్ధంప్రకటించారు. అయితే వడ్లు కొనుగోల వ్యవహారంలో పాచిక పారకపోవడంతో ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ ధర్నాలో రైతు నేత తికాయిత్ కు ప్రత్యేక ఆహ్వానం. ఇప్పుడు రైతు కుటుంబాల పరామర్శ. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల పోరాటానికి అన్ని పార్టీలూ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో రైతుల మద్దతుతో కేంద్రాన్ని ఢీ కొట్టాలన్నది ఆయన వ్యూహంగా విశ్లేషకులు చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/farmers-as-wepon-kcr-fight-with-center-25-134501.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.