మాజీ ఎంపీ, నటి రమ్య కన్నుమూత..ఈ ఫేక్ న్యూస్ వెనుక ఉన్నదెవరు?

Publish Date:Sep 6, 2023

Advertisement

ప్రముఖ నటి, మాజీ ఎంపీ రమ్య(దివ్య స్పందన) కన్నుమూశారని ప్రచారం జరుగుతోంది. 40 ఏళ్ళ రమ్య గుండెపోటుతో బుధవారం ( సెప్టెంబర్ 6) తుదిశ్వాస విడిచినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది.   అయితే ఈ వార్తల్లో నిజం లేదని ఆమె సన్నిహితలు చెబుతున్నారు. ఈ ఫేక్ ప్రచారం ఎవరి పని అని అభిమానులు ఆరా తీస్తున్నారు.  రమ్య తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించారు. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'అభిమన్యు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'లో ప్రియగా తన నటనతో కట్టిపడేసారు. రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఎంపీగా పనిచేశారు. రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీల విషయాలలో ఫెక్ న్యూస్ తలనొప్పులు సాధారణంగా వైరల్ అవుతుంటాయి.  సినీ సెలబ్రిటీల విషయంలో అయితే  ఫలానా వ్యక్తితో డేటింగ్ లో ఉన్నారు, ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ రకరకాల గాసిప్స్ వినిపిస్తుంటాయి. రాజకీయ ప్రముఖుల విషయంలో ఫలానా పార్టీలోకి మారుతున్నారు. మరో పార్టీతో మంతనాలు జరుపుతున్నారు వంటి వార్తలు సర్క్యులేట్ అవుతుంటాయి. అంతవరకు ఓకే గానీ.. మరీ బతికున్న వ్యక్తులను చంపేస్తూ కొందరు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను సృష్టిస్తుంటారు. తాజాగా ప్రముఖ నటి , మాజీ ఎంపీ రమ్య(దివ్య స్పందన) విషయంలోనూ అటువంటి ప్రచారమే జరిగింది. ఆమె గుండెపోటుతో మరణించారంటూ  ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇలా పోస్ట్ అయ్యిందో లేదో  అలా ఆ వార్త నిమిషాల్లో వైరల్ గా మారింది. కొన్ని వెబ్ సైట్లు, ఛానల్స్ సైతం ఆ వార్తను ప్రచారం చేశాయి. దీంతో పరామర్శలు స్టార్ట్ అయ్యాయి. రమ్య(దివ్య)కి, ఆమె సన్నిహితులకు పలువురు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. అప్పటిదాకా ఈ ఫేక్ న్యూస్ గురించి తెలియక.. ఎక్కడో జెనీవాలో గాఢనిద్రలో ఉన్న రమ్య.. ఒక్కసారిగా ఈ న్యూస్ గురించి తెలిసి షాక్ అయ్యారట. నేను బ్రతికే ఉన్నాను, ఎవరో ఏదో ట్వీట్ చేస్తే దానిని గుడ్డిగా ప్రసారం చేస్తారా అని రమ్య తనను సంప్రదించిన మీడియా వర్గాలు, సన్నిహితుల వద్ద అసహనం వ్యక్తం చేశారట.

ఇటీవల కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర భార్య స్పందన గుండెపోటుతో మరణించారు. ఆ వార్తనే కాస్త ఆలస్యంగా 'స్పందన'కు బదులుగా పొరపాటున 'దివ్య స్పందన' అని రాసి పోస్ట్ చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏది ఏమైనా బతికున్న వ్యక్తులను చనిపోయారంటూ ప్రచారం చేయడం ఏమాత్రం సమంజసం కాదు. అలాంటి వార్తల వల్ల కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు కంగారు పడతారు. సెన్సిటివ్ గా ఉండే వ్యక్తులకు, అనారోగ్య సమస్యలు ఉన్న వారికి.. అలాంటి వార్తల వల్ల  ప్రమాదం జరిగే అవకాశముంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.

By
en-us Political News

  
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.