నోరు జారిన దేవెగౌడ.. రూ.2 కోట్లు జరిమానా
Publish Date:Jun 22, 2021
Advertisement
కాలు జారినా ఓకే, నోరు జారితే అంతే... ఎంతకాలం అయినా అదలా వెంటాడుతూనే ఉంటుంది. మాజీ ప్రధాని దేవే గౌడ విషయమే తీసుకోండి, ఎప్పుడో పదేళ్ళ నాడు, ఆయన ఓ నిర్మాణ సంస్థను ఉద్దేశించి, ఓ అనరాని మాట అనేశారు. ఆ సదరు సంస్థ అప్పుడే అయన మీద ఓ పది కోట్ల రూపాయలకు పరవు నష్టం దావా వేసింది. ఇప్పుడా కేసు విచారణ పూర్తయింది. సదరు సంస్థకు ఓ రెండు కోట్ల రూపాయలు పరువు నష్టం చెల్లించాలని, దేవెగోడను ఆదేశిస్తూ న్యాయస్థానం తీర్పు నిచ్చింది. కేసు వివరాల లోకి వెళితే, 2011జూన్28 తేదీన ఒకకనడ టీవీ చానల్ , ‘గౌడ గర్జన’ పేరిట దేవెగౌడ ఇంటర్వ్యూ ప్రసారం చేసింది.ఈ ఇంటర్వ్యూ లో దేవెగౌడ, నంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్ప్రైజ్ (నైస్) అనే సంస్థపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సంస్థ ప్రతినిధులు, తమ పరువుకు భంగం వాటిల్లిందని ఆరోపిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన బెంగళూరులోని సిటీ సివిల్ అండ్ సెషన్స్ అదనపు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. సదరు సంస్థకు పరువు నష్టం కింద రూ.2 కోట్ల చెల్లించాలని సివిల్ కోర్ట్ న్యాయమూర్తి మల్లన గౌడ ఆదేశించారు. గతంలో ట్రయల్ కోర్టు ఆదేశాలపై అసంతృప్తి చెందిన దేవగౌడ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన పిటిషన్ను ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. తమకు రూ.10కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ నైస్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ క్రమంలో దేవగౌడ తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడంలో విఫలం కావడం వల్ల తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
పరువు నష్టం చెల్లించాలని తీర్పు ఇవ్వడంతో పాటుగా, న్యాయస్థానం పెద్దాయన పరవు తీసే విధంగా వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు. ఎన్ఐసీఈ (నైస్) ప్రాజెక్ట్’ను గతంలో కర్ణాటక హై కోర్టు, సుప్రీం కోర్టు సమర్ధించాయని న్యాయస్థానం గుర్తు చేసింది. ఇది రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం చేపట్టిన ప్రాజెక్ట్ అని పేర్కొంది. అల్లాంటి ప్రాజెక్ట్ విషయంలో పరవు నష్టం కలిగించే వ్యాఖ్యలను అనుమతిస్తే ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టిన ప్రాజెక్ట్ నిర్మాణం దెబ్బతింటుందని పేర్కొంది
http://www.teluguone.com/news/content/ex-prime-minister-devagowda-fined-two-crores-for-dirty-words-39-118127.html





