నీ కుట్రలు సాగవు బిడ్డా.. కేసీఆర్ కు ఈటల డైరెక్ట్ వార్నింగ్! 

Publish Date:Jun 23, 2021

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై డైరెక్ట్ వార్ ప్రకటించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. కమలాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో గులాబీ బాస్ టార్గెట్ గా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ కేసీఆర్ అని  రాజేందర్ మండిపడ్డారు. ఒడ్డు ఎక్కేదాక ఓడమల్లన్న.. ఒడ్డు ఎక్కిన తరువాత బోడ మల్లన్న తరహాలో కేసీఆర్ వ్యవహరిస్తారని ఆరోపించారు. అధికారం కోసం ఎంతకైనా తెగించే మనిషి కేసీఆర్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేవలం డబ్బులు, కుట్రలను నమ్ముకుని ఎన్నికలకు వస్తారన్నారు. 

‘‘నేను ప్రజల ప్రేమను నమ్ముకుని ముందుకు వెళుతున్నా. కేసీఆర్ కుట్రలను నమ్ముకున్నాడు. తెనేపూసిన కత్తిని కడుపులో పెట్టుకుని కుట్రలు చేస్తే హుజూరాబాద్ ప్రజలు సహించరు. నువ్వు కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్సీ స్థానాలు గెలవవచ్చు. కోట్లు కుమ్మరించి హుజూర్ నగర్, నాగార్జున సాగర్ గెలవచ్చు. కానీ హుజూరాబాద్‌లో నీ కుట్రలు సాగవు బిడ్డా’’ అంటూ ఫైర్ అయ్యారు. 

హుజురాబాద్ లో కోట్ల నిధులు మంజూరు చేస్తున్నారని, రేషన్ కార్డులు, ఫించన్లు మంజూరవుతున్నాయని సోషల్ మీడియాలో చూసా.. అన్ని నియోజకవర్గాల్లో కూడా మా ఎమెల్యే రాజీనామా చేస్తే బాగుండనని, ఎమ్మెల్యే చచ్చిపోతే బాగుండనని జనం అనుకునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందని ఈటల అన్నారు. ఇటీవల జరిగిన సభల్లో కేసీఆర్ మాటలు వింటే ధర్మానికి ప్రతిరూపమని, మాట తప్పని మనిషని అందరూ అనుకుంటారు.. కానీ ఆయన అసలు రంగు వేరే ఉందన్నారు. గొప్ప నేతలు, పార్టీలు ప్రజల్ని నమ్ముకుంటారని.. కేసీఆర్ మాత్రం డబ్బులు, కుట్రలు, మోసాన్ని నమ్ముకుంటారని రాజేందర్ మండిపడ్డారు.  ఈ కుట్రలను చరమగీతం హుజురాబాద్ నియోజకవర్గం చరమగీతం పాడబోతోందన్నారు. వందల కోట్లు పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ లో గెలవచ్చు.. కాని హుజురాబాద్ లో మాత్రం ధర్మం మాత్రమే గెలుస్తుందన్నారు.  

2006లో కేసీఆర్ రాజీనామా చేసినప్పుడు టీఆర్ఎస్ కు ఏ ప్రజాప్రతినిధుల బలం లేకున్నా, అవతలి పార్టీలు కోట్ల డబ్బులు ఖర్చు చేసినా ఉద్యమకారుల అండతో  గెలిపించామని చెప్పారు ఈటల. 
 తెలంగాణ ఉద్యమంలో పోలీసులు, ఉద్యమకారులు పోలింగ్ బూతుల దగ్గర కాపలాగా ఉన్నారన్నారు. ఇప్పుడు కూడా ఇదే తరహాలో తన విజయాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని ఈటల చెప్పారు. 
హుజురాబాద్ లో గెలిచి  తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గెలిపిస్తానని తెలిపారు

ఎస్సీలు, బీసీలు ఉపాధి కోసం లోన్లకు వెళ్తే సర్కారు ఇవ్వడం లేదు.. కానీ ఆదాయంపన్ను కట్టేవాళ్లకు మాత్రం లోన్లు  ఇస్తోందని ఈటల విమర్శించారు. వందల ఎకరాలు భూములన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రైతుబంధు ఎలా ఇస్తారని మాత్రమే అడిగానని చెప్పారు. తాను ఆరుసార్లు గెలిచినా ఏనాడు ఒక్క రూపాయి ఎవరికీ ఇవ్వలేదని.. మద్యం, బ్రాండీషాపు గురించి తెలియదని చెప్పారు. 
ఒక్క రోజు మీకు ప్రలోభ పెట్టే నాయకుడు కావాలా, 365 రోజులు పనిచేసే నాయకుడు కావాలా అని ప్రజలను ఓట్లు అడిగానని తెలిపారు. 

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.