ఫస్ట్ రౌండ్ లో ఈటలదే విన్! కేసీఆర్ దిగొచ్చారుగా... 

Publish Date:Jun 26, 2021

Advertisement

రాజకీయాలలో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చును. లెఫ్ట్ లో పుట్టి రీజినల్ పార్టీలో ఎదిగిన ఈటల రాజేందర్, రైటిస్ట్ పార్టీ బీజేపీలో చేరతారని ఎవరైనా ఉహించారా, ఒక్క ఈటల మాత్రమే కాదు, ఇంకా చాలా మంది, విభిన్న భావజాలాలకు చెందిన వారు, అందుకు విభిన్న భావజాల పార్టీలలో చేరి సర్దుకు పోతున్నారు. రాజకీయ అవసరాలు ఎంతటి వారిని  అయినా  చివరకు కేసీఆర్’ అంతిటి వాడినే అయినా, కిందకు దిగి వచ్చేలా చేస్తాయి. అందులోనూ అందితే జుట్టు, లేదంటే కాళ్ళు పటుకోవడంలో సిద్దహస్తుల  విషయం అయితే చెప్పనే అక్కర లేదు.  అదేమంటే, వసుదేవుడు ... గాడిద కాళ్ళు ఉండనే ఉన్నాయి. 

ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్న చరిత్రను చూస్తే, అదే అనిపిస్తుంది. ప్రతిపక్షాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంత గౌరవం ఇస్తారో, అందరికే తెలిసిన విషయమే. ఇంతవరకు ప్రగతి భవన్’లో కాలు పెట్టిన ప్రతిపక్ష నాయకులను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చును.సరే, మంత్రులకే ఎంట్రీ లేని కోటలోకి, ప్రతిపక్ష పార్టీల నాయకులకు ఎంట్రీ లేక పోవడం పెద్ద విచిత్రం కాదు. నిజమే, కుక్క మనిషిని కరిస్తే అది వార్త కాదు. మనిషి కుక్కను కరిస్తే అది వార్త ... అని కదా అంటారు.  అందుకే కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ ఇవ్వడం సంచలన బ్రేకింగ్ వార్త అయింది. 

 కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జగ్గా రెడ్డి. కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డి బృందానికి ప్రగతి భవన్’లోకి ఎంట్రీ కాదు. ఏకంగా రెడ్ కార్పెట్ స్వాగతమే లభించింది. అంతే, కాదు కాంగ్రెస్ నేతలకు అడిగిందే తడవుగా అప్పాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా,యదాద్రి జిల్లా గూడూరు పోలీసి స్టేషన్’లో దళిత మహిళ మరియమ్మ అనుమాన స్పద మృతిపై ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని పుచ్చుకుని, నిముషాల్లోనే, చర్యలు తీసుకున్నారు. మరియమ్మ మృతిపై విచారణకు ఆదేశించారు. నిజ నిర్ధారణ చేసి చట్ట ప్రకారం  చర్యలు తీసుకోవాలని, అవసరం అయితే, మరియమ్మ  మృతికి బాధ్యులైన వారిని ఉద్యోగం  నుంచి తొలిగించాలని, బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించాలని డీజీపీని ఆదేశించారు. అంతే కాదు మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్’కు రూ.15 లక్షలు, ఆమె ఇద్దరు కుమార్తెలకు రూ.10 లక్షల వంతున ప్రభుత్వ సహాయం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. అంతే కాదు, ఎస్సీల పట్ల సమాజ దృక్పధం మారాలని, ఎస్సీలు పేదలపట్ల పోలీసుల ఆలోచనాదోరణి మారాలని ముఖ్యమంత్రి  ఉద్భోదించారు. ఎస్సీల  మీద చేయి  పడితే ఊరుకునేది లేదని ఓ హెచ్చరిక కూడా చేశారు.  

ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులకు అప్పాయింట్మెంట్ ఇవ్వడమే చిత్రం, విచిత్రం అనుకుంటే, ఇలా నిముషాల్లో విపక్ష నేతల డిమాండ్లను జీహుజూర్ తరహాలో అములు చేయడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అయితే ఇందంతా  హుజురాబాద్ మహత్యం అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.  హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్ర  రాజకీయ భవిష్యత్’ను ముఖ్యంగా తెరాస భవిష్యత్’ను తిరగరాసే ప్రమాదం పొంచి ఉందని, అందుకే కేసీఆర్’ లో ఈమార్పు అని  అంటున్నారు. నిజానికి, హుజురాబాద్, ఈటల ఎఫెక్ట్’ తోనే కేసీఆర్, ఫార్మ్ హౌస్ వదిలి ప్రజల్లోకి వెళ్లారు.అధికార కార్యక్రమాల పేరున వెళ్ళినా, ఎన్నికల ప్రసంగమే చేశారు. ఇక, హుజురాబాద్ ‘లో అయితే మంత్రులు,  ఎంపీలు, ఎమ్మెల్యేలను రేషన్ కార్డులు ఇతర  ప్రయోజనాలను ఇంటింటికి పంచుతున్నారు. మరో  రాజకీయ  బేరసారాలు జోరుగా సాగుతున్నాయాని, ఈటల ఇతర బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయినా అది వేరే విషయం అనుకోండి. 

అయితే మార్పు మంచిదే అయినా, ఎస్సీల మీద చేయిపడితే ప్రభుత్వం ఊరుకోబోదని, నిందితులపై తక్షణమే కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హెచ్చరిక స్వాగతించ దగినదే అయినా, యాదాద్రి లాకప్‌డెత్ ఘటనపై నిమిషాల్లో  విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి , ఏళ్లు గడిచిపోతున్నా నేరెళ్లలో దళితులపై జరిగిన భౌతిక దాడులపై అవే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న సందేహాలు సహజంగానే వ్యక్తమవుతున్నాయి. నేరెళ్ళ దురాగతం జరిగి ఇన్నేళ్ళు అయినా, ఇప్పటకీ, కేటీఆర్ తమ సొంత నియోజకవర్గం సిరిసిల్లకు ఎప్పుడు వెళ్ళినా, దళితులను అరెస్ట్ చేయడం, లాఠీలు విరగడం  రొటీన్’ గా జరిగి పోతూనే ఉంది, కదా.. అన్న ప్రశ్నలు కూడా దళిత వర్గాల నుంచే వినవస్తున్నాయి. ముఖ్యమంత్రి మొదలు అధికార పార్టీ అగ్రనేతలు హుజురాబాద్’ ఉప ఎన్నిక విషయంలో వ్యవహరిస్తున్నతీరు చూస్తే, ఎందుకో ఉలిక్కి పడుతున్నట్లు కనిస్తోంది. అందుకే, ఫస్ట్ రౌండ్’లో ఈటలదే పై చేయి అంటున్నారు విశ్లేషకులు.

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.