Publish Date:Aug 11, 2023
రానున్న ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేయించాలని బిజెపి అధిష్టానం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.అధికారికంగా తెలంగాణ బిజెపి జాబితారానప్పటికీ ముఖ్యమంత్రి కెసీఆర్ స్వంత నియోజకవర్గం గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈటెలను నిలబెట్టాలని పార్టీ వర్గాలు యోచిస్తున్నట్టు సమాచారం.
ఈటెల బీఆర్ఎస్ ను వీడి వేరే బిజెపిలో చేరడానికి గల కారణాలను కాసేపు పక్కన పెడితే... అసలు కేసీఆర్ కి, ఈటలకు మధ్య ఇంత దూరం ఎందుకు వచ్చింది అనే విషయం ఇప్పటికీ ఇంకా ఎవరికీ అంతుబట్టడం లేదు. ఒకప్పుడు ఈటెల కెసీఆర్ కు అత్యంత సన్నిహితుడు. వైద్య, ఆరోగ్య శాఖ వంటి ప్రాధాన్యం ఉన్న శాఖను కేసీఆర్ ఈటెలకు కట్టబెట్టారు. ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు గానీ సడెన్ గా మంత్రిపదవి నుండి తొలగించారు. ఈ పరిణామం ఈటెల వర్గీయుల్లో ఆందోళన నెలకొనేలా చేశాయి. ఈటెల సైతం అదే స్థాయిలో కేసీఆర్ పై యుద్ధాన్ని ప్రకటించారు.ఇది చాలా మందికి ఆశ్చర్యపరిచింది. రెండు దశాబ్దాల పాటు ఈటెల కేసీఆర్ అడుగులో అడుగు వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెరాస శాసన సభా పక్ష నేతగా కూడా ఈటెల పనిచేసారు. టిఆర్ఎస్ లో నమ్మిన బంటు ఈటెల. అటువంటిది ఆయన్ని పార్టీ నుంచి బయటకు పంపారు కెసీఆర్.
వాస్తవంగా 2019లో ఈటెల చేసిన వ్యాఖ్యలు కెసీఆర్ ను ఇబ్బందుల్లో పడేసింది. గులాబీ జెండాకు యజమానులు ఎవరూ ఉండరనే వ్యాఖ్యలు దుమారం రేపాయి. టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే యజమానులు ఈటెల నర్మగర్భంగా చెప్పారు.
టిఆర్ఎస్ పార్టీ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీగా మారిపోయిందని పలు సందర్భాల్లోఈటెల ఆరోపించారు. కుటుంబ పార్టీగా మారిపోయిందని ఈటెల విమర్శించారు.
ఈ నేపథ్యంలో ఈటెల కుమార్తె పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చారు. పార్టీ క్యాడర్ తో వివిధ పార్టీలకు చెందిన నేతలు పలువురు వచ్చారు.
కొందరు పనిగట్టుకుని ఈటల బలప్రదర్శనగా అభివర్ణించారు.
ఆర్టీసీ సమ్మె విషయంలో కూడా ఈటల బాహాటంగా కార్మికులకు మద్దతు ఇచ్చారు.
ఈటెల , కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్దానికి దిగినట్టయ్యింది.
అప్పట్నుంచి ఈటెల వచ్చే ఎన్నికలలో కేసీఆర్ ప్రాతినిద్యం వహిస్తున్నగజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటిస్తూ వచ్చారు. ప్రత్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కేసీఆర్ ఉండకపోవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/etela-contest-from-gajwel-39-159826.html
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.