ఈటల మళ్లీ కారెక్కేస్తున్నారా?

Publish Date:Jan 30, 2026

Advertisement

ఈటల రాజేందర్.. తెలంగాణ రాజకీయాలలో పరిచయం అక్కర్లేని పేరు. వామపక్ష భావజాలం ఉన్న ఆయన తెలంగాణ సాధన ఉద్యమంలో కేసీఆర్ తో అడుగు కలిపి నడిచారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ తో అడుగు కలిపి, ఆ పార్టీ సీనియర్ నేతగా సుదీర్ఘ కాలం సేవలందించారు.  తెలంగాణ ఆవిర్భావం తరువాత   తొలి సారి రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. బీఆర్ఎస్ రెండో సారి గెలిచిన తరువాత తొలి కేబినెట్ లో స్థానం దక్కకపోయినా, కేబినెట్ విస్తరణ సమయంలో మళ్లీ మంత్రిగా అవకాశం దక్కింది. సరే తరువాత తరువాత కేసీఆర్ తో విభేదాలు తలెత్తాయి అది వేరే సంగతి. కానీ బీఆర్ఎస్ లో ఉంటూనే ఆత్మగౌరవ నినాదంతో ఆయనను ధిక్కరించి పార్టీ నుంచి బయటకు వచ్చిన సాహసోపేత నాయకుడిగా తెలంగాణ సమాజం ఆయనను గుర్తుం చుకుంటుంది. 

బీఆర్ఎస్ అధినేతతో విభేదించిన ఈటల కాంగ్రెస్ గూటికి చేరతారనే అప్పట్లో అంతా అనుకున్నారు. అయితే అనేక తర్జన భర్జనల అనంతరం ఆయన అనూహ్యంగా బీజేపీలో చేరారు. అప్పట్లో ఈటల బీజేపీ గూటిక చేరడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తం అయ్యింది. రాజకీయ అనివార్యతే ఈటల కాషాయం గూటికి చేరడానికి కారణమని సరిపెట్టుకున్నా.. బీజేపీలో చేరినప్పటి నుంచీ ఆయన ఒంటరే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది. అందుకు తగ్గట్టుగానే గతంలో పలుమార్లు ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పడం ఖాయమన్న వార్తలు పలు మార్లు గట్టిగా వినిపించాయి. అయితే పార్టీలో ఉక్కపోతను తట్టుకుంటూ ఆయన బీజేపీలోనే కొనసాగుతూ వస్తున్నారు. ఇటీవలి కాలంలో బీజేపీలో ఈటలకు పొమ్మనలేక పోగపెడుతున్నారా? అన్న అనుమానాలు కలిగేలా పరిణామాలు సంభవించాయి. ఇటీవలి తెలంగాణ పంచాయతీ ఎన్నికలలో పలు చోట్ల కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్, అలాగే ఈటల వర్గీయులు కూడా బీజేపీ అభ్యర్థులుగానే  ప్రత్యర్థులుగా బరిలో నిలబడ్డారు. ఈ పోటీలో బండి వర్గీయులే విజయం సాధించారు. అక్కడితో ఆగకుండా ఆ తరువాత బండి సంజయ్ పీఆర్వో సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఈటలకు బీజేపీలో కనీస గుర్తింపు కూడా కరవయ్యిందా అన్న అనుమానాలు కలిగేలా ఉన్నాయి.

పంచాయతీ ఎన్నికలలో ఈటల వర్గీయులకు బీజేపీ మద్దతు ఇవ్వలేదని బండి సంజయ్ పీఆర్వో అనడం బీజేపీలో అంతర్గత పోరు ఏ స్థాయిలో ఉందో తేటతెల్లం చేసింది.  బండి సంజయ్ పీఆర్వో వ్యాఖ్యలకు ఈటల ఇచ్చిన కౌంటర్ అప్పుడే ఈటల తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయిపోయారనేలా ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా ఈటల కేసీఆర్ నా బాస్ అంటూ చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ గా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.  తాజాగా మల్కాజ్ గిరి నియోజకవర్గ పరిధిలో   పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈటల రాజేందర్ ఆ నియోజకవర్గ ఎంపీ హోదాలో శంకుస్థాపన చేశారు.

ఆ కార్యక్రమానికి అదే మల్కాజ్ గిరి నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ మర్రి రాజశేఖరరెడ్డి బాస్.. అదే మా బాస్  కేసీఆర్ అంటూ ఈటల అన్నారు. ఈ వ్యాఖ్యలు ఈటల నోటి నుంచి పొరపాటుగా వచ్చాయని బీజేపీ వర్గీయులు అంటున్నప్పటికీ.. రాజకీయవర్గాలలో మాత్రం ఈటల బీజేపీకి దూరం కావడం ఖాయమన్న సంకే తాలుగా చర్చ జరుగుతోంది.   ఈటల బీఆర్ఎస్ లో చేరతారని, అందుకే ఇలా మాట్లాడారు అని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. 

By
en-us Political News

  
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.