ఎల్ఈటీ కీలక నేత.. షేక్ యూసుఫ్ అఫ్రిది హతం

Publish Date:Apr 27, 2026

Advertisement

పాకిస్థాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాద సంస్థల కీలక నేతలే లక్ష్యంగా సాగుతున్న  దాడులు సరికొత్త మలుపు తిరిగాయి. నిషేధిత ఉగ్ర  సంస్థ లష్కర్-ఎ-తయిబా (ఎల్ఈటీ)లో అత్యంత కీలకమైన వ్యక్తి, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌కు అత్యంత నమ్మకస్తుడైన షేక్ యూసుఫ్ అఫ్రిది  హత్యకు గురయ్యాడు.  ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన ఈ  ఘటనతో ఉగ్ర వర్గాల్లో  కలకలం రేగింది. అత్యంత పకడ్బందీగా జరిగిన ఈ దాడి.. పాక్‌లో ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా సాగుతున్న క్రమబద్ధమైన ఆపరేషన్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. షేక్ యూసుఫ్ అఫ్రిది తన కదలికలను గోప్యంగా ఉంచినప్పటికీ.. దుండగులు అతడిని వెంబడించి మరీ కాల్పులు జరిపారు. చాలా దగ్గరి నుంచి కాల్చడంతో అఫ్రిది ప్రాణాలు అక్కడిక్కడే మరణించాడు. కాల్పులు జరిపిన అనంతరం దుండగులు సమీపంలోని దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల వైపు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ దాడి జరిగిన తీరు చూస్తుంటే ఇది ఆకస్మికంగా జరిగినది కాదనీ, పక్కా ప్రణాళికతో అమలు చేసిన  టార్గెట్ కిల్లింగ్  అని స్పష్టమవుతోంది. హతుడు యూసుఫ్ అఫ్రిది ఎల్ఈటీలో  ఫీల్డ్ కమాండర్ మాత్రమే కాదు..  ఆ సంస్థకు ఒక మేధావిగా, సిద్ధాంతకర్తగా కూడా  గుర్తింపు పొందాడు. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రాంతంలో ఉగ్రవాదుల నియామకాలు, వారికి ఆయుధ శిక్షణ, స్థానిక నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంలో   కీలకంగా వ్యవహరించేవాడు.  ముఖ్యంగా అఫ్రిది తెగకు చెందినవాడు కావడంతో తన సామాజిక సంబంధాలను ఉపయోగించుకుని ఉగ్ర  కార్యకలాపాలను విస్తరించాడు. భారత సరిహద్దుల్లో, ముఖ్యంగా జమ్మూ-కాశ్మీర్‌లో అశాంతిని రేకెత్తించేందుకు అవసరమైన లాజిస్టికల్ మద్దతును సమకూర్చడంలోనూ ఇతని హస్తం ఉన్నట్లు బలమైన అనుమానాలు, ఆధారాలూ కూడా  ఉన్నాయి. 

ఈ హత్య వెనుక ఉన్నదెవరు అనే దానిపై ప్రస్తుతం అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ దాడికి బాధ్యత వహించలేదు. ఉగ్రవాద సంస్థల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు, నిధుల కోసం జరిగే ఆధిపత్య పోరు ఈ హత్యకు దారితీసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అలాగే..   పాకిస్థాన్‌పై అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి కారణంగా..  తమ గడ్డపై ఉన్న ఉగ్రవాదులను వదిలించుకునేందుకు అక్కడి ఏజెన్సీలే రహస్య ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌లో ఉగ్ర  నేతలు వరుసగా హతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ  ఏడాదిలో ఇప్పటివరకు దాదాపు  30 మందికి పైగా టెర్రరిస్టులు ఇలాంటి దాడుల్లోనే హతమ్యారు. 

గతంలో హఫీజ్ సయీద్ సన్నిహితుడు అబూ ఖతల్, జైష్ నేత మౌలానా మసూద్ అజర్ సోదరుడు తాహిర్ అన్వర్ వంటి వారు కూడా అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ వరుస ఘటనలు చూస్తుంటే..  ఒకప్పుడు పాకిస్థాన్‌ అండతో పెరిగిన ఉగ్ర  శక్తులు ఇప్పుడు అవే శక్తుల చేతిలో లేదా గుర్తుతెలియని  శత్రువుల చేతిలో తుడిచిపెట్టుకుపోతున్నట్లు కనిపిస్తోంది.యూసుఫ్ అఫ్రిది మరణం లష్కర్ సంస్థకు కోలుకోలేని దెబ్బగా పరిగణించవచ్చు. ఒక కీలకమైన సమన్వయకర్తను కోల్పోవడం వల్ల ఆ సంస్థ కార్యకలాపాల్లో తాత్కాలికంగానైనా సరే  స్తబ్దత ఏర్పడే అవకాశం ఉంది.  ఏదిఏమైనా  పాకిస్థాన్‌లో సాగుతున్న ఈ  అదృశ్య యుద్ధం ఆ దేశ అంతర్గత భద్రతా సమీకరణాలను మారుస్తోందనడంలో సందేహం లేదు. 

- సీతారాం కంఠంనేని

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా లండన్ పర్యటనలో ఉన్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సీపీఆర్వో గా పనిచేస్తున్న మారబోయిన మధుసూదన్ ఆకస్మిక మృతి పట్ల ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు
హైదరాబాద్ నగర సమీపంలోని శంకర్పల్లి ప్రాంతంలో సోమవారం సాయంత్రం సమయంలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
విశాఖపట్నం నగరానికి గర్వకారణమైన ఆంధ్రా యూనివర్సిటీ వందేళ్ల ఉత్సవాల ముగింపు వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి.
కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
ఈ సమీక్షకు పౌర సరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సివిల్ సప్లై ఉన్నతాధికారులు, పెట్రోలియం కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమస్య పరిష్కారానికి ఆదివారం రాత్రి నుంచి ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై సీఎం అధికారులను వివరణ కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన అనుచిత వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అంబర్‌పేట్ చే నంబర్ చౌరస్తా వద్ద సోమవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
సాంకేతిక నిపుణులకు ఆండ్రాయిడ్ అందించే డెవలపర్ ఆప్షన్స్ ఒక అద్భుతమైన వరం. ఐఫోన్‌లో ఇటువంటి నియంత్రణ పొందాలంటే ఎక్స్-కోడ్ వంటి పరికరాల సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆండ్రాయిడ్‌లో నేరుగా ఫోన్ నుండే యానిమేషన్ వేగాన్ని మార్చుకోవడం.. బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్ నియంత్రించడం వంటి వాటి ద్వారా ఫోన్ వేగాన్ని పెంచుకోవచ్చు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగం ఈసారి ఆసక్తికర సంకేతాలను ఇస్తోంది.
భారతీయ సంస్కృతిలో మాతృదేవో భవ అనే వాక్యానికి అక్షర రూపం ఇచ్చారు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సోదరులు.
ఐటీ వర్సెస్ ఏఐ అనేది ఒక యుద్ధంలా కాకుండా, ఒక పరిణామంలా చూడాలంటారు నిపుణులు. నిజం చెప్పాలంటే.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవు, కానీ ఉద్యోగాల స్వ‌రూప‌- స్వభావాలు మారిపోతాయంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.