మహిళల బ్యాడ్మింటన్ లో ముగిసిన అద్భుత శకం.. ఆటకు గుడ్ బై చెప్పిన కరోలినా మారిన్

Publish Date:Mar 27, 2026

Advertisement

మహిళల బ్యాడ్మింటన్ లో అనితర సాధ్యమన్న స్థాయిలో తనదైన ముద్ర వేసిన స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్ తన క్రీడా జీవితానికి ముగింపు పలికింది.  ఈ విషయాన్ని ఆమె సామాజిక మాద్యమ వేదికగా ప్రకటించింది.  బ్యాడ్మింటన్ రంగంలో తన అద్భుతమైన ఆటతీరుతో దశాబ్ద కాలానికి పైగా అగ్రస్థానంలో కొనసాగిన స్పెయిన్ దిగ్గజం కరోలినా మారిన్ చివరి సారిగా 2024 పారిస్ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్ లో ఆడింది. అప్పుడు ఆట మధ్యలోనే మోకాలి గాయంతో వైదొలగిన కరోలినా మారిన్ ఆ తరువాత ఇప్పటి వరకూ బ్యాడ్మింటన్ కోర్టులో కనిపించలేదు.  అప్పటి నుంచీ  వేధిస్తున్న మోకాలి గాయం కారణంగానే తానీ రిటైర్మెంట్ నిర్ణయానికి వచ్చినట్లు ఆ భావోద్వేగ పోస్టులో పేర్కొంది.

 బ్యాడ్మింటన్ కు పెద్దగా ఆదరణ లేని స్పెయిన్ నుంచి వచ్చి తన అసాధారణ ఆటతీరుతో బ్యాడ్మింటన్ లో , ఆసియా దేశాల ఆధిపత్యాన్ని సవాల్ చేసిన కరోలినా మారిన్  2016 రియో ఒలింపిక్స్‌లో భారత స్టార్ పీవీ సింధును ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుంది. తద్వారా మారిన్ ప్రపంచ బ్యాడ్మింటన్ చరిత్రలో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకుంది. అంతకు ముందు 2015 ఏప్రిల్‌లో తొలిసారి ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును అందుకున్న కరోలినా.. ఆ స్థానంలో దాదాపు వంద వారాల పాటు కొనసాగింది.  

ఇక భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ లకు కరోలినా మారిన్ కొరకరాని కొయ్యగా నిలిచింది. పీవీ సింధుతో తన కెరీర్ లో 18 సార్లు ముఖాముఖీ తలపడిన కరోలినా మారిన్ 12 సార్లు విజయం సాధించింది. అలాగే సైనాతో 13 సార్లు ముఖాముఖీ పోరు జరిగితే అందలో ఏడు సార్లు కరోలినా మారిన్ విజయం సాధించింది. 

తన రిటైర్మెంట్ ప్రకటనలో కరోలినా మారిన్ గాయాల తీవ్రత దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని పేర్కొంది. వాస్తవానికి వచ్చే నెలలో  తప  స్వదేశంలో జరిగే యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో ఆడి కెరీర్‌ను ఘనంగా ముగించాలని భావించాననీ, అయితే అందుకు శరీరం సహకరించలేదనీ పేర్కొంది.   కరోలినా మారిన్ రిటైర్మెంట్ తో మహిళల బ్యాడ్మింటన్ లో ఒక అద్భుత  శకం ముగిసిందని చెప్పాలి. అయితే ఆమె పోరాట పటిమ భవిష్యత్ తరాలకు పాఠంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.  

By
en-us Political News

  
ఆగస్టు 11న దేశీయంగా బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీలతో సహా ప్రధాన నగరాల్లో 24K, 22K మరియు 18K బంగారం లేటెస్ట్ రేట్లు ఎంత పెరిగాయో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టులోకి సర్ఫరాజ్ ఖాన్ పునరాగమనం చేయడంపై మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్పిన్ ట్రాక్‌లపై ధృవ్ జురెల్ కంటే సర్ఫరాజ్ ఖానే ఎందుకు సరైన ఎంపికో కైఫ్ విశ్లేషించారు.
విదేశాంగ శాఖతో లోకేశ్ సంప్రదింపులు.. మాతృభూమికి రప్పించేందుకు ప్రయత్నాలు.. !
2027 వన్డే ప్రపంచకప్‌నకు వెస్టిండీస్ జట్టు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ఐసీసీ ర్యాంకింగ్స్, క్వాలిఫైయర్ సమీకరణాలు, అఫ్గానిస్థాన్ విజయం విండీస్‌పై చూపిన ప్రభావం మరియు 14 జట్ల టోర్నీ అర్హత మార్గం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ బో వెబ్‌స్టర్ కేమరాన్ గ్రీన్‌తో పోటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన టెస్టు గణాంకాలు మరియు ప్లేయింగ్ ఎలెవన్ విషయమై వెబ్‌స్టర్ వెల్లడించిన ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.
చార్మినార్ ప్రాంతానికి చెందిన దంపతులకు ఇద్దరు కవల పిల్లలు జన్మించగా ఆరు నెలలకే  కవలలు జన్మించారు.
బ్రేకులు బాగుచేస్తుండగా ముందుకు కదిలిన బస్సు చక్రాల కింద నలిగి మెకానిక్ మృతి..!
ట్రంప్ తమ డిమాండ్లన్నింటినీ పూర్తిగా అంగీకరిస్తే తప్ప ఎలాంటి చర్చలకు తావులేదని కుండబద్దలు కొట్టేసింది.  ట్రంప్ హయాంలో  ఒప్పందం కుదిరే ప్రసక్తే లేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ సలహాదారు మజిద్ షాకేరీ ఈ మేరకు విస్పష్ట ప్రకటన చేశారు.
తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు..పోలీస్ బాస్ ఆగ్రహం..!
ప్రశ్నించే జర్నలిస్టులపై కేసులు..ఏపీలో మాయమవుతున్న పత్రికా స్వేచ్ఛ..!
పాతబస్తీలోని చారిత్రాత్మక అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో ఆషాఢ బోనాల ఉత్సవా ల్లో కీలక ఘట్టమైన ఘటం ఊరేగింపు సోమవారం ఘనంగా ప్రారంభమైంది.
కొండల్లో కోటానుకోట్ల విలువైన ఖనిజ సంపద... కాళ్ళ కిందే అపరిమితమైన బంగారు గని లాంటి బాక్సైట్ నిల్వలు..
“హలో సార్.. మేడమ్.. మేము ఫైనాన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం.. మీకు తక్కువ వడ్డీకే భారీ లోన్ మంజూరైంది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.