Publish Date:Jun 16, 2025
కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసును తెలంగాణ హైకోర్టు సోమవారం (జూన్ 16) కొట్టివేసింది. 2021 నవంబర్ 15న ఉమ్మడి నల్లొండ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ సందర్భంగా ఆయన ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఎటువంటి ముందస్తు అనుమతీ లేకుండా భారీ కాన్వాయ్ తో ర్యాలీ నిర్వహించారని అప్పట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పెన్ పహాడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాటి నుంచీ ఈ కేసు
2021 నవంబర్ 15వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బండి సంజయ్ ఒక ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో ఆయన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో భారీ వాహనాలతో, ముందస్తు అనుమతి లేకుండా కాన్వాయ్‌తో ర్యాలీ చేపట్టారని ఎన్నికల అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పెన్‌పహాడ్ పోలీసులు బండి సంజయ్‌పై కేసు నమోదు చేశారు.ఈ కేసు హైదరాబాద్ లోని ప్రజాప్రతినిథుల కోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ కేసును క్వాష్ చేయాలని కోరుతూ బండి సంజయ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బండి సంజయ్ పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ కేసు కొట్టేయాల్సిందిగా ఆదేశిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/election-code-violation-case-on-bandi-sanjay-dismissed-25-200078.html
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.