Publish Date:Oct 10, 2023
తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాల్లో ఈ సంవత్సరం ఎన్నికలు జరుగనున్నాయి. సోమవారం మధ్యాహ్నం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, చత్తీస్గఢ్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. భారత ఎన్నికల కమిషన్ నిన్న మధ్యాహ్నం షెడ్యూల్ను విడుదల చేసింది. చత్తీస్గఢ్ మినహా మిగతా రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మిజోరంలో నవంబరు 7న ఒకే విడతలో ఎన్నికలు పూర్తికానుండగా, చత్తీస్గఢ్లో అదే నెల 7, 17 తేదీల్లో రెండు విడతలుగా జరుగుతాయి. మధ్యప్రదేశ్లో 17న, రాజస్థాన్లో 23న పోలింగ్ జరగనుండగా, తెలంగాణలో 30న ఎన్నికలు జరుగుతాయి. డిసెంబరు 3న ఫలితాలు వెల్లడిస్తారు. షెడ్యూల్ ప్రకటనతోనే ఈ ఐదు రాష్ట్రాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది.
ఈ కోడ్లో రాజకీయ పార్టీలు ఏం చేయకూడదో చూద్దాం.
- ఎన్నికలతో సంబంధం ఉన్న ఏ అధికార పార్టీ నేతలను కానీ, మంత్రులను కానీ వారి ఇంటి వద్ద వ్యక్తిగతంగా కలవకూడదు.
- ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కానీ, పార్టీ నేత కానీ తమ ఇంటి వద్ద కార్యక్రమాలు నిర్వహించకూడదు. అయితే, తమ సొంత ఖర్చుతో మాత్రం చేసుకోవచ్చు.
-ఏదైనా పథకం కానీ, ప్రాజెక్టుకు కానీ కోడ్ అమల్లోకి రావడానికి ముందే గ్రీన్ సిగ్నల్ లభించి, క్షేత్రస్థాయిలో పని ప్రారంభం కాకపోతే, కోడ్ అమల్లోకి వచ్చాక ఆ పని ప్రారంభించడానికి వీల్లేదు.
- అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వ ధనంతో ప్రకటనలు ఇవ్వకూడదు.
- ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ తమ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయకూడదు.
- కోడ్ అమల్లోకి వచ్చాక పెన్షన్ ఫాంలు స్వీకరించడం, కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, బీపీఎల్ కుటుంబాలు ఎల్లో కార్డులు జారీ చేయడం నిషేధం.
- ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆయుధ లైసెన్స్ ఇవ్వకూడదు.
* టెండర్లు జారీ చేయడం కానీ, కొత్త పనులు ప్రారంభించడం కానీ ప్రభుత్వం చేయకూడదు.
* కోడ్ అమల్లో ఉండగా కొత్త పనులు ప్రారంభించడం, పెద్ద భవనాలకు క్లియరెన్స్ ఇవ్వడం నిషేదం.
ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే ఎన్నికల కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/election-code-impose-dont-do-this-39-163103.html
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.