ఈగ కాక్రోచ్ కాపీ కాదంటున్న రాజమౌళి
Publish Date:Oct 10, 2012
Advertisement
ఈగ సినిమా అచ్చం కాక్రోచ్ ని కాపీకొట్టినట్టుందని ఊరూవాడా కోడైకూస్తోంది. కాక్రోచ్ నిర్మాత, దర్శకుడు తమ సినిమాని కాపీకొట్టారని రుజువుచేసేందుకు కావాల్సిన ఆధారాలన్నీ సేకరించుకుని కేసేసేందుకు రెడీ అవుతున్నారు. నార్తిండియాలో ఈగ హిందీ వెర్షన్ మక్కీ ప్రచారంకోసం వెళ్లిన రాజమౌళి ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తిగా తన ఈగ సినిమా కొత్తదేనన్నారు. దాన్ని రుజవుచేయడానికి కావాల్సిన ఆధారాలు పూర్తిగా తన దగ్గరున్నాయని, ఈ విషయంలో తాను ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని గట్టిగా చెబుతున్నాడు. ఈగ సినిమాని తయారుచేయడానికి ముందు చాలా హాలీవుడ్ సినిమాల్ని చూశానని, కాక్రోచ్ మూవీని కాపీకొట్టాల్సిన అవసరం తనకు లేదని డైరెక్టర్ రాజమౌళి అంటున్నారు. ఈగ సినిమా స్క్రిప్ట్ మొత్తం రాసుకోవడం పూర్తయ్యాకే నిర్మాణంలో వైవిధ్యంకోసం హాలీవుడ్ సినిమాల్ని చూశానని, కాక్రోచ్ తీసిన విధానంకూడా ఈగ సినిమా తీసిన విధానంలాగే ఉండడం కాకతాళీయం తప్ప కాపీ కొట్టడం కాదని రాజమౌళి నెత్తీనోరూ కొట్టుకుని చాటింపేసుకుంటున్నా తెలుగు ప్రేక్షకులవెరూ వినడానికి సిద్ధంగా లేరుమరి..
http://www.teluguone.com/news/content/eega-not-copy-cockroach--31-18053.html





