వైఎస్ అవినాష్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఈడీ దాడులు.!

Publish Date:Aug 20, 2026

Advertisement

వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ అవినాష్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలపై ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. వైఎస్ వివేకా కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆయన నివాసాలు, కార్యాలయాలు, అలాగే ఆయన ముఖ్య అనుచరుల నివాసాలలో కూడా ఈడీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్‌,   కడప, పులివెందులలోని  ప్రాంతాల్లో దాదాపు 10 ప్రదేశాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో తనిఖీలను చేపట్టాయి.  శుక్రవారం (ఆగస్టు 21)  తెల్లవారుజాము నుంచే ప్రారంభమైన ఈ సోదాల సందర్భంగా కేంద్ర బలగాల  భారీగా మోహరించి భద్రత కల్పిస్తున్నారు. అవినాష్ రెడ్డి తండ్రి  వైఎస్ భాస్కర్ రెడ్డి, అలాగే అవినాష్ రెడ్డికి   సన్నిహితులైన పలువురు కీలక అనుచరుల  డి. శివశంకర్ రెడ్డి,  సునీల్ యాదవ్, ఇతర అనుచరుల నివాసాల్లోనూ ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. 

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి   హత్య కేసుకు సంబంధించి నమోదైన మనీ లాండరింగ్ నిరోధక చట్టం కేసు దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు జరుగుతున్నట్ల చెబుతున్నారు.  ఈ కేసుకు సంబంధించి సిబిఐ   ఎఫ్ఐఆర్,  3 అనుబంధ చార్జ్‌షీట్ల ఆధారంగా ఈడీ   2025 ఆగస్టులో లో ఈసిఐఆర్   కేసు నమోదు చేసి  దర్యాప్తును చేపట్టిన సంగతి తెలిసిందే.  

 మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చిన 11ప కడప జిల్లాలోని ఆయన స్వగృహంలోనే హత్యకు గురైన సంగతి విదితమే.   ఆ తర్వాత మార్చి 11, 2020న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేసింది.  వివేకానందరెడ్డి హత్య వెనుక రాజకీయ, ఆర్థిక కోణాలు, కుట్రలతో పాటు   40 కోట్ల రూపాయలకు పైగా  ఆర్థిక లావాదేవీల ప్రతిపాదనలు ఉన్నట్లు సిబిఐ దర్యాప్తులో తేలింది. హత్యకు ముందు, తర్వాత జరిగిన సందేహాస్పద నగదు బదిలీలు, ఆస్తుల కొనుగోళ్లు, హవాలా మార్గాలు,  బెదిరింపుల ఆధారాలను వెలికితీసేందుకు  ఈడీ  రంగంలోకి దిగింది.  

శుక్రవారం (ఆగస్టు 21) తెల్లవారుజాము చేపట్టిన ఈడీ తనిఖీల్లో   కీలకమైన ఆస్తి పత్రాలు, బ్యాంక్ ఖాతాల రికార్డులు, డిజిటల్ సాక్ష్యాలు, హార్డ్ డిస్క్ లు మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.   వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించే కాకుండా,  ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కోణాలపై కూడా ఈడీ బృందాలు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ కేసులో  16 మంది అరెస్టు, పలు దఫాల విచారణల తరువాత  ఈడీ నేరుగా ఎంపీ నివాసాలపై  నివాసాలు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించడం సంచలనం సృష్టిస్తోంది.  

ED Raids in Telugu States, YS Avinash Reddy, YSRCP MP, Vivekananda Reddy Case, ED Searches Hyderabad, PMLA Investigation

By
en-us Political News

  
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రముఖ నటి, పద్మశ్రీ అవార్డు గ్రహీత షావుకారు జానకి మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.
వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూశారు.   ఆమె భౌతికకాయాన్ని అభిమానులు, సినీ ప్రముఖుల సందర్శనార్థం చెన్నైలోని తేనాంపేట, సెంట్ ఆఫ్‌ రోడ్‌లో ఉన్న ఆమె నివాసంలో ఉంచారు.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ పుంజుకుంటుంది.. !
రాష్ట్రపతికి సునీత లేఖ తర్వాత కేసును ఈడీ టేకాఫ్..!
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేగుతోంది.
 ఘటనా స్థలాన్ని సందర్శించిన మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. భద్రతా నియమాలు పాటించకపోవడం, క్రమశిక్షణా రాహిత్యం కారణంగానే ఈ ఘోరం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్థారంచారు.  
 సోమాలియాలోని పుంట్‌ల్యాండ్ పరిధిలోని ఎయిల్ జిల్లా మార్రాయా తీరానికి   3.5 నాటికల్ మైళ్ల   దూరంలో ఎనిమిది మంది సాయుధులైన సోమాలియా పైరేట్లు   నౌకపైకి విరుచుకుపడి, దానిని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ తర్వాత నౌకను నుగాల్ తీరం వైపు  మళ్లించారు.
లండన్ తో పాటు అమెరికాలోని ప్రముఖ నగరాలైన బోస్టన్, న్యూయార్క్ ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇందుకు సంబంధించిన  షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
ఆ వివాదాల పరిష్కారం దిశగా ముందుకు సాగేందుకు సదరన్ జోనల్ కౌన్సల్ దోహదం చేసిందన్న ఆశను రేకెత్తించింది. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ( తెలంగాణ సీఎం మినహా) ఒకే వేదికపై కనిపిండమే కాకుండా ఆత్మీయంగా ముచ్చటించుకుంటున్న దృశ్యం కన్నుల పండువగా ఉంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.