Publish Date:Mar 18, 2023
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కవిత పిటిషన్ ఈ నెల 24వ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అయితే కవిత పిటిషన్‌కు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సుప్రీంకోర్టులో శనివారం (మార్చి 18) కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై తమ వాదనలు కూడా వినాలని ఈడీ పిటిషన్‌లో కోరింది.
అంతేకాకుండా కవిత కేసు విషయంలో ఎలాంటి ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని.. తమ వాదన కూడా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఈడీ ఆ పిటిషన్‌లో కోరింది. ఇక ఈడీ తాజాగా కేవియట్ పిటిషన్‌తో దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు కవిత వాదనతో పాటు ఈడీ వాదనలు కూడా విననుంది. ఆ తర్వాతే కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది.
దేశ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత.. ఈ నెల 11వ తేదీన ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. 16వ తేదీన మరోసారి విచారణకు రావాలని ఈడీ పిలిచింది. అయతే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆమె 16వ తేదీన విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ నెల 20వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ed-kaviat-in-supreme-court-25-152703.html
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.