చదువుతోపాటే సంపాదన.. ఏపీ ప్రభుత్వ కొత్త స్కీమ్!

Publish Date:Jun 20, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ చదువుకునే విద్యార్థులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి  ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, చదువుకునే రోజుల్లోనే విద్యార్థులు సొంతంగా సంపాదించుకునేలా ఒక వినూత్న, విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యను నేరుగా ఉపాధితో అనుసంధానం చేస్తూ  ఎంబెడెడ్ డిగ్రీ కోర్సులను పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కోర్సులు చదివే విద్యార్థులకు మూడో ఏడాదిలో నేరుగా కార్పొరేట్ కంపెనీలు, పరిశ్రమలలో పెయిడ్ ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తాయి. ఈ విధానం ద్వారా విద్యార్థులు చదువుకుంటూనే నెలనెలా స్టైపెండ్ రూపంలో  ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. 

ఈ సరికొత్త విద్యా విధానానికి సంబంధించిన విధివిధానాలపై ఇటీవల మంగళగిరిలో ప్రభుత్వం,  స్కిల్ కౌన్సిల్ ప్రతినిధులు అత్యున్నత స్థాయి సమావేశంలో   కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మూడేళ్ల కాలపరిమితి గల ఈ ఎంబెడెడ్ డిగ్రీ కోర్సులలో  చేరిన విద్యార్థులకు మొదటి రెండేళ్లు సాధారణ  అకడమిక్ బోధన ఉంటుంది. ఇందులో సబ్జెక్టు పరిజ్ఞానంతో పాటు ఆధునిక ప్రపంచానికి అవసరమైన ప్రాథమిక డిజిటల్ నైపుణ్యాలపై కాలేజీలోనే ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత డిగ్రీ చివరి సంవత్సరం అంటే మూడో ఏడాదిలో విద్యార్థులు నేరుగా క్షేత్రస్థాయి పరిశ్రమలతో అనుసంధానమైన ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లోకి అడుగుపెడతారు.

ఈ ఇంటర్న్‌షిప్‌ కోసం విద్యార్థులను ఎక్కడికో పంపించరు. వివిధ స్కిల్ కౌన్సిళ్లు అధికారికంగా సూచించిన ప్రముఖ పరిశ్రమలు, ఐటీ సంస్థలు,  వ్యాపార సంస్థలలోనే ఈ లైవ్ ట్రైనింగ్ ఉంటుంది. అక్కడ విద్యార్థులు కేవలం పరిశీలకులుగా మాత్రమే కాకుండా, ప్రత్యక్షంగా కంపెనీ పనుల్లో భాగస్వామ్యం అవుతూ రియల్ టైమ్ పని అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకుంటూ పారిశ్రామిక రంగానికి ఎలాంటి ఉద్యోగులు కావాలో అలాంటి నైపుణ్యాలను డిగ్రీ పూర్తికాకముందే సముపార్జించుకుంటారు. దీనివల్ల కాలేజీ నుంచి బయటకు వచ్చే సమయానికే విద్యార్థి చేతిలో మూడేళ్ల డిగ్రీ సర్టిఫికెట్‌తో పాటు ఒక ఏడాది పూర్తిస్థాయి  వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా సిద్ధంగా ఉంటుంది.

ఇక అన్నిటికంటే ఆకర్షణీయమైన అంశం ఏమిటంటే, ఈ వన్ ఇయర్ ఇంటర్న్‌షిప్ సమయంలో విద్యార్థులకు అందించే స్టైపెండ్.  ఈ కాలంలో ప్రతి నెలా   6 వేల 900 నుంచి 15 వేల రూపాయల వరకూ కంపెనీల నుంచి నేరుగా విద్యార్థుల అకౌంట్లలో జమ అవుతుంది. ఈ ఆర్థిక తోడ్పాటు గ్రామీణ,   మధ్యతరగతి విద్యార్థులకు తమ సొంత ఖర్చుల కోసం ఎవరిపైనా ఆధారపడకుండా నిలబడేలా చేస్తుంది.

ఇక ఇంటర్న్ షిప్  వారిలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఒక బలమైన బూస్ట్ లా పనిచేస్తుంది. ఈ పద్ధతి వల్ల చదువు పూర్తయ్యే నాటికే ప్రతి విద్యార్థి కార్పొరేట్ ఉద్యోగాలకు 100 శాతం అర్హత సాధిస్తారు.  ఆంధ్రప్రదేశ్‌లోని ఆయా జిల్లాల్లో ఉన్న పారిశ్రామిక క్లస్టర్ల అవసరాలను బట్టి, అక్కడ ఏ రకమైన ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయో చూసి, వాటికి తగినట్లుగా సరికొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు ఉన్నత విద్యామండలి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ పూర్తి చేసింది. చదువుతో పాటు నైపుణ్యం, చేతినిండా ఆదాయం ఇచ్చే ఈ సరికొత్త పథకం ఏపీలో నిరుద్యోగ సమస్యను సమూలంగా నిర్మూలించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
అయితే బస్సును సీజ్ చేసిన తర్వాత ప్రయాణికుల గమ్యస్థానానికి వెళ్లేందుకు ప్రత్యామ్నాయ బస్సు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులతో సహా ప్రయాణికులందరూ రాత్రంతా సీజ్ చేసిన బస్సులోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నగరంలోని వీఆర్సీ సెంటర్ సమీపంలో, అలాగే రూరల్ పరిధిలో ఆమె ఒక పక్కా ప్లాన్ ప్రకారం నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని తన దందా సాగించింది.
బడ్జెట్ ధరలో బెస్ట్ ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్నారా సిట్రోయెన్ ఈసీ3ఎక్స్ మరియు టాటా టియాగో ఈవీ కార్ల ధర, మైలేజ్ రేంజ్, బ్యాటరీ సామర్థ్యం మరియు సేఫ్టీ ఫీచర్ల పూర్తి వివరాలు మీకోసం.
ముంబై నగర తాగునీటి జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకరంగా 9 శాతానికి పడిపోయాయి. అప్పర్ వైతర్ణ డ్యామ్ పూర్తిగా ఎండిపోగా, ఐఎండీ జూన్ 22 నుండి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
మనీ లాండరింగ్ మరియు ఉగ్రవాద నిధుల నిరోధక గ్లోబల్ సంస్థ FATF వైస్ ప్రెసిడెంట్‌గా భారత ఐఏఎస్ అధికారి వివేక్ అగర్వాల్ చారిత్రాత్మక నియామకం. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఒక చిన్న టైలరింగ్ షాపు నుంచి కోట్ల రూపాయల లగ్జరీ బ్రైడల్ బ్రాండ్‌గా ఎదిగిన రియాసత్ లైఫ్ స్టైల్ ఐపీఓ సక్సెస్ స్టోరీ, సబ్‌స్క్రిప్షన్ తేదీలు, లిస్టింగ్ వివరాలు మరియు కంపెనీ బిజినెస్ ప్లాన్స్ ఇప్పుడు పూర్తిగా తెలుసుకోండి.
ప్రముఖ ఇన్వెస్టర్ మధుసూదన్ కేలా గురుగ్రామ్‌లోని డిఎల్ఎఫ్ ది డహ్లియాస్ ప్రాజెక్ట్‌లో రూ. 121 కోట్లతో అల్ట్రా లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారు. చదరపు అడుగుకు రూ. 1.93 లక్షల ధరతో ముంబై, ఢిల్లీ రికార్డులను బద్దలు కొట్టిన ఈ భారీ నివాస ఒప్పందం పూర్తి వివరాలు, ధరల పెరుగుదల మరియు ప్రాజెక్ట్ ప్రత్యేకతలను ఇక్కడ తెలుసుకోండి.
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan) 23వ విడత కింద 9 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లోకి రూ. 2,000 జమ అయ్యాయి. మీ మొబైల్‌లోనే పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మరియు బ్యాంక్ ఖాతా సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అమెరికా, యూరప్ వెళ్లే భారతీయ ప్రయాణికులకు జర్మనీ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఫ్రాంక్‌ఫర్ట్, మ్యూనిచ్ ఎయిర్‌పోర్ట్‌ల మీదుగా ప్రయాణించే వారికి ఇకపై ట్రాన్సిట్ వీసా అవసరం లేదని ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు, సింగిల్ PNR టికెట్ మరియు లగేజీ రూల్స్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
గాజాలో తీవ్రమైన యుద్ధం వల్ల ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. 51% మందుల కొరత, ఆసుపత్రుల విధ్వంసంతో వేలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ నేపథ్యంలో భారతదేశం తక్షణమే స్పందించి ఆరోగ్య మైత్రి కింద వైద్య సహాయం అందించాలని పాలస్తీనా రాయబారి అబ్దుల్లా అబు షావేష్ చేసిన పూర్తి భావోద్వేగపూరిత విజ్ఞప్తి వివరాలు ఇక్కడ చదవండి.
 చంద్రబాబు సమాజంలోని అందరినీ సమానంగా చూసే ఒక గొప్ప లీడర్ అని, అందుకే ఇక్కడి ప్రజలు ఆయన్ని ఎంతో గౌరవిస్తూ, దేవుడిలా భావిస్తారన్నారు.  
అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ బంగారం ధరలపై సంచలన అంచనాలను వెల్లడించింది. భవిష్యత్తులో 10 గ్రాముల బంగారం ధర రూ. 2 లక్షలు దాటే అవకాశం ఉందా పూర్తి వివరాలు, ట్యాక్స్ లెక్కలు ఇక్కడ చూడండి.
మ్యాక్ ఓఎస్‌లో కోడింగ్ మరియు డ్రాగ్ అండ్ డ్రాప్ కష్టాలు లేకుండా, కేవలం సాధారణ ఇంగ్లీష్ ప్రాంప్ట్‌తో ఆపిల్ షార్ట్‌కట్స్ క్రియేట్ చేసే సరికొత్త ఓపెన్ సోర్స్ టూల్ Shortcuts Playground పూర్తి వివరాలు మీకోసం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.