ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. ఎర్లీ ట్రెండ్స్.. బెంగాల్ లో బీజేపీ.. తమిళనాడులో డీఎంకే జోరు
Publish Date:May 3, 2026
Advertisement
దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి రేకెత్తించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం (మే 4) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో వెలువడుతున్న తొలి ట్రెండ్స్ రాజకీయ పార్టీల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. భారత ఎన్నికల సంఘం పటిష్టమైన భద్రత నడుమ కౌంటింగ్ ప్రక్రియను చేపట్టింది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను ఆ తరువాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తున్నారు. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది. ఇక తమిళనాడు విషయానికి వస్తే.. అధికార డీఎంకే కూటమి తన బలాన్ని నిరూపించుకుంటూ దూసుకుపోతుండగా, నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం టీవీకే తన ఉనికిని బలంగా చాటుకుంటోంది. పట్టణ ప్రాంతాల్లో విజయ్ పార్టీ అభ్యర్థులు కొన్ని చోట్ల ఆధిక్యంలో ఉండటం విశేషం. మరోవైపు.. అన్నాడీఎంకే వెనుకబడినట్లు కనిపిస్తోంది. కేరళలో ఈసారి ప్రత్యామ్నాయ అధికార మార్పిడి ఆనవాయితీ కొనసాగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. గత రెండు పర్యాయాలుగా అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్ కు ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గట్టి సవాలు విసురుతోంది. తొలి ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. యూడీఎఫ్ జోరు గట్టిగా ఉందని అనిపిస్తున్నది. ముఖ్యంగా ఉత్తర కేరళలో యూడీఎఫ్ స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. బీజేపీ కూడా కొన్ని స్థానాల్లో ముందంజలో ఉంది. ఒక అసోం రాష్ట్రంలో ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. అధికార ఎన్డీయే కూటమి హ్యాట్రిక్ సాధించడం ఖాయమనిపిస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కొన్ని చోట్ల మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక పుదుచ్చేరి విషయానికి వస్తే ఇక్కడ ఎన్డీయే, ఇండియా కూటముల మధ్య హోరాహోరీ పోరుజరుగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందనేది చెప్పడం కష్టంగానే ఉంది.
http://www.teluguone.com/news/content/early-trend-in-five-states-elections-39-218890.html





