జగన్ అంటే దుల్కర్ సల్మాన్ కీ దడే!

Publish Date:Sep 8, 2023

Advertisement

మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి నటుడిగా ఉన్నత శిఖరాలను అందుకున్నారు. ఆయన కెరీర్‌లో చేయని పాత్ర లేదు. మలయాళంలోనే కాదు, ఇతర భాషల్లో కూడా ఆయనకి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ కూడా విభిన్నమైన క్యారెక్టర్లు, విభిన్నమైన సినిమాలు చేస్తూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. మలయాళంతోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్న దుల్కర్‌ డబ్బింగ్‌ సినిమాలతోనే కాదు స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలతోనూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. 

ఇప్పుడు దుల్కర్‌ చేస్తున్న సినిమాల కంటే ముందే ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది. అదే ‘యాత్ర2’. 2019లో వై.యస్‌.రాజశేఖరరెడ్డి జీవితం ఆధారంగా రూపొందించిన ‘యాత్ర’ చిత్రంలో వైఎస్‌ఆర్‌గా మమ్ముటి నటించారు. వైఎస్‌ఆర్‌ పాత్రలో మమ్ముట్టి జీవించారు. ఈ సినిమా  2019 ఎన్నికలలో వై.ఎస్‌.జగన్‌ విజయానికి ఎంతగానో దోహదపడిందనడానికి సందేహించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 2024 ఎన్నికల నేపథ్యంలో మళ్లీ వి.రాఘవ్‌ దర్శకత్వంలో ‘యాత్ర 2’ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వైఎస్‌ఆర్‌, జగన్‌ మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించనున్నారు.

మొదట ఈ సినిమాలో వై.ఎస్‌.జగన్‌ పాత్రకు దుల్కర్‌ సల్మాన్‌ని అనుకున్నారట. తండ్రి మమ్ముట్టి వైఎస్‌ఆర్‌గా నటించారు కాబట్టి తనయుడు దుల్కర్‌ అయితే జగన్‌ పాత్రకు అతికినట్లు సరిపోతాడని భావించిన దర్శకుడు దుల్కర్‌కు  ‘యాత్ర 2’ గురించి చెప్పి ఆ సినిమీలో జగన్ పాత్ర పోషించాలని కోరారట. అయితే ఇందుకు దుల్కర్ విముఖత చూపారు.

 తాను వై.ఎస్‌.జగన్‌ పాత్ర పోషించడం వల్ల రాజకీయంగా  ఇబ్బందులు వస్తాయని, అది తన సినిమా కెరీర్‌ని దెబ్బ తీస్తుందని  దుల్కర్‌ భావించి ఆ ఆఫర్‌ని నిర్ద్వంద్వంగా తిరస్కరించాడని చెబుతున్నారు.  దీంతో జగన్‌ పాత్ర కోసం జీవాని ఫిక్స్‌ చేసుకున్నారు. మొత్తం మీద జగన్ రాజకీయ ప్రత్యర్థులకే కాదు.. సినీ జీవులకూ దడే అంటే నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

By
en-us Political News

  
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.