మొయినాబాద్ డ్రగ్స్ కేసులో షాకింగ్ విషయాలు!

Publish Date:Mar 15, 2026

Advertisement

 

హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ గ్రామంలో ఉన్న ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీపై పోలీసులు దాడి చేయడంతో కలకలం రేగింది. ఈ ఘటనలో కాల్పులు జరగడం, కొకైన్ స్వాధీనం కావడం సంచలనంగా మారింది. మొత్తం 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. మార్చి 14 రాత్రి సుమారు 8 గంటల సమయంలో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎం.డి. నయీముద్దీన్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. అజీజ్‌నగర్ గ్రామంలో ఉన్న వ్యాపారి పంజుగుల రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో కొందరు వ్యక్తులు మాదక ద్రవ్యాలు మరియు భారీ మొత్తంలో మద్యం వినియోగిస్తూ పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం వచ్చింది. 

ఈ సమాచారాన్ని వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేసిన ఎస్‌ఐ, NDPS చట్టం ప్రకారం అవసరమైన ప్రక్రియలు పూర్తి చేసి ప్రత్యేక బృందంతో ఫామ్‌హౌస్‌కు బయలుదేరారు. ఈగల్ (TGNAB) బృందం, షాద్‌నగర్ SOT, చేవెళ్ల పోలీస్ బృందాలు, క్లూస్ టీమ్ సభ్యులు మరియు రెండు అధికారిక సాక్షులతో కలిసి పోలీసులు రాత్రి సుమారు 9.40 గంటలకు ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న వెంటనే సిబ్బంది ఫామ్‌హౌస్‌ను చుట్టుముట్టి లోపలికి ప్రవేశించారు. ఈ సమయంలో పోలీసులు తమను పరిచయం చేసుకుని సోదాలు నిర్వహించనున్నట్లు ప్రకటించగా, ఫామ్‌హౌస్ లోపలి నుంచి ఒక్కసారిగా కాల్పులు జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

తక్షణమే అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ‘మేడ్ ఇన్ జర్మనీ’ అని ముద్రించిన .32 కాలిబర్ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ రివాల్వర్‌లో ఒక లైవ్ రౌండ్, ఒక ఖాళీ తూటా కవచం ఉండగా, అక్కడి నుంచి మరికొన్ని ఖాళీ తూటా కవర్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిత్ శర్మగా గుర్తించారు. అతని పక్కనే ఉన్న సిల్వేరి శరత్ కుమార్ వద్ద నుంచి మూడు ఖాళీ తూటా కవచాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫామ్‌హౌస్‌లోని స్విమ్మింగ్ పూల్ పక్కన ఏర్పాటు చేసిన సోఫాల్లో కూర్చుని మద్యం సేవిస్తున్న మరో 9 మంది పురుషులు, ఒక మహిళను పోలీసులు గుర్తించారు. 

వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా శరత్ కుమార్ వద్ద చిన్న ప్యాకెట్‌లో కొకైన్ డ్రగ్ ఉన్నట్లు అతను స్వయంగా ఒప్పుకున్నాడు. ఈ పార్టీలో దొరికిన 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. అయితే అందులో ఆరుగురికి మాత్రం పాజిటివ్ రాగా మరికొందరికి నెగటివ్ వచ్చింది. దీంతో పోలీసులు మరోసారి 11మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. అందులో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు సేకరించిన బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షించగా మహేష్ కుమార్‌కు డ్రగ్స్ పాజిటివ్‌గా తేలినట్లు వెల్లడించారు. 

అయితే మహేష్ కు మొదట నిర్వహించిన యూరిన్ టెస్ట్‌లో మాత్రం నెగిటివ్ వచ్చింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి మరోసారి బ్లడ్ టెస్ట్ నిర్వహించారు.ఈవిచారణలో భాగంగా యూరిన్ శాంపిల్స్‌లో నీళ్లు కలిపినట్లు అధికారులు గుర్తించారు. నీళ్లు కలపడం వల్లే యూరిన్ టెస్ట్‌లో డ్రగ్స్ నెగిటివ్‌గా వచ్చినట్లు తేల్చారు. బ్లడ్ టెస్ట్‌లో మాత్రం మహేష్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు స్పష్టంగా బయటపడింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి కూడా డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది. వీకెండ్ సందర్భంగా పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్‌లోని తన ఫామ్‌ హౌస్‌లో పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ డ్రగ్స్ పార్టీలో వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నట్లు అధికారులు చెబుతున్నారు. 

ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. పోలీసులు సేకరించిన ఆధారాల ఆధారంగా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, కౌశిక్ రవి ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా పర్యటనకు వెళ్లిన సమయం లో ఒక గుర్తుతెలియని వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. అనంతరం వాటిని హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ కేసు నేపథ్యంలో అదుపులోకి తీసుకున్న ఏలూరు ఎంపీ పుత్త మహేష్ యాదవ్‌కు పోలీసులు స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. ఆయనతో పాటు పుట్టా మధు, ప్రియాంక రెడ్డికి కూడా అధికారులు బెయిల్ ఇచ్చారు. రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీకి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అవసర మైన న్యాయపరమైన ప్రక్రియలు పూర్తి చేసిన తర్వాత వారిని విడుదల చేశారు.
 

By
en-us Political News

  
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
గ‌త ఎన్నిక‌ల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వితను అరెస్టు చేయ‌కుంటే ఈ రెండు పార్టీల మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్న‌ట్టేనని జ‌నం అనుకుంటారని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి. ఈ కామెంట్ ఎంత‌గా ప‌ని చేసిందంటే రేసులో సెకండ్ ప్లేస్ లో ఉన్న‌.. బీజేపీని థ‌ర్డ్ ప్లేస్ లో ప‌డేసింది. చావుతప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌ట్టు.. బొటాబొటిగా 8 మంది ఎమ్మెల్యేల‌తో స‌రిపెట్టుకుంది బీజేపీ.
పెరిగిన జనాభాకు అనుగుణంగా అసెంబ్లీ, లోక్ సభ స్థానాలను పెంచాలన్న డిమాండ్, ప్రతిపాదనా చాలా కాలంగా ఉంది. అంతే కాకుండా నియోజ‌క‌వ‌ర్గం ఎంత చిన్న‌గా ఉంటే.. ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అంత వేగంగా ప‌రిష్క‌రించ‌గ‌లుగుతారు. ఇక ప్రస్తత నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన దాదాపు 30శాతం ఉంది. ఇది భారీ మార్పు అనే చెప్పాలి. అలాగే ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రధాన ప్రతిపక్షం అయ్యుండీ ఎన్నికల సన్నాహాల విషయంలో ఇంత నిర్లప్తంగా, నిరాసక్తంగా వ్యవహరించడంతో పార్టీ క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఎన్నికలంటేనే స్టార్ క్యాంపెయినర్ల పర్యటనలు, అగ్రనేతల ప్రసంగాలతో నానా హడావుడీ చేసే కాంగ్రెస్ లో ప్రస్తుతం నమ్మశక్యంకాని నిశ్శబ్ధం తాండవిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.