మ‌ధ్యాన్నం క‌ల‌! 

Publish Date:Oct 6, 2022

Advertisement

అన‌గ‌న‌గా ఓ రాజ్యం. రాజుగారికి రోజూ తినే తిండి, గానాబ‌జానాలు, భ‌జ‌న‌లు విసిగెత్తాయి. ఒక‌రోజు తెల్లా ర‌గ‌ట్టే లేచి ఎవ‌రూ చూడ‌కుండా మారువేషంలో న‌గ‌రంలోకి వెళ్లాడు. అప్పుడే పొలానికి పోతున్న రైతులు, దుకాణం తీసినళ్లూ రాజుగారి వ్య‌వ‌హార‌శైలి పెద్ద‌గా న‌చ్చ‌డంలేద‌న్న‌దే మాట్లాడుకుంటున్నారు. పాత సినీమాల్లో ఎన్టీఓడులా చెట్టెన‌గ్గా ఉండి చెవులారా విని భ‌వంతికి తిరిగి వ‌చ్చాడు. ఆహా ఏమి ప్ర‌జ నేనంటే నిజంగానే చాలా యిష్టంగా తిట్టుకుంటున్నారు. మంత్రి, సేనాధిప‌తిని మ‌న‌స్పూర్తిగా చంపాల‌న్న ఆలోచ న చేశాడు. వీళ్లు దుర్మార్గులు అనుకున్నాడు. ఈ ప్ర‌జ‌ల కోసం ఏద‌న్నా చేయాల‌ని ఆలోచించాడు రాజు. అంతే వెంట‌నే గుర్రాన్ని మార్చాడు, డ్ర‌స్ మార్చాడు, త‌ల‌పాగా కూడా మార్చేసి తెల్ల‌టి వ‌స్త్రం ఒక‌టి త‌ల‌కి చుట్టుకుని మంచి లాఠీలాంటి క‌ర్ర చేత‌ప‌ట్టి రైతులా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ బ‌య‌టికి వెళ్లా డు. అలా వెళ్లిన వాడు రెండురోజులు ఎవ‌రికీ క‌నిపించ‌లేదు. మూడో రోజు వ‌చ్చి ప‌తాకం రంగు మార్చి, నివాసం రంగు మార్చి ప‌క్క రాజ్యంవాళ్లూ వీల‌యినంత హాశ్చ‌ర్య‌ప‌డేలా వేరే గుర్రం మీద వేరే ప్రాంతాల‌కు వెల్ల‌డానికి ముహూర్తం పెట్టుకున్నాడు. 

బ‌య‌లుదేరేముందు చిన్న మీటింగ్ పెట్టి స‌తీమ‌ణికి, సోద‌రుడుకి, కుమారుడికి చెప్పాల‌నుకున్న‌ది చెప్పేసి వాల్ల‌కి అర్ధం అయేలోపు గుర్రం ఎక్కి వెళిపోయాడు. అలా వెళ్లినాయ‌న నేను మారాను, నా ప‌తాకం పేరు, రంగూ మ‌ర్చాను.. ఇపుడు నేను మీ వాడిని కూడా అంటూ ప‌క్క రాజ్యం త‌న రాజ్యం స‌రిహ‌ద్దు గ్రామంలో మైకులో అరిచిన‌ట్టు అరిచి మ‌రీ చెప్పాడు. ముందుగా చూసిన న‌లుగురూ విన్నారు. వాళ్లేళ్లి అక్కడి గ్రామ పెద్ద‌కి చెప్పారు. ఆయ‌న ఎవుడో ఎర్రోడు అనుకున్నాడు చుట్ట‌పీక అంచు కొరుకుతూ. కాదు నా మాట న‌మ్మండి అంటూ ఒక క‌బురు పెట్టాడు ఈ రాజుగారు. 

ఇంత‌కీ అస‌లు సంగ‌తేంద‌బ్బాయ్‌.. అన్నాడు ఓ పండు ముస‌లాయ‌న‌. ఏం లేద‌య్యా.. మా రాజ్యం ప‌ర‌మ బోరింగ్‌గా ఉంది, మీ ఊళ్లో కొన్నాళ్లుండి, కొత్త‌ద‌నం ఆస్వాదించాల‌నుకుంటున్నాను అన్నాడు రాజు. ఏ మీ రాజ్యంలో రాజుగారు పారిపోయాడా?  వెత‌క‌డానికి ఈ దారంట బోతున్నావ్‌? అని అడిగాడు దుకాణం త‌లుపు తీస్తూ ఓ పెద్దాయ‌న‌. అబ్బే అదేం లేదు.. ఆయ‌న భేషుగ్గానే ఉన్నాడు. నాకే బోర్ కొట్టింది. అందు వ‌ల్ల నేనే ఆయ‌న‌కు మారుగా కొత్త‌గా ఏద‌న్నా చేయాల‌నుకుంటున్నాను అన్నాడు. అంతే వెంట‌నే ఓ ముసలామె వ‌చ్చి.. ఇయాల్టికి మా మేక‌ల్ని తోలికెళ్లి చీక‌టిప‌డేతాల్కి తోల్కురా నాయ‌నా.. గ్లాసుడు మ‌జ్జిగ ఇత్తా అన్న‌ది. మా రెండో స‌తీమ‌ణి కంటే వేయి రెట్టు న‌యం అనుకున్నాడు మారు వేషంలోని రాజు. 

రాజు ఆ మ‌ధ్యాన్నం చింత‌చెట్టు కింద మంచినీళ్లు తాగుతూ కూచుని ఆలోచించాడు.. ఈ అమాయ‌కు ల‌కు ఏద‌యినా చేయొచ్చ‌ని. ఇక్క‌డి రాజు పెద్ద‌గా ప‌నిమంతుడు, త‌న‌లాగా తెలివిమంతుడ‌యినా కాద‌ని తెలు సుకున్నాడు. ఎలాగూ డ్ర‌స్ మార్చుకున్నాగ‌దా అని పేరు కూడా మార్చుకుని స్థిర‌ప‌డితే ఎలా ఉం టుంద ని అనుకున్నాడు. అటుప‌క్క‌గా వెళుతున్న ఓ కుర్రాడిని పిలిచి, ఏమోయ్ ఇక్క‌డ‌, అదే మీ రాజ్యంలో అన్నీ స‌క్ర‌మంగా జ‌రుగుతున్నాయా? స‌మ‌యానికి అన్ని అందుబాటులో ఉంటున్నాయా? అని కొన్ని పిచ్చిప్ర‌శ్న‌లు వేశాడు. అత‌ను అనుమానంగా చూసి, రాజుగారున్నారు.. ఆయ‌నే చూసుకుం టారు. మాకేం ప‌ని పాటా లేదు. నీక్కూడా లేక‌పోతే నా వెంట రా... ప‌చారీ కొట్లో లెక్క‌లు రాసేవాడు పారి పోయాట్ట‌. మ‌నం కుదుర్చుకుందాం.. ఏమంటారు? అని అడిగాడు. రాజుగారికి కోపం వ‌చ్చింది. త‌ల‌పాగా స‌ద్దుకుని గుర్రం ఎక్కి వెళిపోయాడు. 

కొంత‌దూరం వెళ్లాక బాగా ఆక‌లివేసి ఓ పేద‌రాసి పెద్ద‌మ్మ గ‌డ‌ప ద‌గ్గర ఆగాడు. ఆమె పేరు, ఊరు అడిగిం ది. అన్నీ త‌ప్పు చెప్పాడు. స‌రే ఆక‌లి మీదున్నాడుగా అని పెరుగ‌న్నం ఒక అవ‌కాయి బ‌ద్ద‌తో తెచ్చి ముం దుంచింది. రాజుగారు తిని ఏం కావాలో కోరుకో అన్నాడు.. కోట‌లో దాసిని అడిగిన‌ట్టు. ఏడ్చిన‌ట్టుంది.. నేనే మైనా నీ ప‌నిమ‌నిషినా అలా అడుగుతున్నావ్‌? డ‌బ్బులుంటే ప‌ది రూపాయ‌లిచ్చి వెళ్లు అని క‌సురు కుంది.  ఆ రాజ్యం అవ‌త‌లి పొలిమేర దాటుతుంటే ఎవ‌రో హిందీలో మాట్లాడుతూ క‌నిపించారు. చ‌చ్చాం.. వేగం తెలియ‌లేదు.. వేరే భాష‌వాల్ల ద‌గ్గ‌రికి వ‌చ్చాను అనుకున్నాడు.  ఇక్క‌డ భోజ‌నం ఎక్క‌డ దొరుకుతుంది అని అడిగాడు.. బోజ‌నం క్యా హై.. అని విసుక్కుని వెళిపోయారు ఎదురుగా వ‌చ్చిన‌వారు. ఈయ‌న వాల‌కం చూసి యే కౌన్ హై... బ‌ఫూన్ జైసే దౌడ్‌రే! అన్నారు. రాజుగారికి కోపంతో కూడిన బాధ‌తో కూడిన పెద్ద న‌వ్వు వ‌చ్చింది. చిర్న‌వ్వు న‌టించి మ‌ల్లీ వెన‌క్కి తిరిగాడు. గ‌తంలొ ఓసారి మంత్రి అటుగా వెళ్లి తిట్ల‌ను ప‌ర‌మ ఆనందంగా విని వ‌చ్చి చెప్ప‌డం రాజుగారికి ఇంకా గుర్తు!

మంచం మీంచి ధ‌భీమ‌ని ప‌డ్డాడు.. రాజు! ఓర్నాయ‌నో ఏదో అయింది.. అనుకుని భ‌టులు, భ‌జంత్రీలు వ‌చ్చారు.. ఏమ‌యింది రాజా అని అడిగారు.. ఏం లేదు.. చిన్న క‌ల‌గ‌న్నా! మీరు వెళ్లి మంత్రిని పిలుచు కు రండి అని పుర‌మాయించారు రాజుగారు! 

దేశాట‌న‌చేసి సాధించ‌లేనిది ఉన్న‌పార్టీ జెండాకి రంగుమార్చ‌కున్నా, పేరు మార్చి అదే మూడ‌క్ష‌రాల‌తో గొప్ప సందేశాత్మ‌క విప్ల‌వం తేవాల‌న్న ఆతృత కేసీఆర్‌కు బూమ‌రాంగ్ అవుతుందా?

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.