హీరోయిన్ కావాలనే కల భగ్నం.. యువతి ఆత్మహత్య
Publish Date:Jun 12, 2026
Advertisement
హీరోయిన్ కావాలన్న కలతో సినీ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సైబరాబాద్ కు చెందిన యువతి కొందరి వేధింపులు, బెదరింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఈ వేధింపులపై బాధిత యువతి పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు స్పందిం చలేదనీ, చర్యలు తీసుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇటీవల మరోసారి కొందరు యువకుల నుంచి బెదిరింపులు రావడంతో ఆమె మళ్లీ పోలీసులను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. నిరంతర వేధింపులు, మానసిక ఒత్తిడితో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి పది రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. తండ్రి లేని కుటుంబంలో తల్లి ఒంటరిగా జీవనం సాగిస్తుండగా, కుమార్తెను కోల్పోయిన ఆమె న్యాయం కోసం అధికారులను వేడుకుంటోంది. ఘటన జరిగి రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువతి మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, బాధితురాలు ముందుగానే పోలీసులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. యువతి మరణానికి కారణమైన వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ ఆరోపణలపై పోలీసుల అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.
ఆ యువతి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, సైదాబాద్‌కు చెందిన యువతి షార్ట్ ఫిల్మ్స్‌లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ యువకుడు ఆమె బాత్‌రూమ్‌లో ఉన్న దృశ్యాలను రహస్యంగా వీడియో తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం ఆ వీడియోలను అడ్డంగా పెట్టుకుని గత ఆరు నెలలుగా ఆమెను వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
http://www.teluguone.com/news/content/dream-of-becoming-a-heroine-shattered-36-222674.html





