జీస‌స్ కాలింగ్‌.. వైఎస్సార్‌తో మీటింగ్‌.. జ‌గ‌న్ మెంట‌ల్ కేసా?

Publish Date:Jun 29, 2021

Advertisement

దేవుడు క‌ల్లో క‌నిపిస్తే అది భ‌క్తి. చ‌నిపోయిన వాళ్లు క‌ల్లోకి వ‌స్తే అది ప్రేమ‌. ఆ ఇద్ద‌రూ ప్ర‌తీరోజు అలారం పెట్టుకొని మ‌రీ రాత్రి 12 గంట‌ల‌కు బ‌తికి ఉన్న‌వారితో మాట్లాడితే..? అది పిచ్చి.. అని వేరే చెప్ప‌న‌వ‌స‌రం లేదేమో. మాన‌సిక ఆరోగ్యం బాగా దెబ్బ తిన్న వారికే అలా జ‌రుగుతుంది. ఇంత‌కీ చ‌నిపోయిన వాళ్లు క‌నిపిస్తే ఆత్మ అనాలా?  దెయ్యం అనాలా? అనే డౌటూ మ‌రోవైపు. ఇక దేవుడు ఆయ‌న‌తో మాట్లాడుతున్నాడంటే.. మ‌తిభ్ర‌మించింద‌ని అనుకోవాలా? లేక‌, అప‌రిచితుడిగా భావించాలా? ఇలాంటి చేష్ట‌లు, అలాంటి మాట‌లు.. బ‌య‌ట ఎవ‌రైనా మాట్లాడితే.. వాడికి దెయ్యం ప‌ట్టిందిరా అని భూత‌వైద్యుడికి చూపిస్తారు. వేప మండ‌ల‌తో నాలుగు గ‌ట్టిగా త‌గిలిస్తే.. మ‌రో నాలుగు చెప్పు దెబ్బ‌లు వేస్తే.. దెబ్బ‌కు ప‌ట్టిన దెయ్యం వ‌దిలిపోతుంది. అంతేకానీ, త‌న‌తో దేవుడు మాట్లాడుతాడ‌ని కానీ, త‌న‌తో చ‌నిపోయిన త‌న తండ్రి డైలీ మిడ్‌నైట్ డిస్క‌ష‌న్స్ పెడ‌తాడ‌ని గానీ బ‌య‌ట ఎవ‌రైనా ఎవ‌రితోనైనా చెబితే.. వాడికి పిచ్చిప‌ట్టిందిరా బాబోయ్ అంటూ మ‌ళ్లీ అత‌నివైపు ఎవ‌రూ క‌న్నెత్తి కూడా చూడ‌రు. 

కానీ, ఏపీలో ప్ర‌చారం జ‌రుగుతున్న‌ట్టు.. ఆ పిచ్చిప‌ట్టిన లాంటి చేష్ట‌లు.. రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డే చేస్తే...? వామ్మో.. ఊహించుకోడానికే ఆదోలా ఉంది. కానీ, ఇది నిజ‌మంటూ.. వైఎస్ జ‌గ‌న్‌.. ప్ర‌తిరోజూ రాత్రి త‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డితో మాట్లాడ‌తారంటూ.. ఈ విష‌యం సీఎం జ‌గ‌నే స్వ‌యంగా చెప్పిన‌ట్టు.. న‌మ్మ‌ద‌గ్గ స‌మాచారం ప్ర‌చారంలో ఉంది. కేవ‌లం వైఎస్సార్‌తోనే కాదు.. దేవుడి బిడ్డ అయిన జగ‌న్‌.. జీస‌స్ త‌న‌తో మాట్లాడ‌తాడ‌ని ముఖ్య‌మంత్రే చెప్పిన‌ట్టు అధికార వ‌ర్గంలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ రెండు విష‌యాల గురించి ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ మీడియా సంస్థ అధినేత బ‌య‌ట పెట్ట‌డంతో.. ఏపీ సీఎం జ‌గ‌న్‌కు అస‌లేమైంది..? ఆయ‌న మాన‌సిక ఆరోగ్యం ఎలా ఉంద‌నే అనుమానం, చ‌ర్చ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెద్ద ఎత్తున జ‌రుగుతోంది. 

ఏపీలో ఇప్పుడు ఏ న‌లుగురు క‌లుసుకున్నా ఇదే చ‌ర్చ‌. నీకు తెలుసా.. జ‌గ‌న్‌తో వైఎస్సార్ రోజూ మాట్లాడ‌తార‌ట‌..! నీకు తెలుసా.. జీస‌స్ క్రైస్ట్ జ‌గ‌న్‌తో ట‌చ్‌లో ఉంటార‌ట‌.. అంటూ హాట్ హాట్ డిబేట్‌లు జ‌రుగుతున్నాయి. ఇక సోష‌ల్ మీడియాలోనైతే.. సెటైర్లు ఓ రేంజ్‌లో పేలుతున్నాయ్‌. ఆ మీడియాలో ఈ వార్త వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇటు ఏపీలో, అటు సోష‌ల్ మీడియాలో.. జ‌గ‌న్‌పై జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ ఫెస్టివ‌ల్ న‌డుస్తోంది. ఇన్నాళ్లూ క‌రోనాతో క‌ష్టాలు, బాధ‌లు మాత్ర‌మే చూసిన జ‌నాలు.. ఈ విష‌యం తెలిసి పొట్ట‌ప‌గిలేలా న‌వ్వుకుంటున్నారు. చాలా రోజుల త‌ర్వాత ఇంత‌టి కామెడీ ఎపిసోడ్ వింటున్నామ‌ని.. న‌వ్వాపుకోలేక పోతున్నామంటూ పండ‌గ చేసుకుంటున్నారు. ఇంత‌కీ ఆ మీడియా అధినేత జ‌గ‌న్ గురించి ఏం చెప్పారంటే.....

ఇదీ మేట‌ర్‌. 40ఇయ‌ర్స్ మీడియా ఇండ‌స్ట్రీ పెద్దాయ‌న ఇలాంటి వ్యాఖ్య‌లు ఊరికే చేయ‌రు. ఇందులో నూటికి నూరు శాతం నిజం ఉండే ఉంటుంది. అందుకే, ఈ న్యూస్ ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతోంది. సోష‌ల్ మీడియాలోనైతే జ‌గ‌న్‌ను కుమ్మేసుకుంటున్నారు. ఏంటి జ‌గ‌న‌న్న‌.. మీరు ఆ రాత్రి జీస‌స్‌తో మాట్లాడారా? అస‌లు వైర‌స్ లేదూ ఏమీ లేదు.. భ‌య‌ప‌డొద్దు అని జీస‌స్ మీతో చెప్పారా? అంటూ నోరెళ్ల‌బెడుతున్నారు. మీరెంత క‌రుడుగ‌ట్టిన క్రిష్టియ‌న్ అయినా.. ఏటేటా జెరుస‌లేం వెళ్లినా.. మ‌రీ ఇంత‌గా పిచ్చి పీక్స్‌కు చేరడ‌మేంట‌ని అవాక్క‌వుతున్నారు. మీ జీస‌స్ క‌రోనా లేద‌ని చెప్పారుగా.. మ‌రి ఈ కేసులు ఏంటి? ఈ చావులేంటి? ఏపీలో ఈ క‌రోనా క‌ల్లోలమేంటి? అంటే, మీ జీస‌స్ త‌ప్పు చెప్పారా? లేక‌, మీరు అబ‌ద్దం చెప్పారా? లేక‌, జీస‌స్ మీతో చెప్పినట్టు మీరే భ్ర‌మ ప‌డ్డారా?  ఇంత‌కీ మీ మెంట‌ల్ కండీష‌న్ ఓకేనా..? అంటూ సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్‌ను ఏకిపారేస్తున్నారు. మ‌రికొంద‌రైతే, ఫ‌న్నీ కామెంట్స్ చేస్తున్నారు. బాబ్బాబు.. మా ఇంట్లో కోడి క‌నిపించ‌డం లేదు.. అది ఎక్క‌డికెళ్లిందో కాస్త జీస‌స్‌ను అడిగి చెప్పండి ప్లీజ్ అంటూ ర‌క‌ర‌కాల ఫ‌న్నీ కామెంట్స్‌తో జ‌గ‌న్‌ను కుళ్ల‌బొడుస్తున్నారు నెటిజ‌న్స్‌. 

ఇక ప్ర‌తీరోజూ రాత్రి 12 గంట‌ల‌కు దివంగ‌త రాజ‌శేఖ‌ర్‌రెడ్డితో చ‌ర్చిస్తానంటూ జ‌గ‌న్ చెప్పార‌నే వార్త‌పైనా నెటిజ‌న్లు ఆటాడుకుంటున్నారు. ఈ రాత్రి వైఎస్సార్‌తో డిష్క‌స్ చేసేట‌ప్పుడు.. మీ బాబాయ్‌, వైఎస్సార్ త‌మ్ముడు.. వివేకానంద‌రెడ్డిని ఎవ‌రు చంపారో అడ‌గాలంటూ కామెంట్లు చేస్తున్నారు. నాకు వైఎస్సార్ ఆస‌రా ప‌థ‌కం రాలేదు.. ఎప్పుడు వ‌స్తుందో ఆ వైఎస్సార్‌నే అడిగి చెప్పండంటూ ఇంకో సెటైర్‌. ఇలా.. మూడు రోజులుగా ఏపీలో ఎక్క‌డ చూసినా ఇదే చ‌ర్చ‌. కామెడీ ర‌చ్చ‌. 

గ‌తంలో వైసీపీ ఎంపీ ర‌ఘురామ ఆరోపించిన‌ట్టు సీఎం జ‌గ‌న్ మెంట‌ల్ కండిష‌న్ బాగానే ఉందా? అనే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు ఏపీ ప్ర‌జ‌లు. ఇప్ప‌టికే జ‌గ‌న్ మాన‌సిక ఆరోగ్య పరిస్థితి బాగా లేనందున‌ ఆయ‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి అన‌ర్హుడంటూ కోర్టును సైతం ఆశ్ర‌యించారు ర‌ఘురామ‌. జ‌గ‌న్ జీస‌స్‌తో, దివంగ‌త వైఎస్సార్‌తో మాట్లాడుతార‌నే అంశానికి సాక్షం ఉంటే బాగుండేద‌ని.. ర‌ఘురామ‌కు బాగా ఉప‌యోగ‌ప‌డేద‌ని అంటున్నారు. ఏదిఏమైనా.. ఆ దేవుడి ద‌య‌.. చ‌ల్ల‌ని చూపు.. ఆ మ‌హానేత ఆశీస్సుల‌తో.. ఆ మీడియా అధినేత బ‌య‌ట‌పెట్టిన ఈ ర‌హ‌స్యంతో జ‌గ‌న్ మాన‌సిక వైఖ‌రిపై ప్ర‌జ‌ల్లో అనుమానంతో పాటు భ‌యాందోళ‌న కూడా వ్య‌క్తం అవుతోంది. వాడిన‌లా వ‌దిలేయ‌కండ్రా.. వాడినెవ‌రిక‌న్నా చూపించండ్రా.. అంటూ సెటైర్లు పేలుతున్నాయి. 
 

By
en-us Political News

  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.