అప్పు ఇవ్వలేదని.. అశ్లీల వెబ్ సైట్ లో భార్య ప్రొఫైల్..
Publish Date:Jul 7, 2021
Advertisement
ఓపెన్ చేస్తే.. ఒక వివాహిత ఫొటోస్ .. ఆమె ఫోన్ నెంబర్ అశ్లీల వెబ్ సైట్ లో చెక్కర్లు కొడుతుంది.. ఆ మహిళకు వేరేవాళ్ళ నుండి ఫోన్స్ రావడం.. అసభ్యంగా మాట్లాడం చేసేవాళ్ళు వాళ్ళ బాధను భరించలేని ఆమె భర్త సహాయంతో పోలీసులను ఆశ్రయించింది.. ఇక అంతే పోలీసులు రంగంలోకి దిగారు.. అలా చేసినవాడిని పట్టుకున్నాడు.. ఆ తర్వాత వాడికి రెండు తగిలిస్తే చివరికి నిజం కక్కాడు.. ఇంతకీ ఆ నిజం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ వార్త చదవండి మీకే తెలుస్తుంది.. వివరాలలోకి వెళితే..అది కరీంనగర్. ఆ పట్టణంలోని ఓ వ్యక్తి , తనకు తెలిసిన మరో వ్యక్తి వద్ద దగ్గర రూ. 70 వేలు అవసరానికి అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లిస్తానని మూడు నెలలు గడువు తీసుకున్నాడు. అసలే కరోనా కాలం కావడం తో అతనికి డబ్బులు ఎక్కడ పుట్టలేదు.. అనుకున్న సమయానికి డబ్బు అందకపోయేసరికి అప్పు చెల్లించలేకపోయాడు. దీంతో అప్పిచ్చిన వ్యక్తి చాలా సార్లు డబ్బులు కోసం అతడిని అడిగాడు. ఈరోజు ఇస్తా.. రేపు ఇస్తా అంటూ అతని చుట్టూ తిప్పుతూ ఉన్నాడు. ఇక అతని మాటలతో విసిగిపోయిన అప్పిచ్చిన వ్యక్తి అతనిపై కక్ష పెంచుకున్నాడు. అతనిలో ఉన్న మానవ మృగం నిద్రలేచింది.. చివరికి తన దగ్గర డబ్బు తీసుకుని అప్పు చెల్లించని వ్యక్తి భార్య ఫోటోను సంపాదించి.. మానవత్వం వారికీ కర్కశంగా ప్రవర్తించి సదరు ఫోటోను అశ్లీల వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. అంతేకాకుండా ఆ ఫోటో కింద ఆమె ఫోన్ నెంబర్ ని యాడ్ చేశాడు. దీంతో ఆమె ఫోన్ కి రోజూ చాలామంది ఫోన్ చేసి విసిగించండం మొదలుపెట్టారు. ఇక తనకు ఫోన్ కాల్స్ చేసి కొందరు అసభ్యంగా మాట్లాడి ఇబ్బంది పెట్టడంతో ఆ గృహిణి విసిగిపోయి పోలీసులను ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు అప్పిచ్చిన వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిర్దారించుకొని అతడిని అరెస్ట్ చేశారు. అప్పు చేసినవారు అప్పు చెల్లించకపోతే అప్పు సమానంగా ఇంట్లో వస్తువులు తీసుకుపోవడమో లేదా అతనికి ఏదైనా వాహనాలను ఉంటే ఆ వాహనాలు ఐన తీసుకుపోవాలిగాని మరి గింత కర్కశంగా ప్రవర్తిస్తారా ? మరి ఇంత రాక్షసానందం ఎవరైనా పొందుతారా అని స్థానికులు దుమ్మెత్తి పోస్తున్నారు.. అందుకనే మన పెద్దలు అన్నారు అప్పు ఎప్పటికైనా ముప్పు అని.. అలాగే అప్పు ఇవ్వడం కూడా తప్పే.. ఒకవేళ ఇచ్చిన మరి ఇలాంటి పంటకు చెయ్యడం చాలా తప్పు.. అంతకు మించి నేరం.. సో అప్పు ఇచ్చే ముందు తీసుకునే ముందు ఆలోచించండి.. జాగ్రత్తపడండి.
http://www.teluguone.com/news/content/dont-give-you-a-loan-wife-profile-on-pornographic-website-39-119040.html





