కొబ్బరి చెట్టెక్కిన చిరుత: విషయమేంటో తెలుస్తే నవ్వాపుకోలేరు.!
Publish Date:Oct 23, 2026
Advertisement
అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న జనావాసాలలోకి చిరుతలు ఆహారం కోసం ప్రవేశించడం కద్దు. అలా వచ్చే చిరత వేటకు సులభంగా చిక్కేవి లేగదూడలు, కోళ్లు, కుక్కలే. వాటినే వేటాడి క్షుద్భాధను తీర్చుకుంటాయా వన్య ప్రాణులు. అయితే కర్నాటకలో అలా జనావాసంలోకి ప్రవేశించిన చిరుత కుక్కలను చూసి బెదిరిపోయింది. ప్రాణభయంతో పరుగులు తీసింది. చివరకు వాటిని తప్పించుకోవడానికి ఏకంగా కొబ్బరి చెట్టెక్కి నక్కింది. వివరాల్లోకి వెడితే.. కచ్చితంగా ఎక్కడో తెలియరాలేదు కానీ కర్నాటక ప్రాంతంలో అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామంలోకి చిరుత ప్రవేశించింది. ఆహారం కోసం వెతుకుతున్న ఆ చిరుతకు కోళ్ల గుంపు ఎదురైంది. వాటిని వేటాడే ప్రయత్నంలో ఆ చిరుతను వీధికుక్కలు గమనించాయి. అంతే భౌభౌ మంటూ అవి ఆ చిరుత వెంట పడ్డాయి. ఆ కుక్కల అరుపులకు బెంబేలెత్తిన ఆ చిరుత ప్రాణభయంతో పరుగులు తీసింది. తప్పించుకునే దారి లేక ఓ కొబ్బరి చెట్టెక్కి నక్కింది. అయినా ఆ కుక్కలు కొబ్బరి చెట్టు చుట్టూ తిరుగుతూ మొరగడం మొదలెట్టాయి. ఏమిటా అని వచ్చి చూసిన గ్రామస్తులకు కొబ్బరి చెట్టుపై బిక్కుబిక్కు మంటూ కూర్చున్న చిరుత కనిపించింది. ఇంకే ముంది వారు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి ఆ చిరుతను బంధించి దట్టమైన అడవిలో విడిచిపెట్టారు. ఇందుకు సంబంధిచిన దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. కుక్కలకు భయపడి చిరుత చెట్టెక్కి నక్కందంటూ నెటిజనులు ఓ రేంజ్ లో కామెంట్లు పెడుతున్నారు. ఈ విచిత్ర పరిణామాన్ని గమనించిన స్థానిక ప్రజలు వెంటనే తమ మొబైల్ ఫోన్లలో ఈ దృశ్యాలను బంధించారు. కొబ్బరి చెట్టు పైభాగంలో చిరుతపులి బిక్కుబిక్కుమంటూ కూర్చున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అడవికి రాజులా ఉండే చిరుతకు వీధి కుక్కల వల్ల ఈ పరిస్థితి రావడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల ఐకమత్యం ముందు శక్తివంతమైన చిరుత సైతం వెనకడుగు వేయాల్సి వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు.
[Dogs hase Leopard Climbs Coconut Tree, Karnataka, Stray Dogs Leopard Fear, Telugu One]
http://www.teluguone.com/news/content/dogs-hase-leopard-climbs-coconut-tree-36-235185.html





