నిమ్మరసం నీళ్లు తాగితే.. షుగర్ తగ్గుతుందా?

Publish Date:May 14, 2025

Advertisement


నిమ్మకాయ చాలా పానీయాలలో ఉపయోగిస్తారు.  అటు వంటలలోనూ, ఇటు స్వీట్ల లోనూ, మరొక వైపు రిఫ్రెషింగ్ పానీయాలలోనూ నిమ్మకాయను ఉపయోగిస్తారు.  చాలామంది ఉదయాన్నే నీటిలో నిమ్మరసం కలిపి తాగుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. అయితే నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల శరీరంలో షుగర్ కూడా తగ్గుతుందని కొందరు అంటారు. ఈ కారణంగా చాలామంది షుగర్ పేషెంట్ లు నిమ్మరసం కలిపిన నీళ్లు తాగుతూ ఉంటారు.  అయితే నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల నిజంగానే శరీరంలో షుగర్ శాతం తగ్గుతుందా?  నిమ్మరసం నీరు శరీరంలో షుగర్ తగ్గించడంలో సహాయపడుతుందా? తెలుసుకుంటే..


నిమ్మరసాన్ని నీటిలో కలిపి తాగితే రక్తంలో చక్కెర శాతం తగ్గుతుందని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి నిమ్మరసం కలిపిన నీరు రక్తంలో చక్కెరను తగ్గించదు, కానీ చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.  ఈ రెండింటికి తేడా ఏంటని చాలా మంది అయోమయానికి గురవుతూ ఉంటారు.

తీసుకునే ప్రతి ఆహారంలో ఉండే గ్లూకోజ్ పరిమాణాన్ని బట్టి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ను నిర్ణయిస్తారు.  అలాగే నిమ్మకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ ను గమనిస్తే ఇది చాలా తక్కువగా ఉంటుంది.  తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను ఆకస్మికంగా పెరగకుండా చేస్తాయి.


నిమ్మకాయలో కరికే ఫైబర్ ఉంటుంది.  ఈ కరిగే ఫైబర్ నెమ్మదిగా జీర్ణం అవుతూ రక్తంలో శోషించబడుతుంది.  తద్వారా  రక్తంలో చక్కెరను నెమ్మదిగా పెంచడంలో సహాయపడుతుంది. సహాయపడుతుంది. అలాగే కొన్ని అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..  నిమ్మరసం కలిపిన నీరు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని చెబుతున్నాయి.


నిమ్మకాయ నీరు హైడ్రేషన్ ను నిర్వహిస్తుంది. ఇది రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుతుంది.  ఈ కారణంగా నిమ్మరసాన్ని వేసవిలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే నిమ్మరసానికి చక్కెర,  చక్కెర సంబంధిత పదార్థాలు జోడించడం వల్ల షుగర్ ఉన్నవారికి నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు.

నిమ్మరసంలో విటమిన్-సి ఉంటుంది.  ఇది వాపును, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది.  రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఈ కారణంగానే కడుపు ఉబ్బరం, గ్యాస్,  అజీర్తి వంటివి చేసినప్పుడు నిమ్మరసం నీటిలో కాసింత జీలకర్ర పొడి కూడా కలిపి తాగమని చెబుతూ ఉంటారు.


నిమ్మకాయ నీరు కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.  ఇది రక్తంలో చక్కెర స్థాయిలను బాగా నియంత్రించడంలో సహాయపడుతుంది.


                                    *రూపశ్రీ.

 

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..

By
en-us Political News

  
సీజన్ మారుతున్నప్పుడు శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పసుపు,  తేనె భారతీయ వంటగదిలో రెండు ప్రధాన పదార్థాలు. ఇవి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. పసు
నేటికాలంలో చాలామందిలో కనిపిస్తున్న సమస్య ఫ్యాటీ లివర్.. చిన్న వయసు వారు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు.
కీళ్ల నొప్పులు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య.
వేసవి కాలం అంటేనే చాలా ఇబ్బంది కాలం. అందులోనూ మునుపటి కంటే ప్రతి ఏడాది ఎండల తీవ్రత పెరుగుతూనే ఉంటుంది.
ఆరోగ్యంగా ఉండటానికి చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటాము
ఇంతకు ముందు రోజుల్లో కిడ్నీలో రాళ్లు అనే విషయాన్ని ఎక్కువగా వినేవాళ్లం.
చాలామంది ఒత్తిడిగా ఉంది అంటూ ఫిర్యాదు చేస్తుంటారు.
 వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని,  శక్తిని అందించడానికి చెరకు రసం చాలా మంచి పానీయం.
ఆరోగ్యం పాడైనప్పుడు ఆసుపత్రికి వెళ్లినప్పుడు  వివిధ రకాల పరీక్షలు చేస్తుంటారు.
వేసవిలో మండే ఎండ అయినా, ఆఫీసులో బిజీ జీవితం అయినా, మానసిక అలసట, జ్ఞాపకశక్తి తగ్గడం ఈ రోజుల్లో అన్ని వయసుల వారికి ఒక సమస్యగా మారాయి.
కాలేయం శరీరంలో ముఖ్యమైన అవయం.
కుంకుమ పువ్వు ప్రపంచంలో అత్యంత ఖరీదైన సుగంద ద్రవ్యం. దీన్ని సాధారణంగా ఖరీదైన వంటకాలలోనూ, తీపి పదార్థాల తయారీ లోనూ, గర్భవతులు, బిర్యానీ వంటి వంటకాలలోనూ ఉపయోగిస్తారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.