మీకూ ప్రపంచంలో చెడు కనబడుతోందా?? కారణమిదే..

Publish Date:Apr 18, 2023

Advertisement

మన మనోస్థితే మన చుట్టూ ఉన్న ప్రపంచ స్థితిని నిర్ణయిస్తుంది. మనోస్థితి మారితే, ప్రపంచ స్థితి కూడా విధిగా మారితీరుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ చేయాల్సిందేమిటంటే… మిమ్మల్ని మీరు పవిత్రీకరించుకోవాలి. అలా చేస్తే గనుక  ప్రపంచం కూడా తప్పక పరిశుద్ధమౌతుంది. ఈ విషయాన్నిపూర్వం నుండి భోధిస్తూనే ఉన్నారు. అయితే దాన్ని పూర్వంకంటే ఇప్పుడు ఎక్కువగా బోధించాల్సి ఉంది. సందుకంటే.. ఇరుగుపొరుగు వారి విషయాలలో మన ఆసక్తి పెరిగిపోతోంది. సొంత విషయాలలో ఆసక్తి తగ్గిపోతోంది. మనం మార్పు చెందితే ప్రపంచం కూడా మార్పు చెందుతుంది. మనం పరిశుద్ధులమైతే, లోకం కూడా పరిశుద్ధమౌతుంది. 

ప్రతి ఒక్కరూ ఒక ప్రహన వేసుకోవాలి.  ఇతరులలోని చెడును నేనెందుకు చూడాలనేదే ఆ ప్రశ్న. నేను చెడిపోయి ఉంటేనే గాని ఇతరులలోని చెడును చూడలేను. నాలో బలహీనత లేకపోతే నాకు దుఃఖం కలుగదు. నేను పసివాడిగా ఉన్నప్పుడు నాకు దుఃఖాన్ని కలుగించినవి. నన్నిప్పుడు దుఃఖపెట్టలేవు. మనస్సు మారింది కాబట్టి, ప్రపంచం కూడ తప్పక మారుతుందని వేదాంతం వక్కాణిస్తుంది.

ఇలా మనోనిగ్రహాన్ని సాధించిన వ్యక్తిపై బాహ్యమైనది ఏదీ ప్రభావం చూపలేదు. అతడికి ఇకపై కూడా ఎలాంటి బంధం ఉండదు. అతడు స్వాతంత్ర్య మనస్కుడు అవుతాడు. అలాంటివాడే ప్రపంచంలో చక్కగా జీవించగలిగిన సమర్థుడు అవుతాడు.  లోకాన్ని గురించి రెండు విధాలైన అభిప్రాయాలు గల వ్యక్తులు సాధారణంగా కనిపిస్తారు. కొంతమంది నిరాశావాదులై ప్రపంచం ఎంత ఘోరం! ఎంత దుష్ట అని అంటుంటారు. మరికొంతమంది ఆశావాదులై ప్రపంచం ఎంత చక్కనిది! అద్భుతమైనది! అని అంటుంటారు. మనోనిగ్రహాన్ని సాధించని వారికి ప్రపంచం చెడ్డదిగా తోస్తుంది లేదా మంచిచెడుల  మేళవింపు గానైనా అనిపిస్తుంది. మనోనిగ్రహ సంపన్నులమైతే మనకు ఈ ప్రపంచమే ఆశాజనకమై కనబడుతుంది. అప్పుడు మనకు ప్రపంచంలో ఏదీ మంచిగాగాని చెడుగా గాని అనిపించదు. అన్నీ సర్వం సరైన స్థానంలో ఉన్నట్లు అదంతా సమంజసమే అన్నట్టు అగపడుతుంది.

ప్రేమా, సౌజన్యమూ, పావనత్వమూ మనలో ఎంత పెంపొందితే బయట వున్న ప్రేమాసౌజన్య పాపనత్వాలను మనం అంతగా చూడగలం. పరదూషణ నిజానికి ఆత్మదూషణే. పిండాండాన్ని నువ్వు చక్కబరుచుకొన్నావా (ఇది నువ్వు చేయగల పనే), బ్రహ్మాండం తనంతట తానే నీకు అనువుగా మారుతుంది. ఆదర్శ ద్రవాన్ని అది ఎంత కొద్ది పరిమాణంలో ఉన్నా దానికంటే ఎక్కువ పరిమాణంగల ద్రవంతో సరితూగేటట్లు చేయవచ్చుననే సూత్రంలా ఒక నీటిబిందువు విశ్వంతో సరితూగగలదు. మనలో ఏది లేదో అది మనకు వెలుపల కూడా కనబడదు. చిన్న ఇంజనుకు పెద్ద ఇంజను ఎలాంటిదో విశ్వం మనకు అలాంటిది. చిన్నదాన్లో కనిపించే దోషం పెద్దదాన్లో ఏర్పడే చిక్కును ఊహింపజేస్తుంది.

లోకంలో సాధింపబడ్డ ప్రతియత్నమూ నిజానికి ప్రేమచేత సాధింపబడిందే. తప్పులు ఎన్నటం వల్ల ఎన్నడూ ఏ మేలూ ఒనగూరదు. వేలకొద్ది సంవత్సరాలుగా విమర్శనా మార్గాన్ని అనుసరించి చూడటమైంది. నిందల వలన దేనినీ సాధించలేము. 

అంటే మనిషి తనలో చెడును, చెడు భావనలను పెంచుకుంటే…  ఈ ప్రపంచంలో కూడా చెడు ఉన్నట్టు, తన చుట్టూ చెడు భావనలు ఉన్నట్టూ అతనికి అనిపిస్తుంది  ఇందులో వింత ఏమి లేదు. చూసే చూపును బట్టి విషయం అర్థమవ్వడం మాములే కదా…

                                ◆ నిశ్శబ్ద.

By
en-us Political News

  
వివాహం అనేది జీవితాంతం కొనసాగే సంబంధం. ఇది ఒక వ్యక్తితో జీవితాన్ని గడపడానికి వేసే పెద్ద అడుగు.  అందువల్ల వివాహానికి ముందు  భావాల గురించి కాబోయే  భాగస్వామితో మాట్లాడటం చాలా ముఖ్యం...
ఆచార్య చాణక్యుడు ప్రతి మనిషికి ఉపయోగపడే ఎన్నో విషయాలను చెప్పాడు. వాటిని చాణక్య నీతి అని పిలుస్తారు....
మన దేశ గుర్తింపు భారతదేశ జాతీయ జెండా. దీనికి మూడు రంగులు ఉన్నాయి కాబట్టి దీనిని త్రివర్ణ పతాకం అని పిలుస్తారు....
భారతదేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం ను జరుపుకుంటుంది . 2025లో ఇది శుక్రవారం నాడు వస్తుంది...
నేటి డిజిటల్ యుగంలో పిల్లలను మొబైల్ ఫోన్‌లకు దూరంగా ఉంచడం ప్రతి తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారింది. ఆటలు, యూట్యూబ్, సోషల్ మీడియా, ఇవన్నీ పిల్లలను ఎంతగా ఆకర్షిస్తాయంటే వారు బయటి ప్రపంచం నుండి దూరమైపోతారు....
రంగనాథన్ గారి పూర్తిపేరు శియాలి రామం రంగా నాథన్ ఈయన ఆగస్టు 12, 1892, తమిళనాడులో జన్మించారు. ఈయన గణిత శాస్త్రవేత్త, పుస్తక శాస్త్రవేత్త, భారత పబ్లిక్ లైబ్రరీ వ్యవస్థకు పునాది వేసిన మహనీయుడు. "Library Science"లో ఆధునిక సూత్రాలను ప్రతిపాదించి, భారతదేశంలో పుస్తకాలను, గ్రంథాలయాలను సమాజానికి చేరువ చేశాడు. ఆయన రూపొందించిన ‘పంచ సూత్రాలు’ ఈ రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా లైబ్రరీ రంగానికి మార్గదర్శకాలుగా ఉన్నాయి...
వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం మాత్రమే కాదు రెండు కుటుంబాల మధ్య బంధం. కొత్త సంబంధాలకు సర్దుబాటు కావడానికి సమయం పడుతుందనేది అంగీకరించాల్సిన వాస్తవం. సాధారణంగా తల్లిదండ్రులు తమ కుమార్తెను అత్తవారింటికి పంపేటప్పుడు  ఆమె అత్తమామల ఇంట్లో ఎలా ఉండాలో....
రక్షా బంధన్ ఆగస్టు 9వ తేదీన వచ్చింది. ఈ రోజు కోసం కొందరు  ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుంటారు. కొందరు అక్కాచెల్లెళ్ళు  ఇప్పటికే కొత్త ఆలోచనలతో రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి రెఢీ అవుతున్నారు..
చేనేత చాలా గొప్ప కళ.. ఒక దారం కలుస్తుంది, ఆకారం తీసుకుంటుంది, మలుపులు తిరుగుతుంది, కొన్నిసార్లు విప్పుతుంది...
టాయిలెట్ సీట్.. వెస్ట్రన్ టాయిలెట్స్ వచ్చాక ఇంట్లో అందరూ ఒకే సీటు మీద కూర్చుని టాయిలెట్ వెళ్లడం తప్పనిసరి.
నేటికాలంలో దాదాపు ప్రతి ఇంట్లో ఫ్రిజ్ ఉపయోగించబడుతుంది.
వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఇళ్లలో దోమల సంఖ్య  పెరగడం మొదలవుతుంది.
ఒక మనిషి వ్యక్తిత్వం ఆ మనిషి జీవితంలో ఎదుగుదలను,   ఆరోగ్యకరమైన సంబంధాలను నిర్ణయిస్తుంది. ప్రతి ఒక్కరూ తాము కరెక్టే అనుకుంటూ ఉంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.