పశ్చిమ బెంగాల్ లో దీదీ పతనం వెనుక ఉన్నదెవరో తెలుసా?

Publish Date:May 8, 2026

Advertisement

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో   తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అనూహ్య పతనాన్ని చవిచూసింది. బెంగాల్ ప్రజల చేత దీదీగా పిలిపించుకున్న మమతా బెనర్జీ 2026 అసెంబ్లీ ఎన్నికలలో  పార్టీ పరాజయమే కాదు.. స్వయంగా తన ఓటమినీ చవి చూశారు.  అయితే ఈ ఓటమికి ప్రధాన కారణం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీయే అన్న చర్చ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఒకప్పుడు పార్టీకి వెన్నెముకగా నిలిచిన సీనియర్ నేతలను దూరం చేసుకోవడం.. పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వంటి చర్యలే తృణమూల్‌ను దెబ్బతీశాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు. సీనియర్లను గౌరవించకుండా.. అభిషేక్ బెనర్జీ   తన వర్గానికే పెద్దపీట వేయడం వల్ల పార్టీ లోపల అసమ్మతి జ్వాలలు చెలరేగి, చివరకు అది ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని విశ్లేషిస్తున్నారు. 

నందిగ్రామ్ పోరాటం ద్వారా మమతను అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన సువేందు అధికారి, అభిషేక్ తీరుతో విసిగిపోయి బీజేపీలో చేరారు. గతంలో నందిగ్రామ్‌లో మమతపై గెలిచిన ఆయన, తాజా ఎన్నికల్లో మమతకు కంచుకోట అయిన భవానీపూర్ స్థానంలోనే ఆమెను ఓడించి చరిత్ర సృష్టించారు. కష్టపడి పనిచేసే నాయకులను పక్కన పెట్టడం వల్ల కలిగే నష్టానికి మమతా బెనర్జీ భారీ మూల్యం చెల్లించుకున్నట్లయింది.

అభిషేక్ బెనర్జీ అనుసరించిన  డైమండ్ హార్బర్ మోడల్' పాలనలో అక్రమాలు జరిగాయనీ..  దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని విపక్షాలు మొదటి నుంచీ ఆరోపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఈవీఎంలపై నెపం నెట్టడం..  ఎన్నికల కమిషన్‌తో ఘర్షణ వంటి చర్యలు ఓటర్లను ఆకట్టుకోలేకపోయాయి. టీఎంసీలోని పాత తరం నేతలు కూడా అభిషేక్ వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్నారనేది బహిరంగ రహస్యం.

మమత   మేనల్లుడికి అపరిమితమైన అధికారాలు ఇవ్వడం టీఎంసీ పతనానికి దారితీయగా, సువేందు అధికారి పట్టుదల బీజేపీకి బెంగాల్ గడ్డపై మొదటిసారి అధికారాన్ని కట్టబెట్టింది. ఈ పరిణామాలతో బెంగాల్ రాజకీయాల్లో మమత-అభిషేక్ శకం ముగిసిందని, సువేందు నాయకత్వంలో కొత్త అధ్యాయం మొదలైందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  

By
en-us Political News

  
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.