జూనియర్ ధోనీ ముకుల్ కుటుంబ నేపథ్యం తెలుసా?

Publish Date:Apr 11, 2026

Advertisement

ఐపీఎల్ వేదికగా అనామక క్రికెటర్లు రాత్రికి రాత్రే స్టార్లుగా మారడం మనం చూస్తుంటాం. కానీ ఆ మెరుపుల వెనుక ఉండే చీకటి గాథలు, కుటుంబాల త్యాగాలు వర్ణనాతీతం. తాజా ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ తరపున మెరుపు ఇన్నింగ్స్ ఆడిన 21 ఏళ్ల ముకుల్ చౌదరి పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. తన ఆటతీరుతో జట్టును ఆదుకోవడమే కాకుండా, తన తండ్రి పడిన కష్టాలకు ఒక సార్థకతను చేకూర్చాడీ యువ సంచలనం.

ముకుల్ ఈ స్థాయికి చేరడం వెనుక అతని తండ్రి దలీప్ చౌదరి అలుపెరుగని పోరాటం ఉంది. రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లాకు చెందిన దలీప్, తన కొడుకును ఎలాగైనా క్రికెటర్‌గా చూడాలని పెళ్లికి ముందే నిశ్చయించుకున్నారు. ఇందుకోసం ఆయన ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తనకున్న ఒకే ఒక్క ఇంటిని కూడా అమ్మేసి ముకుల్‌ను శిక్షణలో చేర్పించారు. రియల్ ఎస్టేట్, హోటల్ వంటి వ్యాపారాల్లో నష్టాలు రావడంతో బ్యాంకు అప్పులు తీర్చలేక ముకుల్ చౌదరి తండ్రి దలీప్ చౌదరి కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది.

తండ్రి పడుతున్న బాధను కళ్ళారా చూసిన ముకుల్, తన లక్ష్యంపై దృష్టి సారించి అద్భుతమైన క్రీడాకారుడిగా ఎదిగాడు.  వేలంలో లఖ్‌నవూ ఫ్రాంచైజీ ఇతని కోసం ఏకంగా రూ. 2.6 కోట్లు వెచ్చించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ..  కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 భారీ సిక్సర్లతో విరుచుకుపడి, తన విలువ  నిరూపించుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన ముకుల్, తన ఆరాధ్య దైవం ధోనీ తరహాలోనే హెలికాప్టర్ షాట్లతో మైదానాన్ని హోరెత్తించాడు.

లఖ్‌నవూ జట్టు ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ ముందే చెప్పినట్లుగా, మైదానం నలుమూలలా షాట్లు ఆడగల సామర్థ్యం ముకుల్ సొంతం. ఈ విజయంతో ముకుల్ తండ్రి ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. కుమారుడికి వచ్చిన మొత్తంతో తన బ్యాంకు రుణాలను తీర్చేస్తానని ఆయన గర్వంగా చెబుతున్నారు. ముకుల్ రాబోయే మ్యాచుల్లోనూ ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే, భారత క్రికెట్‌లో మరో ఫినిషర్ దొరికినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ముకుల్ చౌదరిని అందరూ జూనియర్ ధోనీ అంటే పిలుస్తున్నారు. ఈ యువ ఆటగాడు నిలకడైన ప్రదర్శనతో టీమ్ ఇండియాలోకి అడుగుపెడతాడని ఆశిస్తున్నారు. అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తున్నారు. 

By
en-us Political News

  
తిరుమల శ్రీవారి భక్తులకు సత్వర దర్శనం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది.
క్యారియర్ సంస్థ భారతదేశంలో తమ ఉత్పత్తుల్లో 80 శాతం తిరుపతి జిల్లా శ్రీసిటీ నుంచి నుంచి సరఫరా చేయనుంది.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలికల ట్రాప్ కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను మంత్రి రామానాయుడు మంగళవారం రాత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో దొంగలు బరితెగించారు.
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం మొదలైన రాజకీయ హింస రోజురోజుకూ ముదురుతోంది.
హైదరాబాద్ నగరంలో మరోసారి రౌడీ షీటర్ల దౌర్జన్యం వెలుగులోకి వచ్చింది.
నిందితుల వద్ద నుంచి రూ.19.70 లక్షల నగదు, కారు, నాలుగు బైకులు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. 9 బ్యాంకుల్లో ఉన్న రూ.18.20 లక్షల నిధులను ఫ్రీజ్ చేశారు.
వివరాలిలా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న ఐఎస్ అనుబంధ హ్యాండ్లర్ల మార్గదర్శకత్వం లో నిందితులు సమన్వయంగా పనిచేశారు. హ్యాండ్లర్ల చేత రాడికలైజ్ చేయబడిన యువతను జిహాద్‌కు మద్దతుగా నియమించడం, ఉగ్రవాద సంస్థలకు నిధులను సమీకరించడం, నిషేధిత ఆయుధాలు సేకరించడం, బయోటెర్రరిజం ద్వారా భారీ ప్రాణనష్టం కలిగించడం వీరి లక్ష్యం. రిసిన్ అనే అత్యంత ప్రమాదకర జీవ విషాన్ని ఉపయోగించి ఐఎస్ దుష్ట లక్ష్యాన్ని అమలు చేయాలని ప్లాన్ చేశారు. రిసిన్ ఆముదం విత్తనాల్లో సహజంగా లభించే శక్తివంతమైన విషపదార్థం.
గత నెల 14న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో హెచ్‌ఎంటీ రోడ్డుపై రాకేష్ శర్మ, హరీష్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు వాకింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆరుగురు దుండగులు వారిపై దాడి చేసి 7.5 గ్రాముల బంగారు గొలుసు తో పాటు ఒకరి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు.
రాజస్థాన్ లోని పర్యాటక నగరంఉదయ్ పూర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆర్బీ చౌదరి ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. చెన్నై బౌలర్ల ధాటికి ఢిల్లీ టాపార్డర్ కుప్పకూలింది. అయితే, మధ్య ఓవర్లలో సమీర్ రిజ్వీ 40 నాటౌట్, స్టబ్స్ 38 పరుగులతో బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.