Publish Date:May 27, 2026
కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం: మే 30న కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్!
కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర నాయకత్వంలో మార్పు చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం (మే 30) నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఢిల్లీ వేదికగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న అంతర్గత చర్చల అనంతరం అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చడంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. నాటి నుంచి ఆయనకు సీఎం పీఠం దక్కుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ, సీనియార్టీ దృష్ట్యా అధిష్టానం సిద్ధరామయ్యకు తొలి ప్రాధాన్యత ఇచ్చింది. అయితే తాజాగా మారిన సమీకరణాల నేపథ్యంలో రాష్ట్రంలో నాయకత్వ మార్పునకు కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపుతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఈ అధికార బదిలీ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. సిద్ధరామయ్య స్వచ్ఛందంగానే పదవి నుంచి తప్పుకునేందుకు అంగీకరించారని అంటున్నారు. అధిష్టానం సూచనల మేరకు రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే అవకాశం ఉంది. ఆ వెంటనే నూతన సీఎం ఎంపిక ప్రక్రియ లాంఛనంగా ముగుస్తుందని అంటున్నారు.
ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్ శనివారం (మే30) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం కూడా ఖరారైందని అంటున్నారు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటనే తరువాయి అని అంటున్నారు.
కర్ణాటకలో గత ఎన్నికల ఫలితాల సమయంలోనే ముఖ్యమంత్రి పదవి విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పోటీపడ్డారు. ఆ సమయంలో అధిష్టానం ఇద్దరు నేతలను ఒప్పించి అధికార పంపకాల ఫార్ములాను కుదిర్చినట్లు వార్తలు వచ్చాయి. అందులో భాగంగానే ఇప్పుడు నిర్ణీత కాలపరిమితి ముగియడంతో సిద్ధరామయ్య తప్పుకుని, శివకుమార్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రానున్న రెండు రోజుల్లో ఈ నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన మరియు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dkshivakumar-take-oath-as-karnataka-cm-25-221061.html
దేశవ్యాప్తంగా విద్యా రంగంలో చోటుచేసుకుంటున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలు, మూల్యాంకన వ్యవస్థ వైఫల్యాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
వేలమంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణలో ప్రాంతీయ ఆకాంక్షలను, ఉద్యమాలను జనసేన గౌరవించాలని కేటీఆర్ పవన్ కు హితవు పలికారు. అయితే, ఈ వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. కేటీఆర్ సంధించిన ప్రశ్నలనే తిరిగి కల్వకుంట్ల కుటుంబానికి గురిపెడుతూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2024 ఎన్నికలలో వైనాట్ 175 అంటూ బీరాలు పలికిన జగన్.. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి కేవలం 11 స్థానాలతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన ఆయనకు, ఆయన పార్టీకీ కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వడానికి జనం నిరాకరించారు.
రాష్ట్రంలో వైసీపీ పాలన అంతమై రెండేళ్లు గడిచిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. రాష్ట్ర చరిత్రలో జూన్ 4ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా అభివర్ణించారు.
భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు వంటి మహనీయుడిని సైతం నేడు ఒకే ఒక్క కులానికి పరిమితం చేసే దుస్థితి మన రాష్ట్రంలో నెలకొందన్న పవన్ కల్యాణ్.. కులాల పేరుతో సమాజాన్ని విడదీసే ఈ దుర్మార్గపు రాజకీయాలకు ఎక్కడో ఒకచోట చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కులాల ఐక్యతే జనసేన పార్టీ మూల సిద్ధాంతమన్నారు.
గద్దర్ కుమార్తె వెన్నెల పవన్ కల్యాణ్ మాటలు తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని, తన తండ్రి గద్దర్ వారసత్వాన్ని అవమానించేలా ఉన్నాయని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా పవన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్‌పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్.. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.