Publish Date:Oct 28, 2024
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. మొత్తం ప్రపంచం దృష్టి ఆ ఎన్నికలపైనే ఉంది. అయితే ఇప్పటి వరకూ అమెరికా అధ్యక్ష పీఠాన్ని మహిళ అధిరోహించిన చరిత్ర లేదు. ఈ సారైనా అధ్యక్ష పదవికి అమెరికన్లు మహిళను ఎన్నుకుంటారా? అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. గతంలో హిల్లరీ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. అయితే ఆమె ట్రంప్ చేతిలో పరాజయం పాలయ్యారు.
ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్,భారత సంతతికి చెందిన కమలాహారిస్ పోటీపడుతున్నారు. గతానికి భిన్నంగా ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. రిపబ్లికన్ అభ్యర్ధి ట్రంప్ పై ప్రచారంలో దాడి జరిగింది. అగంతకుడి తూటా నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన కారణంగా ట్రంప్ పై సానుభూతి వెల్లువెత్తుతుందని రిపబ్లికన్ లు ఆశిస్తున్నారు. నాలుగేళ్ల కిందట అంటే 2020లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడన్ చేతిలో పరాజయం పాలయ్యారు. నాలుగేళ్ల విరామం అనంతరం మళ్లీ ట్రంప్ బరిలో దిగారు. ఇప్పుడు డెమొక్రటిక్ అభ్యర్థిగా బైడన్ కాకుండా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ ట్రంప్ ప్రత్యర్థిగా నిలబడ్డారు. వయోభారం కారణంగా బైడన్ స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకుని ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ కు అవకాశం ఇచ్చారు.
అమెరికా ఆవిర్భావం తరువాత ఈ 235 సంవత్సరాలో అయి 46 మంది అధ్యక్షులు గెలిచినా వారిలో ఒక్క మహిళ లేకపోవడం అమెరికా సమాజంలో పురుషాధిక్యతకు నిదర్శనం అనడం కంటే ఆ సమాజంలో మహిళల పట్ల వివక్ష ఉందనడానికి రుజువుగా చెప్పుకోవచ్చు. ట్రంప్ పై 2016లో హిల్లరీ క్లింటన్ పోటీ చేసి చివరివరకూ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ ఆమె గెలవలేకపోయారు. ఇప్పుడు ఎనిమిదేళ్ల తరువాత మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మహిళ నిలబడ్డారు.
ఈ సారైనా అమెరికన్లు మహిళను అధ్యక్షురాలిగా ఎన్నుకుంటారని ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. అసలు ఇప్పటి వరకూ అమెరికా అధ్యక్ష పదవి ఒక మహిళకు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించక మానదు. ప్రపంచంలోనే అత్యాధునిక దేశం,నాగరికతలో మేటి,స్వేచ్ఛా సమాజంగా పేరొందిన అమెరికాలో ప్రధాన పార్టీలు రెండూ కూడా మహిళలను అధ్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంచడం మహిళా వివక్షగానే చెప్పుకోవలసి ఉంటుంది. అమెరికా చరిత్రలో అధ్యక్ష బరిలో నిలబడిన తొలి మహిళగా హిల్లరీ క్లింటన్ రికార్డు సృష్టించారు. ఇప్పుడు 2024 ఈసారి కమలా హారిస్ పురుషాహంకారాన్ని ఆధిక్యతను ఎదుర్కొని విజయం సాధిస్తారా చూడాల్సి ఉంది.
భారత్,శ్రీలంక,ఫిలిప్పీన్స్,ఫ్రాన్స్ వంటి దేశాల్లో దేశాధినేతలుగా మహిళలు 60,70దశకాల్లోనే ఎన్నికయ్యారు. అమెరికాలో ఇంతవరకూ మహిళా అధ్యక్షరాలు ఎన్నిక కాకపోవడం, అన్నిటికీ మించి 235 ఏళ్ల చరిత్రలో కేవలం రెండంటే రెండు సార్లు మాత్రమే అధ్యక్ష బరిలో మహిళలు నిలబడే అవకాశం రావడం అంటే అమెరికన్ సమాజంలో మహిళల పట్ల వివక్ష ఏ స్థాయిలో ఉందన్నది అవగతమౌతుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/discrimination-towards-women-in-america-39-187510.html
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని.
అయితే ఆయన తాజాగా నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు, వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో కలకలం రేపింది.
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు. ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం.