భారతీయ కార్పొరేట్ రంగంలోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ అత్యంత ప్రభావమంతమైన వ్యూహకర్తగా, బలమైన లాబీయిస్ట్ గా గుర్తింపు పొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ పరిమళ్ నత్వానీకి ఈసారి నిరాశే మిగిలింది. వరుసగా మూడు పర్యాయాలు, అంటే దాదాపు 18 ఏళ్ల పాటు రాజ్యసభలో చక్రం తిప్పిన నత్వానీకి.. 2026 రాజ్యసభ ఎన్నికల్లో ఎక్కడా చోటు దక్కలేదు. ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పరిమళ్ నత్వానీ రాజకీయ ఒక సారి పరిశీలిస్తే ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌లో ఆయన ఆరితేరారని అర్థమవుతుంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి అత్యంత నమ్మకస్తుడైన నత్వానీ, 2008లో మొదటిసారిగా జార్ఖండ్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ బరిలోకి దిగారు. ఏ రాజకీయ పార్టీకి అధికారికంగా చెందని వ్యక్తి అయినప్పటికీ.. తనకున్న కార్పొరేట్ నెట్‌వర్క్, అద్భుతమైన లాబీయింగ్ వ్యూహాల ద్వారా స్థానిక ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకుని అప్పట్లో సంచలన విజయం సాధించారు. ఆ విజయం యాదృచ్ఛికం కాదని నిరూపిస్తూ.. మళ్లీ 2014లో కూడా అదే జార్ఖండ్ నుండి రెండోసారి కూడా ఇండిపెండెంట్ గా పెద్దల సభలో అడుగుపెట్టారు. జార్ఖండ్ లాంటి గిరిజన ప్రాధాన్యత, సంక్లిష్ట రాజకీయాలు ఉన్న రాష్ట్రంలో ఒక గుజరాతీ పారిశ్రామికవేత్త వరుసగా రెండుసార్లు ఇండిపెండెంట్ గా గెలవడం అప్పట్లో ఒక అరుదైన రికార్డుగా నిలిచింది.
అయితే, 2020 నాటికి జార్ఖండ్ రాజకీయాల్లో ఊహించని మార్పులు రావడంతో నత్వానీ ఆంధ్రప్రదేశ్ వైపు చూశారు. నాడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ స్వయంగా రంగంలోకి దిగి.. నాటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ ఉన్నత స్థాయి చర్చల ఫలితంగా.. ఆంధ్రప్రదేశ్‌తో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ వైసీపీ కోటా నుండి పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు దక్కింది. జగన్ తన సొంత పార్టీకి చెందిన ఎందరో సీనియర్ నేతలను, ఆశావహులను పక్కనబెట్టి మరీ నత్వానీని ఏపీ నుండి పెద్దల సభకు పంపారు. ఈ విధంగా రెండుసార్లు జార్ఖండ్ నుండి, ఒకసారి ఆంధ్రప్రదేశ్ నుండి మొత్తం మూడు సార్లు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ప్రస్తుత 2026 ఎన్నికల నాటికి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలుకావడంతో, ఆ పార్టీకి ఈసారి ఒక్క రాజ్యసభ సీటును కూడా సొంతంగా గెలుచుకునే సంఖ్యాబలం లేదు. ప్రస్తుతం ఖాళీ అవుతున్న 4 స్థానాలనూ అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికే దక్కబోతున్నాయి. మరోవైపు జార్ఖండ్‌లోనూ ప్రస్తుత అధికార, ప్రతిపక్ష కూటములు స్థానిక క్యాడర్‌కే ప్రాధాన్యత ఇవ్వడంతో అక్కడ కూడా నత్వానీకి మొండిచేయే ఎదురైంది. దీంతో.. ఒకప్పుడు తెరవెనుక ఉండి దేశ రాజకీయాలను శాసించిన రిలయన్స్ ప్రతినిధి పరిమళ్ నత్వానీ, ఈసారి ఏ రాష్ట్రం నుంచీ మద్దతు లభించక పెద్దల సభకు దూరమై మాజీ ఎంపీగా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/disappointment-for-parimal-natwani-39-222073.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.