వైసీపీలో రగులుతున్న ఆత్మీయ సమ్మేళనాల చిచ్చు!

Publish Date:Jul 23, 2023

Advertisement

ఏపీలో అధికార  వైసీపీ పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతున్నది. పార్టీలో నేతల మధ్య కుమ్ములాటలు తీర్చేందుకు అధిష్టానం పడరాని పాట్లు పడుతున్నది. అయినా పెద్దగా ఫలితం కనిపించడం లేదు.  నేతల మధ్య చిచ్చు తీర్చే క్రమంలో అధిష్టానం పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లుగా తయారౌతున్నది. అధిష్టానం గీసిన గీతలను ఎప్పుడో దాటేసిన వైసీపీ నేతలు,  సొంత పార్టీ నేతలనే ప్రత్యర్ధులుగా భావించి వారిని దెబ్బతీసే కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నారు. ఫలితంగా..    పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారౌతున్నది.  రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల మధ్య అంతర్గత యుద్ధం తారస్థాయికి చేరింది. 

కొన్ని కొన్ని నియోజకవర్గాలలో వైసీపీ పార్టీలో కుమ్ములాటలు రచ్చకెక్కుతున్నాయి.  ఇలా పార్టీలో విభేదాలు రచ్చకెక్కిన నియోజకవర్గాలలో మాజీ మంత్రులు, సీనియర్ నేతల నియోజకవర్గాలు  కూడా ఉండడం విశేషం. అటు చిత్తూరులో రోజా, ఇటు గుంటూరులో అంబటి రాంబాబు, విడదల రజనీ,   విశాఖలో అవంతి,  తూర్పు గోదావరిలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇలా బడా బడా నేతల జిల్లాలు, స్థానాలలో  అంతర్గత యుద్ధం నడుస్తున్నది. అది కూడా ఈ బడా నేతల వల్లనే  పోరు జరగడం ఇప్పుడు అధిష్టానం సైతం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సీనియర్ నేతలకు అదే జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు అదే నియోజకవర్గంలోని సీనియర్ నేతలతో పొసగడం లేదు. అందుకే ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ కార్యకర్తలను విడదీసి కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు.

   రామచంద్రపురం నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇక్కడ మంత్రి చెల్లుబోయిన వేణు.. మాజీ మంత్రి, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌ వర్గాల మధ్య ఆధిపత్యపోరు పీక్స్‌కి చేరింది. ప్రస్తుతం బోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్ మంత్రి వేణుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తనను ఆశీర్వదించాలని కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధిష్టానం మంత్రి వేణుకే టిక్కెట్ ఖరారు చేస్తే.. తాను ఇండిపెండెంట్‌గా  లేదా టీడీపీ తరఫున బరిలో దిగి వేణును ఓడిస్థానని ప్రజలకు చెప్తున్నారు. తాజాగా, పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఇదే విషయాన్ని మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు మళ్లీ టికెట్ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని స్పష్టం చేశారు. ఈ తండ్రీ కొడుకులలో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వకుంటే వారు పార్టీ వీడడం ఖాయంగా కనిపిస్తున్నది. 

కాగా, ఆదివారం (జూలై 23) మంత్రి వేణు వర్గం ఆత్మీయ సమావేశం నిర్వహించింది. చోడవరంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి వేణు వర్గం నియోజకవర్గంలోని అన్నిగ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనాలను తరలించి తన సత్తా చాటుకున్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ బాధ్యతలు స్వీకరించి 3 ఏళ్లయిన సందర్భంగానే ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినట్లు మంత్రి వర్గం చెప్పుకుంది. మంత్రిగా మూడేళ్ళ వేడుక అనే చెప్తున్నా ఇది ముమ్మాటికీ వేణుగోపాల్ తన ఆధిపత్యాన్ని చాటుకుని బలం నిరూపించుకోవడానికి నిర్వహించిన సమావేశమే వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి.  ఇలా రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల వైసీపీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తుండగా.. ఇక ఒక్కొక్కటీ ఆత్మీయ సమ్మేళనాల రూపంలో బయటపడే ఛాన్స్ కనిపిస్తున్నది.

By
en-us Political News

  
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.