దిమాగీ నక్సల్స్ పార్టీ.. ఇన్ స్టా గ్రామ్ లో లక్షల ఫాలోవర్లు.!
Publish Date:Aug 17, 2026
Advertisement
ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట బురుజులపై నుంచి చేసిన పంద్రాగస్టు ప్రసంగంలో ఉపయోగించిన దిమాగీ నక్సల్ పదం దేశ వ్యాప్తంగా చర్చకు తెరలేపింది. దిమాగీ నక్సల్ అన్న పదం రాజకీయవర్గాలలోనే కాకుండా నెటిజనులలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన కాక్రోచ్ అన్నపదం ఎంతటి సంచలనానికి దారి తీసిందో.. ప్రధాని తన పంద్రగస్టు ప్రసంగంలో ఉపయోచించిన దిమాగీ నక్సల్ పదం కూడా అంతకు మించి సంచలనం సృష్టించింది. మావోయిజంపై ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ.. అడవుల్లో సాయుధ నక్సలిజాన్ని తుడిచిపెట్టామని చెప్తూనే.. సిద్ధాంతపరంగా ఆలోచనల్లో ఉండే దిమాగీ నక్సల్స్ సమాజంలో ఇంకా మిగిలే ఉన్నారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఆయన ప్రసంగం ముగిసిన గంటల వ్యవధిలోనే ఇన్స్టాగ్రామ్లో దిమాగీ నక్సల్ పార్టీ పేరుతో ఒక ఖాతా ప్రత్యక్షమైంది. ఈ ఇన్ స్టా ఖాతాకు నెటిజనుల నుంచి విశేష ఆదరణ లభించింది. దిమాగీ నక్సల్ పార్టీ ఇన్స్టాగ్రామ్ పేజీ ప్రారంభమైన 24 గంటల వ్యవధిలోనే 1.6 లక్షలకు పైగా ఫాలోవర్లను సాధించి రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకూ ఈ ఖాతాలో 62 పోస్టులు ఉన్నాయి. ఈ స్థాయిలో ఫాలోవర్లను సంపాదించి వైరల్ అవుతున్న దిమాగీ నక్సల్ పార్టీ పేజీ ఎవరు నిర్వహిస్తున్నారు? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే విషయాలపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. పేజీ నిర్వాహకులు తమ గుర్తింపును రహస్యంగా ఉంచడం, కంటెంట్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో స్పష్టంగా వెల్లడించకపోవడం సస్పెన్స్ గా మారింది. ఇది మోదీ వ్యాఖ్యలకు నిరసనగా సృష్టించిన వేదికగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. Dimagi Naxal, Narendra Modi speech, Instagram viral page, Dimagi Naxal Party, 16 lakh followers, Independence Day Modi comments
http://www.teluguone.com/news/content/dimagi-naxal-39-229074.html





