20 వేల కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి : కవిత డిమాండ్

Publish Date:Jun 29, 2026

Advertisement

 

దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్సీ..

తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తాలో నిరుద్యోగులతో కలిసి చేపట్టిన ధర్నాలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల నియామకం, జాబ్ క్యాలెండర్ అమలు, ఏజ్ రిలాక్సేషన్ వంటి డిమాండ్లతో ఆందోళన చేపట్టిన నిరుద్యోగులకు ఆమె సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం నిరుద్యోగుల డిమాండ్లపై సానుకూలంగా స్పందించే వరకు వారి వెన్నంటి ఉంటానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కవిత.. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉద్యమం చేస్తున్న నిరుద్యోగ యువతను అభినందిస్తూ, నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతతో ఆటలాడుతోందని, నిరుద్యోగులను మోసం చేస్తోందని ఆరోపించారు.

అసెంబ్లీలో 19 వేలకుపైగా కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించిందని, డీజీపీ కూడా అదే విషయాన్ని వెల్లడించారని గుర్తు చేశారు. తాము సభలో ప్రశ్నించినప్పుడు కూడా 19 వేలకుపైగా పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పిందని, ఇప్పుడు మాత్రం మాట తప్పి కేవలం 5 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం అన్యాయమని మండిపడ్డారు. 5 వేలు కాదు.. 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కానిస్టేబుల్ నియామకాల విషయంలో నిరుద్యోగులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, తాను చేపట్టిన ఏ ఉద్యమాన్నైనా పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టనని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళలకు కానిస్టేబుల్ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో తాను కూడా కీలకంగా పోరాడిన వారిలో ఒకరినని చెప్పారు. ప్రస్తుతం ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న మహిళల ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలని సూచించారు.

19 వేలకుపైగా ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పడం సరికాదని, అదే విషయం అసెంబ్లీలో ప్రకటించినప్పుడు ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదా అని ప్రశ్నించారు. గతంలో ఏజ్ రిలాక్సేషన్ ఇస్తూ జీవో తీసుకొచ్చి, ఇప్పుడు దానిని వెనక్కి తీసుకోవడం నిరుద్యోగులను మోసం చేయడమేనని విమర్శించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు 36 ఏళ్లు, ఎస్సై పోస్టులకు 38 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 11 వేల ఉద్యోగాలే భర్తీ చేసిందని ఆరోపించారు. 

మరోవైపు రూ.7 వేల కోట్లతో మూసీ ప్రాజెక్ట్ చేపడుతున్న ప్రభుత్వం, పేదల ఇళ్లను తొలగిస్తూ ఆ ప్రాజెక్టును ఎందుకు అమలు చేస్తోందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి "బిడ్డా రేవంత్ రెడ్డి.. నిరుద్యోగులతో పెట్టుకుంటున్నావ్.. నిన్ను గద్దె దించే వరకు వాళ్లు వదిలిపెట్టరు. నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా బాగుపడలేదు. 5 వేలు కాదు.. 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. జఫ్పా ప్రభుత్వం" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జూలై 2న నిరుద్యోగులు సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారని, అదే రోజు ఉద్యమకారులతో నిర్వహించే భూపోరాట కార్యక్రమం అనంతరం అవసరమైతే నిరుద్యోగుల ఉద్యమంలోనూ పాల్గొంటామని ప్రకటించారు. నిరుద్యోగులు ఒంటరివారు కాదని, ఉద్యమకారులు, తమతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలు అందరూ వారికి అండగా నిలుస్తారని కవిత స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆమె విమర్శించారు.
 

By
en-us Political News

  
. ఈ సంఖ్య ఎంత పెద్దదంటే, మన దేశంలోని గోవా రాష్ట్రంలో ఉండే మొత్తం కుటుంబాల కంటే కూడా గ్రేటర్ హైదరాబాద్‌లోనే ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి. హైదరాబాద్ మహానగరం ఎంత వేగంగా విస్తరిస్తోందో.. ఉపాధి కోసం ఎంతలా జనం ఇక్కడికి తరలివస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం.
అద్విత్ జ్యువెలర్స్ ఐపీఓ 212.63 రెట్లు సబ్‌స్క్రిప్షన్‌తో రికార్డు సృష్టించింది. రూ. 46 జీఎమ్‌పీతో జూలై 1న భారీ లిస్టింగ్ లాభాల అంచనాలు. పూర్తి వివరాలు మరియు అలాట్‌మెంట్ స్టేటస్ ఇక్కడ చూడండి.
జూలై 4 నుండి ప్రారంభం కానున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు మరియు ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు భారీ డిస్కౌంట్లు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
దేశవ్యాప్తంగా మహిళా క్రికెట్ ప్రతిభను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఎమర్జింగ్ ఉమెన్స్ క్రికెట్‌ లీగ్ (EWCL) లోగో జూబ్లీహిల్స్‌లో ఘనంగా ఆవిష్కరించబడింది. ఆగస్టు 15 నుంచి 16 జట్లతో ప్రారంభం కానున్న ఈ లీగ్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
పవన్ కల్యాణ్ గత కొంత కాలంగా తీవ్రమైన భుజాల నొప్పితో బాధపడుతున్న సంగతి విదితమే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలన్న ఉద్దేశంతో ఆయన అంబానీ ఆస్పత్రిలో చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
2026 ఫిఫా వరల్డ్‌కప్‌ నాకౌట్‌లో పెను సంచలనం నమోదైంది. బలమైన జర్మనీ జట్టుకు పరాగ్వే పెనాల్టీ షూటౌట్‌లో 4 3 తేడాతో షాకిచ్చి లాస్ట్ 16కు దూసుకెళ్లింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) భారత ఫార్మా కంపెనీలు, కెమిస్ట్ అసోసియేషన్లపై దాఖలైన 14 ఏళ్ల నాటి యాంటీ కాంపిటీటివ్ కేసును కొట్టివేసింది. తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ వెలువరించిన ఈ కీలక తీర్పు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI వల్ల డబ్బు ఆదా అవుతుందని అనుకుంటున్నారా అయితే ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోవాల్సిందే. మానవ ఉద్యోగుల కంటే ఏఐ నిర్వహణకే టెక్ కంపెనీలకు విపరీతమైన ఖర్చవుతోందని ఎన్విడియా ఎగ్జిక్యూటివ్ మరియు ఎంఐటీ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఢిల్లీ ప్రభుత్వ సరికొత్త ఈవీ పాలసీ 2026 పూర్తి వివరాలు. మొదటి 1000 ఎలక్ట్రిక్ ట్రక్కులకు 10 ఏళ్ల నో ఎంట్రీ మినహాయింపు, కార్లపై రోడ్డు టాక్స్ రద్దు మరియు భారీ సబ్సిడీల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
బిట్‌కాయిన్ ధర మళ్లీ 60,000 డాలర్ల దిగువకు పడిపోయింది. అమెరికా ఫెడ్ నిర్ణయాలు, అంతర్జాతీయ పరిణామాల మధ్య క్రిప్టో మార్కెట్ తదుపరి గమ్యం ఏంటి? నిపుణులు సూచిస్తున్న కీలక మద్దతు ధరల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
యూఏఈలో నివసిస్తున్న 35 లక్షల మంది భారతీయులకు అలర్ట్. జూలై 1, 2026 నుంచి భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు మరియు కొత్త సెంటర్ల నిబంధనల్లో కీలక మార్పులు వచ్చాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. 10 గ్రాముల పసిడి ధర రూ.1,41,000 మార్కు కంటే దిగువకు పడిపోగా, వెండి ధర కూడా క్షీణించింది. పూర్తి లేటెస్ట్ రేట్లు మరియు ఇన్వెస్టర్ల గైడ్ ఇక్కడ చూడండి.
భారతీయ స్టాక్ మార్కెట్లో లాభాల పండగ. సరికొత్త మైలురాయి 24,000 మార్కును దాటి దూసుకెళ్లిన నిఫ్టీ 50. దాదాపు 3 శాతం లాభాలతో సెన్సెక్స్‌ను నడిపిస్తున్న మారుతీ సుజుకీ షేర్లు. పూర్తి వివరాలు మరియు నేటి టాప్ స్టాక్స్ అప్‌డేట్ కోసం ఇప్పుడే చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.