ఇండియా కూటమిలో లుకలుకలు ?

Publish Date:Sep 13, 2023

Advertisement

2024 లోక్ సభ ఎన్నికలలో బీజేపీ ఓటమి,  ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దింపడమే  ఎజెండా గా ఏర్పడిన ఐ డాట్ ఎన్ డాట్ డి డాట్ ఐ డాట్ ఎ… (ఇండిమా) చుక్కల కూటమి... లెక్కలు తప్పుతున్నాయా? కూటమి కలలకు శ్రీకారం చుట్టిన జనతాదళ్ (యు) అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్  అడుగులు తడబడుతున్నాయా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. నిజమే. అడుగులు తడబడుతున్నది ఒక్క నితీష్ నడక, నడతలోనే కాదు. కూటమి పెద్ద దిక్కు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అడుగులు కూడా తడబడుతున్నాయి. ఇప్పటికే పవార్  సమీప బంధువు (మేనల్లుడు) అజిత్ పవార్ మెజారిటీ ఎమ్మెల్యేలను వెంట పెట్టుకుని, బీజేపీ, శివ సేన (షిండే) కూటమితో చేతులు కలిపారు. ఆ కూటమి ప్రభుత్వంలో కొలువు తీరారు.  మహారాష్ట్ర ప్రభుత్వంలో అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయినా  శరద్ పవార్ ‘బంధుత్వం’ ముసుగులో అజిత్ పవార్ తో రాజకీయ బంధుత్వం కొనసాగిస్తున్నారనే  అనుమానాలు ఇండియా కూటమిలో వ్యక్తమవుతున్నాయి. పవార్ ముందు చూపుతోనే  రెండు పడవల ప్రయాణం చేస్తున్నారని  రేపు ఎన్నికల ముందో తర్వాతో పరిస్థితులను బట్టి  ఆయన అటు మొగ్గినా, ఇటు మొగ్గినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.   

మరోవంక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్  ఆమ్ ఆద్మీ పార్టీ  (ఆప్ ) మరో అడుగు ముందుకేసింది. ఓ వంక ఇండియా కూటమి  బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి  అభ్యర్ధులను నిలబెట్టే ఆలోచనతో  సీట్ల సర్దుబాటు గురించి చర్చలు జరుపుతుంటే, బుధవారం (సెప్టెంబర్ 13) ఢిల్లీలో శరద్ పవార్ నివాసంలో ఇండియా కూటమి కోఅర్దినేషన్, ఎలక్షన్ స్ట్రాటజీ సమావేశం జరుగుతోంది) మరోవంక, ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే,మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రాలలో పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితాను ఆప్   ప్రకటించేసింది.  అంతేకాకుండా. తృణమూల్, జేడీయు, ఎస్పీ, ఆప్, ఆర్జేడీ సహా కూటమి భాగస్వామ్య పార్టీలు, కూటమి మనుగడకు సీట్ల పంపకమే కీలకమని భావిస్తున్నాయి. అలాగే  అదేదో  తేలిన తర్వాతనే ఉమ్మడి ప్రచార వ్యూహం గురించి మాట్లాడదామని అంటున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ మాత్రం సీట్ల సర్దుబాటు కంటే కూటమి నాయకత్వం పై నిర్ణయం అవసరమని భావిస్తోంది.   

ఆదలా ఉంటే  ఇప్పడు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, పవార్ అడుగుజాడల్లో అయితే అడుగులు వేస్తున్నారన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. నిజానికి  గత సంవత్సరం ఆగష్టులో బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ఆర్జేడీతో జట్టు కట్టినా, ఆయన మళ్ళీ  ఎప్పుడైనా బీజేపీ గూటికి చేరతారనే అనుమానాలు అప్పటి నుంచీ వినవస్తూనే ఉన్నాయి. అయితే  నితీష్ గత జనవరి, ఫిబ్రవరి నెలలలో విపక్షాల ఐక్యత వేదిక ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఆయన సారధ్యంలో, ఆయనే అనుసంధానకర్తగా బీజేపీ వ్యతిరేక విపక్ష పార్టీల తొలి సమావేశం  పాట్నాలో జరిగింది. ఆ తర్వాత బెంగుళూరులో జరిగిన  రెండవ సమావేశంలో  ఇండియాగా నామకరణం జరిగింది. ముంబైలో మూడవ సమావేశం కూడా జరిగింది కానీ  కూటమిని తమ గుప్పిట్లోకి తీసుకోవాలనే  నితీష్ కల మాత్రం ముందుకు సాగ లేదు. బ్రేక్ పడింది. కూటమిని, కాంగ్రెస్ పార్టీ తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసిన చేసిన నేపధ్యంలో నితీష్ కుమార్  ఇండియా కూటమితో కొంత అంటీముట్టనట్లే ఉంటున్నారు.

అదలా ఉంటే ఇప్పడు తాజాగా నితీష్ కుమార్  అనూహ్యంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గత శనివారంనాడు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన జి-20  విందు సమావేశానికి హాజరయ్యారు. దీంతో ఆయన అడుగులు జోడు పడవల ప్రయాణం వైపుగా పడుతున్నాయా  అనే అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతోనూ మాట కలిపారు. బీహార్‌లో బీజేపీతో గత ఏడాది ఆగస్టులో నితీష్ తెగతెంపులు చేసుకున్న తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన కలవడం ఇదే మొదటిసారి. నితీష్‌ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రధానమంత్రి పరిచయం చేశారు. బీజేపీని ఓడించేందుకు సర్వశక్తులూ ఒడ్డాలని నిర్ణయించుకున్న 'ఇండియా కూటమి' నేతలకు సహజంగానే ఇది మింగుడుపడని వ్యవహరమే. నీతీష్ మంచి రాజనీతిజ్ఞుడని, సమయానికి తగు నిర్ణయాలు తీసుకోవడంలో కాకలు తీరిన నేత అని అందరికీ తెలిసిన విషయమే. జి-20 డిన్నర్‌కు హాజరుకావడం ద్వారా సొంత నిర్ణయాలు తీసుకోగలిగిన సామర్థ్యం తనకు ఉందని  నితీష్ కూటమి భాగస్వామ్య పక్షాలకు చెప్పకనే చెప్పినట్టు అయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జి-20 మెగా షో‌తో దేశానికి ఒరిగేదేమీ లేదని బీహార్‌లో నితీష్ భాగస్వామ పార్టీ ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ యాదవ్ గత సోమవారంనాడు పెదవి విరిచారు.

బీహార్‌లో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాల మద్దతుతో మహాకూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విపక్ష ఐక్య కూటమి యత్నాలకు నితీష్ సారథ్యం వహిస్తూ వచ్చారు. ప్రధాని మోడీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తేవడమే తన లక్ష్యమని నితీష్ చెబుతూ వచ్చారు. అయితే విపక్ష కూటమికి సారథ్యం వహించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేరును లాలూ ప్రసాద్ ఇటీవల ప్రతిపాదించడం జేడీయూకు మింగుడు పడటం లేదు. జేడీయూ అగ్రనేతలు కొందరు విపక్ష కూటమి పీఎం అభ్యర్థిగా నితీష్ పేరును ప్రతిపాదించాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, ఈ ముచ్చట ఏదీ ముంబై సమావేశంలో చోటుచేసుకోలేదు. కో-ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేయడం, సీట్ షేరింగ్ అంశాన్ని సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తీసుకురావాలని మాత్రమే సమావేశంలో నిర్ణయించారు. దీంతో ఒక్క నితీష్ మాత్రమే కాదు, అటు మమత, ఇటు కేజ్రీవాల్ .. అలాగే, ఇడియా కూటమిలోని ఇతర పార్టీల నేతలు కూడా, ఇండియా కూటమి సారధ్య బాధ్యతలను హస్తం పార్టీకి అప్పగించేందుకు సిద్ధంగా లేరని, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ  సారధ్యంలో పనిచేసేందుకు సిద్ధంగా లేరని, అంటున్నారు.

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.