రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్.. మర్యాద గీత దాటేసిన విభేదాలు

Publish Date:Jan 24, 2023

Advertisement

 వ్యవస్థల మధ్య, వ్యక్తుల మధ్య విభేదాలు ఉంటే ఉండవచ్చును. కానీ, వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య విబేధాలు ఘర్షణాత్మక స్థాయికి చేరుకోవడం మాత్రం ఎంత మాత్రం అభిలషణీయం కాదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. అయితే, తెలంగాణ ప్రభుత్వం,  ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు,  గవర్నర్ తమిళి సై సౌందరరాజన్  మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణం మర్యాద గీతను దాటేసిందనే అభిప్రాయమే ప్రముఖంగా వినిపిస్తోంది. గత మూడున్నరేళ్లుగా గవర్నర్, కేసీఆర్ మధ్య విభేదాలు ఉన్నాయి. రోజు రోజుకూ రాజుకుంటూనే ఉన్నాయి. గత మూడున్నరేళ్లుగా ఇరువురూ అనివార్యమైన ఒకటి రెండు సందర్భాలలో వినా ముఖాముఖీ భేటీ అయిన దాఖలాలు లేవు. ఈ ఇరువురి మధ్యా విభేదాల ప్రభావం జాతీయ పండుగలపైనా పడుతోంది. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవాలు ఈ సారి రాజ్ భవన్ కు పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. అలాగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో సైతం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించే అవకాశం కూడా కనిపించడం లేదు.  

అదలా ఉంటే, తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు  పూర్తి చేసుకున్న తమిళిసై సౌందర్ రాజన్   మూడేళ్లుగా తను ఎదురైన చేదు అనుభవాలను మీడియాకు వివరించారు. ఎట్ హోంకు వస్తానని చెప్పిన సీఎం రాలేదని ఆమె అన్నారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలని చెప్పుకొచ్చారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో ఇలా వివక్ష చూపడం సరైంది కాదని గవర్నర్ హితవు పలికారు.  ప్రజలను కలవాలని అనుకున్న ప్రతిసారి తనకుఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు.

గతంలో మేడారం జాతరకు వెళ్లేందుకు హెలికాప్టర్‌ అడిగినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని తమిళిసై వివరించారు. సమ్మక్క- సారక్క జాతరకు వెళ్లేందుకు రోడ్డు మార్గంలో 8 గంటలు ప్రయాణించానని,  తాను ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ ఇవ్వడం లేదని, ఇంకా చాలా విషయాలు ఉన్నా..  కొన్ని విషయాలు బయటకు చెప్పడం మంచిది కాదని మౌనంగా ఉంటున్నట్లు తమిళిసై చెప్పారు.  తనకు గౌరవం ఇచ్చిన ఇవ్వకపోయినా పట్టించుకోననని.. రాజ్‌భవన్‌ను గౌరవించాలి అన్నారు.   అంతే కాదు.. తెలంగాణ ప్రభుత్వం గవర్నర్‌ను అవమానిస్తోంది. రిపబ్లిక్ డే,  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మీరే చూస్తారుగా..   వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో గవర్నర్ల వ్యవస్థపై ముఖ్యమంత్రులు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆమె చెప్పినట్లుగానే ఇప్పుడు గణతంత్ర దినోత్సవ వేడుకలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో  గవర్నర్ ప్రమేయం లేకుండానే ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది.  ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో గవర్నర్ ఉనికిని గుర్తించడానికి కేసీఆర్ సర్కార్ ఏ  మాత్రం సిద్ధంగా లేదన్నది తేటతెల్లమౌతోంది. 

By
en-us Political News

  
ప్రేమలో పడితే చాలా మంది పిచ్చి పనుల చేస్తుంటారు. నా కోసం ఏం చేస్తావని ప్రియురాలు అడిగితే.. ప్రాణమైనా ఇస్తానని లేదా ఆకాశంలోని చుక్కలైనా తెచ్చిస్తానని సినిమా డైలాగులు చెబుతుంటారు.
చిన్న రీఫండ్ కోసం ప్రయత్నించింది.. చివరకు భారీ మొత్తాన్ని పోగొట్టుకుంది.!
ఫ్రీ బస్సులో భార్య.. నవ్వులు పూయిస్తున్న భర్త ఆవేదన. !
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నటి రష్మిక మందన్నలకు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై వారి అధికారిక బృందం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
భాగ్యనగర ప్రయాణ ముఖచిత్రం మారనుందా? నగరంలో మెట్రో రైలు సేవలను శివారు ప్రాంతాలకు విస్తరించడంతో పాటు విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని కల్పించే దిశ
తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపిన వంద కోట్ల రూపాయల ప్రైవేట్ పాఠశాలల అనుమతుల కుంభకోణంలో డీఎంకే సీనియర్ నేత
హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు మేక శవంతో డెత్ డ్రామా.!
దేశ రాజధాని దిల్లీలో ఎన్నికల సంఘం పనితీరును నిరసిస్తూ కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
నా చావుకే రూ.40 కోట్ల విలువనా? లేక నేను బతికి ఉండాలా అనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి! అంటూ జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు
ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనానికి బానిసైన ఓ యువకుడు తన విలాసవంతమైన జీవితం కోసం ఏకంగా కిడ్నాప్ నాటకానికి తెరలేపాడు.
ఉద్యోగాల ఆశ చూపించి విదేశీ మహిళలను భారత్‌కు రప్పించడం.. ఆపై వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించడంతో మాదాపూర్‌లో వెలుగుచూసిన ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.
సీఎం రేవంత్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ.. 152 మీటర్ల ఎత్తుపై ముందడుగు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.