అగ్నిపథ్ పథకం గురించి ఆర్మీకి ముందుగా తెలియదా?

Publish Date:Feb 2, 2026

Advertisement

లోక్ స‌భ‌లో చ‌ర్చకు దారి తీసిన‌ ఆర్మీ మాజీ చీఫ్ మ‌నోజ్ ముకుంద్ న‌ర‌వ‌నె  ఆత్మకథ ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంలో ఏముంది? ఆ పుస్తకం లోక్ సభను గడగడలాడించడానికి కారణమేంటి?  సోమవారం (ఫిబ్రవరి 2)  న లోక్ సభలో  బడ్జెట్‌పై చర్చ జరుగుతున్న సమయంలో లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ పుస్తకంలోని అంశాలను ప్రస్తావించడంతో సభలో గందరగోళం రేగింది.  ఈ పుస్తకంలో ఉ అగ్నిప‌థ్ పథకం గురించి న‌ర‌వ‌నె ప‌లు సంచ‌ల‌న  విష‌యాలు పేర్కొన్నారు. అస‌లీ ప‌థ‌కం గురించి ఆర్మీకి ముందస్తు స‌మాచారమే లేదని ఆయన తన ఆత్మకథ ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీలో కుండబద్దలు కొట్టేశారు. అప్పట్లో ఇదొక షాకింగ్ అంశమని పేర్కొన్నారు.  తొలుత ఆర్మీ కేవ‌లం  టూర్ ఆఫ్ డ్యూటీలో భాగంగా.. కొంద‌రికి మాత్ర‌మే వ‌ర్తించేలా ఈ పథకాన్ని  ప్ర‌తిపాదించింది. కానీ ప్ర‌భుత్వం దాన్ని అంద‌రికీ వ‌ర్తింప చేస్తూ అగ్నిప‌థ్ గా  మార్చింద‌ని త‌న ఆత్మకథలో న‌ర‌వ‌నె పేర్కొన్నారు. దీనిపై నౌకా, వైమానిక దళాలు సైతం విస్మయం చెందాయన్నారు.  

అలాగే గాల్వ‌న్, ల‌డ‌ఖ్ వంటి చైనా స‌రిహ‌ద్దుల వెంబ‌డి వివ‌రాల్లోకి వెళ్తే.. 2020లో గాల్వ‌న్ లోయ‌లో చైనాతో జ‌రిగిన సంఘ‌ర్ష‌ణ‌ల స‌మ‌యంలోని క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఆర్మీ మాజీ  చీఫ్ మనోజ్ ముకుంద్  నరవనె కళ్లకు గట్టారు.  2020 ఆగ‌స్టు 31  నాటి రాత్రి చైనా యుద్ధ ట్యాంకులు ముందుకు దూసుకొస్తున్న‌పుడు.. ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ త‌న‌కు ఫోన్ చేసి.. మీకు ఏది మంచి అనిపిస్తే అది చేయ‌మంటూ ఫ్రీ హ్యాండ్ ఇచ్చార‌ని పేర్కొన్న నవరనె..  ఆ సమయంలో యుద్ధం జ‌రిగేంత ఉద్రిక్త వాతావ‌ర‌ణం ఉండేద‌ని వివరించారు.  

ఇక ఈ అంశంపై పార్ల‌మెంటులో వివాద‌మేంటంటే.. రాహుల్ ఈ పుస్త‌కాన్ని కోట్ చేస్తూ.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. అయితే ఇటు హోం మంత్రి అమిత్ షా, అటు ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్   అభ్యంత‌రాలు చెప్పారు. మార్కెట్లోకి విడుద‌ల కాబోయే పుస్త‌కం గురించి దానిలోని అంశాల‌ను స‌భ‌లో ప్రస్తావించ‌రాద‌న్నది వారి అభ్యంతరం.   స‌భ‌లో ఒక మ్యాగ‌జైన్ లో వ‌చ్చిన స్టోరీని చూపిస్తూ మాట్లాడుతున్నారనీ, . దాని క‌స‌లు చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేనే లేదనీ అన్నారు. ఎవరైనా సరే తమ  ఆత్మ‌క‌థ‌ రాసుకు నేట‌పుడు కొన్ని సంచలన విషయాలను అదే పనిగా, లేదా ఉద్దేశపూర్వకంగా పొందుపరుస్తారనీ, వాటిని సభలో చర్చకు పెట్టడం ఏంటనీసంచ‌ల‌న విష‌యాలు అదిప‌నిగా పొందుప‌రుస్తారు. అలాంటి వాటిని స‌భ‌లో ప్ర‌వేశ పెట్ట‌డ‌మేంటి? చ‌ర్చించ‌డ‌మేంట‌ని ప్రభుత్వం తరఫున వారు రాహుల్ నరవనె పుస్తకంలోని అంశాలను సభలో ప్రస్తావించడాన్ని తప్పుపట్టారు.

మొత్తంగా చూస్తే రాహుల్ నరవానె ఆత్మకథ  ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంలోని అంశాలను సభలో లేవనెత్తడం ద్వారా కేంద్ర ప్రభుత్వం, ఆర్మీ మధ్య జరిగే సంభాషణలూ, నిర్ణయాధికారాల మధ్య సమన్వయం, విభేదాలకు సంబంధించిన అంశాలను సభలో చర్చకు తీసుకువచ్చింది.  

By
en-us Political News

  
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.