దేవినేని అవినాష్ దుబాయ్‌కి జంప్ ప్లాన్... అడ్డుకున్న పోలీసులు!
Publish Date:Aug 16, 2024
Advertisement
లోకేష్ రెడ్‌బుక్ ఓపెన్ చేయకముందే వైసీపీ దండుపాళ్యం గ్యాంగ్ లాగూలు తడిచిపోతున్నాయి. పుట్టగానే పువ్వు పరిమళించినట్టు తక్కువ వయసులోనే రకరకాల క్రిమినల్ వేషాలు నేర్చుకున్న వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించాడు. వైసీపీ పాలనలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ నాయకుల పాపాలు పండుతూ వుండటంతో దేవినేని అవినాష్ ఫారిన్ పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే దేవినేని అవినాష్ ప్లాన్‌ను మంగళగిరి పోలీసులు పటాపంచలు చేశారు. గురువారం రాత్రం హైదరాబాద్ నుంచి దుబాయ్ పారిపోయేందుకు దేవినేని అవినాష్ ప్రయత్నించాడు. దాంతో శంషాబాద్ విమానాశ్రయం అధికారులు మంగళగిరి పోలీసులకు సమాచారమిచ్చారు. దేవినేని అవినాష్‌పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని మంగళగిరి పోలీసులు చెప్పారు. దాంతో దేవినేని అవినాష్ విదేశాలకు వెళ్ళడానికి వీల్లేదని విమానాశ్రయం అధికారులు చెప్పారు. ఇక చేసేదేమీ లేక దేవినేని అవినాష్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెనక్కి వెళ్లిపోయాడు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ మీద ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా వున్నవారి మీద పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
http://www.teluguone.com/news/content/devineni-avinash-trying-to-escape-to-foreign-25-183036.html





