జమ్మూ కాశ్మీర్ కేబినెట్.. ఏ మంత్రికి ఏ శాఖంటే?
Publish Date:Oct 18, 2024
Advertisement
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన కేబినెట్ సహచరులకు శాఖలు కేటాయించారు. సీఎం సిఫారసు మేరకు మంత్రులకు శాఖలు కేటాయిస్తూ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శుక్రవారం (అక్టోబర్ 18) ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల మేరకు ,ఉప ముఖ్యమంత్రి సురీందర్ కుమార్ చౌదరి ప్రజా పనుల(ఆర్ అండ్ బి), పరిశ్రమలు,వాణిజ్యం,మైనింగ్, కార్మిక ఉపాధి -నైపుణ్య అభివృద్ధి వంటి బాధ్యతలను నిర్వహిం చనున్నారు. అలాగే జావేద్ అహ్మద్ రాణా జల్ శక్తి, అటవీ, పర్యావరణ, గిరిజన వ్యవహారాల శాఖలు, జావేద్ అహ్మద్ దార్ వ్యవసాయ ఉత్పత్తి, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, సహకార, ఎన్నికల శాఖలు, సతీష్ శర్మకు ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, రవాణా, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, యువత సేవలు, క్రీడలు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, ఇన్స్పెక్షన్, ట్రైనింగ్, గ్రీవెన్సెస్ డిపార్ట్‌మెంట్ (ఏఆర్ఐ) వంటి విభాగాల బాధ్యతలు అప్పగించారు. ఇక ఆర్థిక, హోం మంత్రిత్వ శాఖలు సహా ఏ మంత్రికీ కేటాయించని మిగిలిన శాఖలన్నీ ముఖ్యమంత్రి నిర్వహిస్తారు.
http://www.teluguone.com/news/content/departments-allocated-to-ministers-of-jammu-kashmir-cabinet-25-187030.html





