వణికిస్తున్న డెల్టా వేరియంట్.. టీకాతోనే జనాలకు సేఫ్..
Publish Date:Jun 15, 2021
Advertisement
దేశం అంతటా కరోనా విలయాన్ని సృష్టిస్తూనే వుంది. ఒక ప్రాంతంలో ఎక్కువ ఒక ప్రాంతంలో తక్కువ, అంతే, అదొక్కటే తేడా... అలాగే, తొలి విడతలో కొన్ని ప్రాంతాలలో ప్రళయాన్ని సృష్టిస్తే సెకండ్ వేవ్’లో ఇంకొన్ని రాష్ట్రాలను చుట్టేసింది. దేశంలో తొలి కరోనా కేసు నమోదైంది కేరళ రాష్ట్రంలోనే, అయినా ఫస్ట్ వేవ్’ ఆ రాష్ట్రంలో అంతగా ప్రభావం చూపలేదు. కానీ సెకండ్ వేవ్ రాష్ట్రంపై విరుచుకు పడింది. మరణ మృదంగం వినిపించింది. జూన్ 13 తేదీ నాటికి కేరళలో 11,181 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి.ఇందులో సగానికి సగం గడచిన 40 రోజుల్లోనే నమోదయ్యాయి.ఇవి కేవలం అధికారిక లెక్కలు మాత్రమే సుమండీ. కేరళలో మాత్రమే కాదు, మన తెలుగు రాష్ట్రాలు సహా చాలా వరకు రాష్ట్రాలు కరోనా కేసులు, కొవిడ్ మరణాల లెక్కలను తక్కువచేసి, తప్పుగా చూపించాయనే ఆరోపణలున్నాయి. నిజనికి ఇవి ఆరోపణలు కాదు నిజాలే. తెలంగాణాలో అయితే, వాస్తవ మరణాలకు ప్రకటిత అధికార లెక్కలకు పొంతనే లేదని అంటున్నారు. అంతే కాకుండా కరోనా చుట్టూ రాజకీయాలు వచ్చి చేరాయి. అందరూ కలిసి చేసిన తప్పుకు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నారు.దీంతో నిజం మరుగున పడిపోయింది. వాస్తవ లెక్కలు తప్పి పోయాయి. అందుకు కేరళ రాష్ట్రమే ప్రత్యక్ష ఉదాహరణ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆనవాయితీకి భిన్నంగా వరసగా రెండవసారి, వామపక్ష కూటమి అధికారంలోకి రావడానికి ఫస్ట్ వేవ్ కట్టడిలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం విజయం సాధించడం కూడా ఒక కారణంగా అందరూ పేర్కొన్నారు. దేశం అంతటా కేరళ మోడల్ ఫాలో కావాలని లెఫ్టిస్టులు దేశమంతా గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అయితే లెక్కలు తప్పుగా చూపారని రాష్ట్ర ప్రభుత్వ అధికారులే ఇప్పుడు అంగీకరిస్తున్నారు. అప్పుడు తక్కువ చూపడం వలన ఇప్పుడు ఎక్కువ మరణాలు కనిపిస్తున్నాయని అధికారులు అంటున్నారు. కరోనా తొలి వేవ్ ప్రభావం రాష్ట్రంపై అంతగా లేదు. అందుకు రాష్ట్రంలో సెకండ్ వేవ్’లో అది కూడా గడచిన 40 రోజుల్లో నమోదైన మరణాలే నిదర్శనంగా అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో మొదటి ఇంతవరకు మొత్తం 11,181మరణాలు సంభవించాయి. ఇందులో మొదటి సగం, అంటే 5500 మరణాలు 371 రోజుల్లో నమోదయ్యాయి, కానీ సెకండ్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ సంఖ్య రెట్టింపు కావడానికి కేవలం 40 రోజులు మాత్రమే పట్టింది. అంటే, తొలి వేవ్’కంటే సెకండ్‌వేవ్’లో రోజు వారీ మరణాల సంఖ్య ఇంచుమించిగా ఎనిమిది తొమ్మిది రెట్లు పెరిగింది. కేరళలో తొలి కొవిడ్ మరణం గత సంవత్సరం, 2020 మార్చి28 ఎర్నాకులంలో నమోదైంది. ఈ సంవత్సరం, 2021 మే నెలలో రాష్ట్రంలో 5500 మరణం రికార్డులకు ఎక్కింది.ఇక అక్కడి నించి, అంటే, మే 5 నుంచి మరణాల సంఖ్య రోజు రోజుకు పెర్గుతు వచ్చింది, మే18 నుంచి రోజుకు వంద మంది కొవిడ్ కాటులు బలయ్యారు. ఈ మధ్య కాలంలో నాలుగు సందర్భాలలో 200 సంఖ్యను దాటి మరణాలు సంభవించాయి. ఈ జూన్ 6అత్యధికంగా 226 మంది కొవిడ్’తో కన్ను మూశారు. ప్రస్తుతం దేశం అంతటా, కరోనా ప్రభావం తగ్గుతున్నా, కేరళలో మాత్రం ఉదృతి కొనసాగుతోంది.ఇప్పటికీ రోజు వందకు తగ్గకుండా మరణాలు సంభవిస్తున్నాయి. కేరళ సహా దేశం అంతటా కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందడానికి ఈసారి వచ్చింది, డెల్టా వేరియంట్ కావడం ఒక కారణం అయితే, కేరళలో సెకండ్ వేవ్ ఉదృతికి ఇతర కారణాలు కూడా ఉన్నాయని శాస్త్ర వేత్తలు అంటున్నారు. డెల్టా వేరియంట్ వేగంగా విస్తరించడం వలన కరోనా ఎక్కువ మందికి సోకింది. ఎక్కువమంది ఆసుపత్రి పాలయ్యారు. ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు.కేరళతో సహా దేశంలో హాస్పిటల్ సదుపాయాలు చాలినంతగా మరొక కారణం, అయితే, అన్నిటినీ మించి 40 సంవత్సరాల లోపు వారికీ వాక్సిన్ లేక పోఅడం వలన వాక్సిన్ పొందిన వృద్ధుల కంటే యువకులు ఎక్కువగా కరోనా సోకింది. ఇలా కేరళలో అదే విధంగా దేశంలో కరోనా సెకండ్ వేవ్, తీవ్ర ప్రభావానికి వాక్సిన్ అందరికి అందుబాటులో లేకపోవడం అన్నిటికీ మించిన మూల కారణంగా శాస్త్రవేత్తలు చెపుతున్నారు. సో... ఇక ఇప్పటికైనా, వాక్సిన్ రాజకీయలు పక్కన పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వాక్సిన్ పై దృష్టిని కేంద్రీకరించడం అవసరం.
http://www.teluguone.com/news/content/delta-variant-danzer-in-india-vaccine-only-protection-39-117644.html





