ఢిల్లీ లిక్కర్ స్కాం.. అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్ గా మారారా?

Publish Date:Oct 11, 2022

Advertisement

ఢిల్లీ లిక్కర్ స్కాం టీఆర్ఎస్ కాళ్ల కింద భూమిని కుదిపేస్తోందా? అంటే ఈడీ, సీబీఐల దూకుడు చూస్తుంటే ఔననే అనక తప్పడం లేదని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి ఈ స్కాం ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కాళ్ల కింద నేల కదిపేస్తుందని తొలుత భావించినా.. ఆ తరువాత దర్యాప్తులో ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్న విషయాలు ఈ స్కాంలో కర్త,కర్మ,క్రియ మొత్తం తెలంగాణ గడ్డేనన్న అనుమానాలకు తావిస్తున్నాయి.

ముఖ్యంగా ఈ స్కాం లింకులన్నీ తెరాస చుట్టే తిరుగుతున్నాయన్న అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఈ స్కాం కు సంబంధించి తెలంగాణలో తొలి అరెస్టు జరిగిన తరువాత ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇక ఈ స్కాం కు సంబంధించి అనుమానితులలో ఒకరిద్దరిని అప్రూవర్ చేసుకుని కుంభకోణం నిగ్గు తేల్చే ఉద్దేశంతో ఈడీ, సీబీఐ ముందుకు సాగుతున్నాయి. ఈ కేసులో తెలంగాణలో అభిషేకరావును అరెస్టు చేయడం ద్వారా లిక్కర్ స్కాం మూలల్లోకి దర్యాప్తు సాగుతోందని పరిశీలకులు అంటున్నారు.  

ఢిల్లీలో లిక్కర్ పాలసీ మారిస్తే.. అందులో ఉన్న స్కాం మూలాలన్నీ తెలంగాణలోనే కనిపిస్తుండటం, అందులోనూ ఈ కుంభకోణంలో తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పై ఆరోపణలు రావడంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి ఇప్పటి వరకూ మూడు అరెస్టులు జరిగాయి. అరెస్టయిన ముగ్గురిలో ఒకరు టీఆర్ఎస్ పెద్దలకు  సన్నిహితుడైన  బోయినపల్లి అభిషేక్ రావును ఒకరు. ఇప్పటికే ఆయనను సీబీఐ మూడు రోజుల కస్టడీకి తీసుకుంది. ఢిల్లీ కేంద్రంగా ఆయనను విచారిస్తోంది.

కానీ  రాబిన్ డిస్ట్రిబ్యూషన్‌తో పాటు పలు రకాలుగా అభిషేక్ రావుతో వ్యాపారాలు చేస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్లైను అరెస్టు చేయకపోవడమే పలు అనుమానాలకు తావిస్తోంది. అరుణ్ రామచంద్రపిళ్లై అప్రూవర్‌గా మారిన కారణంగానే ఆయనను అరెస్టు చేయలేదని సీబీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు  అరుణ్ రామచంద్ర పిళ్లైను ప్రశ్నించిన అధికారులు ఆయన నుంచి స్కాం వివరాలన్నీ తెలుసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో ఇప్పటికే సీబీఐ వద్ద ఈ స్కాం తెర వెనుక పెద్దలకు సంబంధించిన సమాచారం పూర్తిగా ఉందని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే రానున్న రోజులలో ఈ స్కామ్ కు సంబంధించి మరిన్ని అరెస్టులు  జరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. ఒక వేళ నిజంగానే అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారినట్లైతే.. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు, సంచలనాలు తథ్యమని, రాష్ట్ర రాజకీయాలలో కీలక వ్యక్తుల అరెస్టులు కూడా జరిగే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు.  అందుకే డిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి టీఆర్ ఎస్ పెద్దగా స్పందించడం లేదనీ, అనవసరంగా ఈ స్కాం విషయంలో విమర్శలు, ఖండనలు చేసి మరింత కెలుక్కోవడమెందుకన్నట్లుగా గుంభనంగా వ్యవహరిస్తోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.  పక్కా ఆధారాలు లభించడంతోనే ఈ కేసులో సీబీఐ, ఈడీలు దూకుడు పెంచాయనీ పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.