మన పని అయిపోయింది.. వైసీపీ నేతలలో భయం.. భయం!

Publish Date:Oct 9, 2023

Advertisement

మొన్నటి వరకూ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైనాట్ 175 అనే నినాదం వినిపించేవారు. సీఎం వైనాట్ 175 అంటుంటే ఆ సంగతెలా ఉన్నా మరో సారి మన పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని  వైసీపీ క్యాడర్ నమ్ముతూ వచ్చింది. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కాస్త అటో ఇటూ మినిమం అధికారానికి సరిపడా సీట్లు దక్కుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేసేవారు. కానీ ఇప్పుడు వారిలో ఆ నమ్మకం లేదు. పరిస్థితి పూర్తిగా తారుమారైంది. దీంతో వైసీపీ నేతలలో   భయం మొదలైంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే.. మనం ఓడిపోవడం ఖాయం కనుక రేపు మన పరిస్థితి ఏంటి అనే టెన్షన్ మొదలైంది.

తెలుగుదేశం గెలిస్తే మన పరిస్థితి ఏంటి అంటూ వైసీపీ నేతలే బాహాటంగా చర్చించుకుంటున్నారు. మొన్న రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు  ఇటీవల ఓపెన్ గా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన తరువాత మాజీ మంత్రి బాలినేని కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే మన పరిస్థితి ఏంటని కార్యకర్తలను ఉద్దేశించి వీళ్లు ప్రశ్నించారు. 

తెలుగుదేశం గెలిస్తే రేపు మన భవిష్యత్ ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించుకోవాలని ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాన, బాలినేని క్యాడర్ ను ఒకరకంగా రెచ్చగొడుతూ బ్రతిమాలుకున్నారు. తాము అధికారంలోకి వస్తే వైసీపీ నాయకుల తాట తీస్తామంటూ జనసేన,  తెలుగుదేశం నాయకులు ఓపెన్ గానే హెచ్చరికలు జారీ చేస్తున్నారని..  తెలుగుదేశం నిజంగానే అధికారంలోకి వస్తే మనం తట్టుకోలేమని.. పరుగులు పెట్టాల్సిందేనని ధర్మాన, బాలినేని కార్యకర్తలను ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారు.

నిజానికి వైసీపీ నేతలలో ఈ భయం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. గత కొన్ని నెలలుగా వైసీపీ చేయించుకున్న అంతర్గత సర్వే, ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ టీం సర్వే, ఇంటెలిజెన్స్ రిపోర్టుతో నే వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయమని నిర్ధారణ అయింది. ప్రజలలో ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఆగ్రహ జ్వాలలలో మనం కొట్టుకుపోవడం ఖాయమని నిర్ధారణకు వచ్చేశారు. కానీ, ఆ విషయాన్ని దాచి పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చారు.

అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత వైసీపీ నేతలలో గెలుపు ఆశలు పూర్తిగా  అడుగంటాయి. దాంతో  బరస్ట్ అయిపోతున్నారు. కేడర్ ను రెచ్చగొట్టి అయినా సరే ఓటమి గండం గట్టెక్కాలనుకుంటున్నారు. అయితే చంద్రబాబు అరెస్టుతో తో వైసీపీ క్యాడర్ ఉలిక్కి పడింది. కొందరు నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నా ఎక్కువ మందిని ఆలోచనలో పడేసింది. చంద్రబాబు అరెస్ట్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు ప్రకటించడంతో వైసీపీలో ఆందోళన మొదలైంది. తమ ఓటమి ఖరారైందన్న భావనలోకి వచ్చేసిన వైసీపీ నేతలు.. మనసులో మాటను దాచుకోలేక బయటపడిపోతున్నారు.

ఇప్పుడున్న పరిస్థితులు, టీడీపీతో భగ్గుమంటున్న విద్వేష వాతావరణంలో ఓటమిపాలైతే మన పరిస్థితేంటని వైసీపీ క్యాడర్ మధనపడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ప్రతీకార చర్యలకు దిగిన వైసీపీకి ఇప్పుడు అధికారం కోల్పోతే తమ పరిస్థితి ఏంటని భయపడుతోంది. కలవర పడుతోంది. ఆ కలవరమే, భయమే వైసీపీ నేతలు, మంత్రుల మాటలతో భయపడుతోంది. 

ధర్మాన, బాలినేని లాంటి నేతలు మీడియా ముఖంగా బయటపడ్డారు. కానీ, వైసీపీ నేతలలో ఇప్పుడు అందరిదీ ఇదే భయం. అంతర్గత సంభాషణల్లో కూడా వైసీపీ నేతల ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది. ఇన్నాళ్లు అధికారం ఉందని చెలరేగిపోయామని, ఇప్పుడు పరిస్థితి తేడాగా మారగా.. రేపు మనల్ని ఎవరు కాపాడాలని వారిలో వారు చర్చించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎందుకొచ్చిన గొడవ జరిగిందేదో జరిగింది. ఇప్పటి నుండైనా తగ్గి ఉంటే మంచిదనే భావనలో ఇప్పటికే కొంత మంది సైలెంట్ అయిపోయారు. మరికొంత మంది టీడీపీ నేతలతో పరిచయాలు పెంచుకుంటూ వీలయితే గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారు. కొంత మంది మాత్రం కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. టీడీపీ వస్తే బతకనివ్వదని, ప్రాణాలు తెగించి గెలిపించుకుంటేనే రేపు మీ ప్రాణాలు నిలిచేది అంటూ నూరిపోస్తున్నారు. కానీ, కార్యకర్తల నుండి మాత్రం స్పందన రావడం లేదు. నాలుగేళ్ళగా పార్టీ కోసం పనిచేసినా తమకి ఒరిగిందేమీ లేదన్న భావనలో ఉన్న వైసీపీ క్యాడర్ అధికారం ఉన్నా.. లేకపోయినా తమకొచ్చే ఆదాయం ఏదీ లేదు.. జరిగే నష్టం ఏదీ లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట.

By
en-us Political News

  
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.