బాలినేని వర్సెస్ దామచర్ల.. ఒంగోలులో కూటమి పార్టీల మధ్య చిచ్చు.!

Publish Date:Aug 10, 2026

Advertisement

ప్రకాశం జిల్లాలో కూటమి పార్టీల మధ్య చిచ్చు రేగింది. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమిలో భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మ మధ్య ఒంగోలులో ఏర్పడిన విభేదాలు, విమర్శలు, ప్రతి విమర్శలతో ఇరు పార్టీల నేతలూ రెచ్చి పోతున్న తీరు జిల్లాలో పొలిటికల్ హీట్ ను అమాంతంగా పేంచేసింది.  ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  

 ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో బాలినేని పై  ఆరోపణలు గుప్పించారు. బాలినేని పేరుకే జనసేనలో ఉన్నారనీ, అయితే వైసీపీ తరఫునే, వైసీపీ ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలినేని 2024 ఎన్నికల తరువాత వైసీపీకి గుడ్ బై చెప్ప జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ.. దామచర్ల.. బాలినేని వైసీపీ కోసం పని చేస్తున్నారంటూ ఆరోపించారు.  అలాగే తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే లక్ష్యంతో బాలినేని అనుచరుల ద్వారా కరపత్రాలు పంపిణీ చేయించారన్నారు. 

కూటమి ధర్మాన్ని పాటిస్తూ.. ఇంత కాలం ఓర్పుగా ఉన్నానన్న దామచర్ల.. తన ఓర్పును బాలినేని బలహీనతగా భావించి రెచ్చిపోవాలని చూస్తుండటంతో ఇక భరించలేకే బాహాటంగా బాలినేని తీరును బయటపెట్టానన్నారు.  బాలినేని రౌడీయిజాన్ని ఉపేక్షించబోనని హెచ్చరించారు.  తనపై బాలినేని వర్గీయులు చేసిన అక్రమ వసూళ్ల ఆరోపణలు  నిరూపించాలని సవాల్ చేశారు.  ఈ క్రమంలో దామచర్ల బాలినేని కుమారుడు స్థానిక యువతను గంజాయి లాంటి తీవ్ర దురలవాట్లకు గురిచేశారని సంచలన ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, యువత భవిష్యత్తును నాశనం చేసేలా గతంలో కొందరు వ్యవహరించారనీ,  కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంగోలులో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు తాము కృషి చేస్తుంటే, కొందరు నేతలు ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు.  

కూటమి పార్టీల అగ్రనాయకత్వం స్పష్టమైన అవగాహనతో ఐక్యంగా ముందుకు సాగుతున్నా,  ఒంగోలు నియోజకవర్గంలో మాత్రం తెలుగుదేశం, జనసేన స్థానిక నాయకులు, శ్రేణుల మధ్య   సమన్వయం కుదరడం లేదన్న మాట చాలా కాలంగా వినిపిస్తూ వస్తోంది. ఇప్పుడు దామచర్ల బాలినేపిపై చేసిన ఆరోపణలు, విమర్శలు ఒంగోలులో కూటమి పార్టీల మధ్య సమన్వయ లేమికి అద్ధం పడుతున్నాయి.    

ఎమ్మెల్యే దామచర్ల చేసిన తీవ్ర ఆరోపణలపై బాలినేని శ్రీనివాసరెడ్డి లేదా ఆయన వర్గం ఎలా స్పందిస్తుందనేది ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయంలో ఉత్కంఠగా మారింది. ఇరు పార్టీల అధినేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు కలసి పనిచేస్తున్న వేళ, క్షేత్రస్థాయిలో సీనియర్ నేతల మధ్య సాగుతున్న ఈ శత్రుత్వం ఎటు దారితీస్తుందోనని స్థానిక ప్రజలు, కూటమి శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నారు. అధిష్ఠానం త్వరితగతిన దిద్దుబాటు చర్యలు చేపట్టి, ఒంగోలులో ప్రశాంత రాజకీయ వాతావరణాన్ని పునరుద్ధరించాలని నియోజకవర్గ ప్రజలు ఆశిస్తున్నారు.

Damacharla Janardhan, Balineni Srinivasa Reddy,  Ongole politics, TDP Janasena alliance, Prakasam district politics, TeluguOne

By
en-us Political News

  
65 సెంట్ల భూమి విషయంలో కోర్టుకు వెళ్లిన రైతులపై చంద్రబాబుకు ప్రేమ లేదంటూ పేర్ని నాని ఈ సందర్భంగా విమర్శించారు. కానీ వేల ఎకరాలు రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని ఇచ్చిన రైతుల విషయంలో జగన్ హయాంలో జరిగిందేంటి?
ర్యాలీకి ముందుగానే గుడివాడ వన్ టౌన్ ఎస్ఐ వీవీ సత్యనారాయణ మాజీ మంత్రి కొడాలి నానికి నోటీసులు అందజేశారు. అయితే ఆ నోటీసులను ఖాతరు చేయకుండా..  వైసీపీ శ్రేణులు, మద్దతుదారులతో   పార్టీ క్యాంప్ ఆఫీస్ దిశగా ముందుకు సాగారు.
తాజాగా  భారత్ జన వికాస్  పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో  జగన్   రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
 శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..!
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి.
అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు.
మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు.
పోచారం గాచారం మారిందా.. కాంగ్రెస్‌లో చేరడం పొరపాటేనా..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.