తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్న నినాదం ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా?! నిజమే, ప్రస్తుత ముఖ్యమంత్రి కవ్లకుంట్ల చంద్రశేఖరరావు తన నోటితో చెప్పిన మాటలు ఇవే. కానీ ఆ మాటలు అందరూ మరచిపోయారు. పుష్కరకాలం తరువాత తిరిగి ఆ నినాదం ఊపందుకోబోతోంది. ఈ సారి కేసీఆర్ నోట కాదు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తోంది.
కాంగ్రెస్ పరిస్థితి కర్నాటక ఎన్నికల ఫలితాలతో పూర్తిగా మారిపోయింది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ కి ఉన్న సంబంధం అపురూపమైనది. దేశమంతా కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్న సమ యంలో అప్పటి కాంగ్రెస్ అధినేత్రి ఇందిరా గాంధీని గెలిపించుకున్న ప్రాంతం తెలంగాణ. సహజంగానే కర్నాటక ఫలితాల ప్రభావం పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రంపై పడింది. అయితే కాంగ్రెస్ విజయం సాధిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. రెడ్డి
సామాజికవర్గ రాజకీయ ప్రాబల్యం అధికంగా ఉన్న తెలంగాణలో, అందులో కాంగ్రెస్ లో దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
రెడ్లలో ఉన్న పోటీని నివారించాలంటే ఇతర సామాజిక వర్గాలకు పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అదీకాక గతంలో మాట ఇచ్చి తప్పిన బీఆర్ఎస్ అధినేతను ఇరుకున పెట్టాలని, దళిత మహిళను పార్లమెంటు ప్రారంభోత్సవానికి పిలవని బీజేపీకి బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో పోరు జగమెరిగిన సత్యమే. రెడ్ల మధ్య పోరును ఆపడానికి దళిత కార్డును కాంగ్రెస్ వినియోగించబోతోంది. ఇంతకీ కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టిలో ఉన్న దళిత నేత ఎవరంటే, విప్లవ పంధా నుంచి జనజీవన స్రవంతిలోకి అడుగు పెట్టిన ములుగు ఎమ్మెల్యే సీతక్క అనే సమాధానం వస్తోంది. నిజాయితీగా పని చేస్తూ, అందరికీ అందుబాటులో ఉంటున్న సీతక్క పెట్ట కాంగ్రెస్ పెద్దలు సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా కాలంలో తన నియోజకవర్గంలో కాలినడకన ప్రయాణిస్తూ ప్రజలను ఆదుకున్న అడవి బిడ్డ సీతక్క ఇప్పుడు కాంగ్రరెస్ కు ఆశాదీపంగా కనిపిస్తోంది.
ఇటీవల రాహుల్ గాంధీతో కలిసి బారత్ జోడో యాత్రలో పాల్గొన్న సీతక్క దేశంలోని అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులతో పరిచయం పెంచుకున్నారు. రాహుల్ గాంధీ సీతక్కను ప్రత్యేకంగా ఆహ్వానించి భారత్ జోడో యాత్రలో భాగస్వామ్యం చేయడం వెనుక ఆమెను తెలంగాణ సీఎం పీఠంలో కూర్చోపెట్టే వ్యూహమే ఉందంటున్నారు ఢిల్లీ పెద్దలు. సీతక్కకు అన్ని రాజకీయ పార్టీలతో మంచి సంబంధాలు ఉండడం, వివాదాలకు అతీతంగా వ్యవహరించడం కూడా అమెకు ప్లస్ అనేది కాంగ్రెస్ వాదన. మరో వైపు భట్టి విక్రమార్క కూడా పాదయాత్రలు చేస్తూ అధిష్ఠానం కంట్లో పడే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా రెడ్లు, రెడ్లు పోరులో దళితులు ప్రయోజనం పొందడం ప్రస్తత తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/dalit-cm-for-telangana-39-156349.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.