ప్యూర్ ముర్రా బ్రీడ్ సేవలో ABC సెమన్ బ్యాంక్... పశుసంపద పెంపులో అవిరళ కృషి..!

Publish Date:Jun 21, 2025

Advertisement

 

పాడి పంట. ఈ జంట వ్యవస్థల్లో పశువులు సుభిక్షంగా ఉంటే చాలు.. పంటలు, పల్లెలు, రైతు కుటుంబాలు యథాతథంగా బాగుంటాయి. కనీస రవాణాకు ఇబ్బంది ఉండదు. 1970 వరకు రైతు భారతానిది ఇదే పరిస్థితి. ఆహ్లాదభరిత వాతావరణంలో మంచి పశువులు, దృఢంగా, ఆరోగ్యంగా చక్కటి పాడినిచ్చేవి. హరిత విప్లవం దుష్ప్రభావాల ఫలితంగా... దేశీ గేదెలు, ఆవుల్లో పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది, ఈ నేపథ్యంలో సగటున 20 నుంచి 25 లీటర్ల దిగుబడితో భారత పాల అవసరాలను తీరుస్తోంది... ముర్రా బ్రీడ్  మాత్రమే! ఈ విషయాన్ని గ్రహించిన ఆదర్శపోషకుల్లో ఒకరు... రాజీవ్ చిలకపాటి. లండన్ లో మాస్టర్స్ చేసిన ఈ రైతు బిడ్డ... స్వదేశానికొచ్చాక తన ఆశయంపై దృష్టిపెట్టారు. వ్యవసాయంపై మక్కువ... ఆవులు, గేదెలు, కోళ్లపై అలవిమాలిన ఆసక్తితో దేశమంతా తిరిగారు. 

ఏటికేటికీ అంతరించిపోతున్న మేలుజాతి పశుసంపదను సమగ్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. లక్ష్య సాధనలో భాగంగా ABC మ్యూచువల్లి ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీని స్థాపించారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో వ్యయప్రయాసలకోర్చి అధిక పాలచార కలిగిన ప్యూర్ ముర్రా దున్నపోతుల సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేశారు. ABC సెమెన్ స్టేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ గా...నాణ్యతలో రాజీ పడకుండా అత్యుతన్నత ప్రమాణాలతో ల్యాబ్ ను నెలకొల్పారు. నాలుగు ఎకరాల్లో అధిక పాల చారనిచ్చే ఉత్తమమైన ముర్రా దున్నపోతులతో... పశుసంపద వృద్ధి, జన్యు మెరుగుదలపై దృష్టిపెట్టారు. నియంత్రిత పర్యావరణంలో ఉన్న ABC సెమన్ స్టేషన్ చూడాలంటే మాత్రం ... ముందస్తు అనుమతి తీసుకోవాలి. 

సందర్శకులు ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ప్రతీ విభాగంలో వెటర్నరీ టెక్నిషియన్స్ సూచించిన విధంగా బయోసెక్యూరిటి ప్రోటోకాల్స్ పాటించాలి. ప్రవేశం ద్వారం నుంచి ప్రవేశించేటప్పుడే సంపూర్ణంగా శానిటైజ్ చేసుకోవాలి. ఒక విభాగం నుంచి ఇంకో విభాగానికి మారేటప్పుడు శానిటైజ్డ్ చేసిన యాప్రాన్స్, మాస్క్, హెడ్ క్యాప్ ధరించాలి. ఎక్కడి చెప్పులు అక్కడే విడిచిపెట్టాలి. నాలుగు ఎకరాల ఈ సువిశాల ప్యూర్ ముర్రా దున్నపోతుల సామ్రాజ్యంలో సందర్శకులు అడుగడుగునా మానిటరింగ్ చేయబడతారు. అధిక వంశపారంపర్యం గల వీర్యం ఉత్పత్తి చేసే వ్యవస్థ కావడం వల్ల... సమర్థవంతమైన నిర్వహణ విషయంలో  రాజీవ్... ఎక్కడా రాజీపడకపోవడం వారి నిబద్ధతకు తార్కాణం

 అధికపాడి, లైంగిక, జన్యుపరమైన వ్యాధుల్లేని ప్రీమియర్ ముర్రా బ్రీడ్ ను అభివృద్ధి చేయడం ABC సెమన్ స్టేషన్ ముఖ్య ఉద్దేశం. ABC ఫ్రోజెన్ సెమన్ స్ట్రాస్ తయారయ్యే క్రమంలో... ప్యూర్ ముర్రా దున్నల నుంచి సేకరించిన వీర్యాన్ని..?అనేక కఠిన పరీక్షలు చేస్తారు. నాణ్యత నియంత్రణ చర్యల ద్వారా బాక్టీరియా రహిత వాతావరణంలో వీర్యాన్ని ప్రాసెస్ చేస్తారు. ఫ్రెంచ్ మినీ స్ట్రాలో 0.25 ఎమ్.ఎల్. నిక్కచ్చిగా ప్యాక్ చేస్తారు. ఆ తర్వాత అల్ట్రాసోనిక్‌ సీలు చేసి, ఇంక్‌జెట్ ముద్రిస్తారు. ఒక్కో స్ట్రాలో దాదాపు 2 కోట్ల వీర్యకణాలుంటాయి. ఈ స్ట్రాస్ ని డ్రీప్ ఫ్రీజ్ లో నిల్వ చేస్తారు. నిర్ణీత కాలం తర్వాత లిక్విడ్ నైట్రోజన్ క్యానుల్లో భద్రపరిచి... దేశవ్యాప్తంగా పాడి రైతులకు పంపిణీ చేస్తారు

 గేదెల నుంచి వచ్చే పేడను ఎప్పటికప్పడు మిని ట్రాక్టర్ పడ్లర్ తో నెట్టేస్తారు. ఆ వ్యర్థాన్ని కూలీలు దూరంగా పోగేస్తారు. పశువుల కడిగిన నీళ్లు, మూత్రాన్ని... ఓ పెద్ద బావిలో సేకరిస్తారు. ఆ నీటిని తమ పశుగ్రాస క్షేత్రాలకు పారిస్తుంటారు. అలా సహజంగా పండించిన గ్రాసాలు, దాణాల మిశ్రమాన్నే మేపడం వల్ల కాబోలు దూడల నుంచి గేదెల వరకు అన్ని చలాకీగా కనిపిస్తుంటాయి. ఈ డెయిరీ చూసిన పాడిరైతులు ఎవరైనా సరే... నాలుగు బ్రీడ్ దూడలో, పడ్డలో మన పాకలో కూడా ఉంటే బాగుండనేలా ప్రభావితం చేస్తుంది రాజీవ్ డెయిరీ. ఇంతలా తోటి పోషకులను ప్రభావితం చేస్తున్న ఈ వ్యవస్థ నిర్మాణంలో రాజీవ్...సుదీర్ఘ ప్రణాళిక, క్రమశిక్షణ, కృషి... శ్లాఘనీయం! ఉత్తరాది ఆదర్శ రైతులను సైతం దక్షిణాదికి రప్పించిన ఆయన నైపుణ్యశైలి... హర్షణీయం మొత్తంగా పాడి రైతు ఆర్థికాభివృద్ధికి అవిరళ కృషిచేస్తున్న రాజీవ్ సంకల్పం... అభినందనీయం...!

VEERAVALLI -521 110, KRISHNA DISTRICT, A.P. STATE
WWW.abcsemenstation.com
+91 96667 61111 + 91 98666 71111
info@abcsemenstation.com 
abc_ap_in@gmail.com

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఉత్సవ కమిటీ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఒక్కోసారి చిన్న ప్రయత్నం కూడా ఊహించని విధంగా జీవితాన్ని మార్చేస్తుందనడానికి నిదర్శనంగా నిలిచింది ఒక ఉదంతం.
ఆంధ్రప్రదేశ్‌ను వణికించిన అర్నబ్ తుఫాను ప్రభావంతో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు నష్టం వాటిల్లింది.
ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విద్యుత్ శాఖ సిబ్బంది సేవలందిస్తున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.