సైబరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. రెండు రెస్టారెంట్లకు నోటీసులు

Publish Date:Jun 23, 2026

Advertisement

 

సైబరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో రెండు ప్రముఖ రెస్టారెంట్లలో ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. పుప్పాలగూడలోని కంచి కేఫ్, నల్లగండ్లలోని కోడికూర చిట్టిగారే రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపాలు, ఆహార నిల్వ నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన అధికారులు ఆయా యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు.

తనిఖీల సందర్భంగా పుప్పాలగూడలోని కంచి కేఫ్‌లో కిచెన్, స్టోర్‌రూమ్ మధ్య ఓపెన్ డస్ట్‌బిన్లు ఉండటంతో దుర్వాసనతో పాటు ఈగల సమస్య కనిపించింది. స్టోర్‌రూమ్ సీలింగ్‌పై దుమ్ము పేరుకుపోవడం, కూరగాయలు కట్ చేసే ప్రాంతాలు, గ్రైండింగ్ విభాగాల్లో నీరు నిల్వ ఉండటం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. అంతేకాకుండా కాలీఫ్లవర్‌పై ఫంగస్ పెరిగి ఉండటం, డ్రెయిన్ల వద్ద దుర్వాసన రావడం, ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన పిండిపై సరైన లేబులింగ్ లేకపోవడం కూడా బయటపడింది.

కిచెన్, స్టోర్‌రూమ్‌లో ఈగలు, బొద్దింకలు సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు సిబ్బంది మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పెస్ట్ కంట్రోల్, వాటర్ టెస్టింగ్, ప్యాకేజింగ్ మెటీరియల్ టెస్టింగ్‌కు సంబంధించిన రికార్డులు అందుబాటులో లేవని వెల్లడించారు. ఆహార పదార్థాల లేబులింగ్, హౌస్‌కీపింగ్ ప్రమాణాలను మెరుగుపరచాలని సూచిస్తూ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.

ఇక నల్లగండ్లలోని కోడికూర చిట్టిగారే రెస్టారెంట్‌లో కూడా పలు లోపాలు బయటపడ్డాయి. చికెన్, డెజర్ట్స్ వంటి ఆహార పదార్థాలపై సరైన లేబుల్స్ లేకపోవడంతో వాటిని అధికారులు వెంటనే తొలగించారు. గ్రైండింగ్ ఏరియా సీలింగ్‌పై దుమ్ము పేరుకుపోవడం, సిబ్బంది మెడికల్ ఫిట్‌నెస్, ప్యాకేజింగ్ మెటీరియల్ టెస్టింగ్‌కు సంబంధించిన రికార్డులు లేకపోవడం గుర్తించారు. జిడ్డుగా మారిన కిచెన్ సీలింగ్‌ను తక్షణమే శుభ్రం చేయాలని యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేశారు.

ఆహార భద్రత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు. ఆహార తయారీ, నిల్వ, విక్రయాల్లో నిర్దేశిత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని రెస్టారెంట్ యాజమాన్యాలను హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

By
en-us Political News

  
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ భరత్ భూషణ్ తివారీ (28) పోలీస్ ఎన్‌కౌంటర్‌లో గాయపడి మరణించడం
హైదరాబాద్ మెట్రో రైలు అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి రాజకీయ డ్రామాలకు తెరలేపారని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సాయి కృష్ణ అదృశ్యం ఉదంతంలో ఎట్టకేలకు ఒక కీలకమైన పురోగతి లభించింది.
స్వర్ణగిరిగా... ఇక జొన్నగిరి..గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు..
ఏటీఎంలో నగదు నింపే వ్యాన్ డ్రైవర్ నగదుతో పరార్...
దుల నుండి ఇసుకను విచ్చలవిడిగా తోడేయడం వల్ల భూగర్భ జల మట్టాలు దారుణంగా పడిపోతున్నాయని డాక్టర్ రాజగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. నదుల్లో ఇసుక పొరలు నీటిని నిల్వ ఉంచే స్పాంజ్‌లా పనిచేస్తాయని, వాటిని పూర్తిగా తొలగిస్తే వర్షపు నీరు భూమిలోకి ఇంకకుండా వేగంగా సముద్రంలోకి కొట్టుకుపోతుందని హెచ్చరించారు.
ఏపీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు.. కేబినెట్ సంచలన నిర్ణయం..
అభయాంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించిన 2,750 గజాల విలువైన భూమి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్యలు తీవ్రరూపం దాల్చాయి.
సిలికాన్ సిటీలో ట్రిపుల్ మర్డర్ కలకలం..
మహారాష్ట్రలోని చారిత్రాత్మక లోహగఢ్‌ కోట పర్యాటక ప్రాంతంలో ఇటీవల జరిగిన ఒక యువ వ్యాపారవేత్త మరణం కేసులో ఊహించని మలుపు తిరిగింది.
లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయ టకు తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్, పోలీసు బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని సమీ పంలోని ఆస్పత్రులకు తర లించి చికిత్స అందిస్తు న్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.