ప్రకోపించిన ఓమ్ రౌత్ పైత్యం.. ఆదిపురుష్ లో రావణుడి గెటప్ చూశారా?

Publish Date:Oct 4, 2022

Advertisement

రామాయ‌ణంలోని రావ‌ణాసురుడు ఎలా ఉంటాడు?.. 'భూకైలాస్‌', 'సీతారామ క‌ల్యాణం' సినిమాల్లో విశ్వ‌విఖ్యాత నంద‌మూరి తార‌క‌రామారావు ధ‌రించిన పాత్ర మాదిరిగా ఉంటాడు. బాపు తీసిన 'సంపూర్ణ రామాయ‌ణం'లో మ‌హాన‌టుడు ఎస్వీ రంగారావు త‌ర‌హాలో ఉంటాడు. మ‌న‌కు రావ‌ణుడంటే.. ఆ సినిమాల్లో క‌నిపించిన రావ‌ణుడే! నుదుటిన శివ‌నామం, త‌ల‌పై పొడ‌వాటి కిరీటం, భుజాన గ‌ద‌, ఛాతీని క‌ప్పివేసే భారీ ఆభ‌రణాలు, ప‌ట్టు ధోవ‌తి.. ఇదీ రావ‌ణుని ఆహార్యం!

కానీ 'ఆదిపురుష్‌'లో మ‌నం చూసిన రావ‌ణుడు మ‌న ఊహ‌ల్లోని రావ‌ణునికి పూర్తి భిన్నంగా ఉన్నాడేంటి?  పొడ‌వుగా పెరిగిన గ‌డ్డం, లెద‌ర్ జాకెట్‌! రావ‌ణుడు ఇలా ఉంటాడా? రామాయ‌ణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓమ్ రౌత్ రూపొందిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్‌'. శ్రీ‌రామునిగా ప్ర‌భాస్‌, సీత‌గా కృతి స‌న‌న్‌, రావ‌ణునిగా సైఫ్ అలీఖాన్, ల‌క్ష్మ‌ణునిగా స‌న్నీ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన 'ఆదిపురుష్' టీజ‌ర్ చూసిన వాళ్ల‌కి మ‌తిపోయింది. ప్ర‌ధానంగా రావ‌ణుడు, ఆంజ‌నేయుడి రూపాలు చూసి వాళ్లు షాకైపోతున్నారు. ఇప్ప‌టికే అనేక భార‌తీయ భాష‌ల్లో రామాయ‌ణ గాథ ఆధారంగా ప‌లు చిత్రాలు వ‌చ్చాయి. వాటి వ‌ల్ల‌ భార‌తీయుల హృద‌యాల్లో సీతారాములు, రావ‌ణుడు, ఆంజ‌నేయుల రూపాలు ఎలా ఉంటాయ‌నేది ముద్రించుకుపోయింది. 

వాటికి భిన్నంగా 'ఆదిపురుష్' మూవీలో రావ‌ణుడి ఆహార్యం క‌నిపించేస‌రికి అందరూ  విస్తుపోతున్నారు. 'భూకైలాస్‌'లో, 'సీతారామ క‌ల్యాణం'లో రావ‌ణాసురునిగా విశ్వ‌విఖ్యాత నంద‌మూరి తార‌క‌రామారావు ఎంత‌గానో ఆక‌ట్టుకున్నారు. రావ‌ణుని క్యారెక్ట‌ర్‌కు ఆయ‌న హీరో ఇమేజ్ క‌ల్పించారు. రావ‌ణుడు ఇలాగే ఉంటాడ‌నేలా ఆయ‌న రూపం మ‌న మ‌న‌సుల్లో హత్తుకుపోయింది. అలాగే బాపు రూపొందించిన 'సంపూర్ణ రామాయ‌ణం' చిత్రంలో రావ‌ణునిగా విశ్వ‌న‌ట చ‌క్ర‌వ‌ర్తి ఎస్వీ రంగారావు న‌ట‌న‌నూ, ఆయ‌న రూపాన్ని మ‌నం మ‌ర‌వ‌గ‌ల‌మా!

కానీ లంకేశ్ అనే రావ‌ణునిగా 'ఆదిపురుష్' టీజ‌ర్‌లో సైఫ్ అలీఖాన్‌ను చూస్తే.. ఇద‌స‌లు రామాయ‌ణ క‌థ ఆధారంగా తీస్తున్న సినిమాయేనా, లేక రామాయ‌ణాన్ని త‌న ఇష్టం వ‌చ్చిన‌ట్లు మార్చి ఓమ్ రౌత్ సొంత పైత్యం ప్రదర్శిస్తున్నాడా అన్న అభిప్రాయం క‌లుగుతోంది. 'ఆదిపురుష్' టీజ‌ర్ చూశాక‌.. భార‌తీయుల జీవితాల్లో ఒక భాగ‌మైన రామాయ‌ణాన్నీ, అందులోని పాత్ర‌ల‌నూ త‌మ ఇష్టం వ‌చ్చిన రీతిలో చూపించడం క‌రెక్టేనా? అంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమం వేదికగా ఓమ్ రౌత్ ను నిలదీస్తున్నారు.

ఆ టీజ‌ర్‌లో రావ‌ణునిగా సైఫ్ అలీఖాన్.. గుబురుగా పెరిగిన పొడ‌వాటి గ‌డ్డం, ద‌గ్గ‌ర‌గా క‌త్తిరించిన త‌ల‌పై జుట్టు, ఒంటికి లెద‌ర్‌తో చేసిన జాకెట్ ధ‌రించి, నీలి క‌ళ్ల‌తో క‌నిపించాడు. పురాణ పురుషుడైన‌ రావ‌ణుడు ఎలాంటి దుస్తులు ధ‌రిస్తాడ‌నేది మ‌న‌కు క‌చ్చితంగా తెలీక‌పోవ‌చ్చు కానీ.. ఇప్ప‌టికే ప‌లు సినిమాల ద్వారా ఆయ‌న కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయనేది మ‌న మ‌న‌సుల్లో ఒక స్థిర‌మైన ముద్ర‌ప‌డి ఉంది. ఆ ఊహ‌ల‌కు, ఆ న‌మ్మ‌కాల‌కు ఏమాత్రం సంబంధంలేని రీతిలో రావ‌ణుడిని డైరెక్ట‌ర్ ఓమ్ రౌత్ చూపిస్తున్నాడ‌ని అర్థ‌మైపోతోంది. అస‌లాయ‌న ఏ రామాయ‌ణ గ్రంథం ఆధారంగా 'ఆదిపురుష్' తీస్తున్నాడో చెప్పాల‌ని అనేక‌మంది ప్ర‌శ్నిస్తున్నారు.

అలా ప్ర‌శ్నిస్తున్న‌వారిలో 'కేజీఎఫ్' ఫేమ్ మాళ‌వికా అవినాశ్ కూడా ఉన్నారు. రామాయ‌ణాన్ని స‌రిగా అధ్య‌య‌నం చేకుండా 'ఆదిపురుష్‌'ను తీశారంటూ ఓమ్ రౌత్‌పై ఆమె విరుచుకుప‌డ్డారు. రీసెంట్‌గా ఓ ట్వీట్‌లో ఆమె, "లంక‌కు చెందిన రావ‌ణుడు శివ‌భ‌క్తుడైన ఓ బ్రాహ్మ‌ణుడు. 64 క‌ళ‌ల్లో ప్ర‌వీణుడు. వైకుంఠానికి ర‌క్ష‌ణ‌గా ఉండే జ‌య (విజ‌య‌) ఓ శాపం కార‌ణంగా రావ‌ణునిగా జ‌న్మించాడు. ఇత‌ను (ఆదిపురుష్ లంకేశుడు) ట‌ర్కీకి చెందిన నిరంకుశుడు కావ‌చ్చేమో కానీ రావ‌ణుడు మాత్రం కాదు! మ‌న రామాయ‌ణం/ చ‌రిత్ర‌ను త‌ప్పుగా చూపించ‌డాన్ని బాలీవుడ్ మానుకోవాలి. లెజెండ్ ఎన్టీ రామారావు గురించి ఎప్పుడూ విన‌లేదా?" అని ఆమె రాసుకొచ్చారు.

'ఆదిపురుష్' మూవీ ద్వారా ఓమ్ రౌత్ రామాయ‌ణాన్నీ, దాని స్ఫూర్తినీ వ‌క్రీక‌రిస్తున్నాడ‌ని సోష‌ల్ మీడియా ద్వారా ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. స్వేచ్ఛ ముసుగులో భార‌తీయులంద‌రూ ఆరాధించే రామాయ‌ణాన్ని వ‌క్రీక‌రిస్తే ఊరుకొనేది లేద‌ని వారు హెచ్చ‌రిస్తున్నారు. దేశ‌ ప్ర‌జ‌ల నాగ‌రిక‌తో ఒక భాగ‌మైన రామాయ‌ణాన్ని ఆధారంగా తీసుకొని సినిమా తీస్తున్న‌ప్పుడు చాలా బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాలి కానీ, ఇలా ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఎలా తీస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. 

కాగా, కోట్లాదిమంది ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒక‌టైన‌ 'ఆదిపురుష్' టీజ‌ర్ రిలీజ‌య్యాక.. అద‌స‌లు లైవ్ యాక్ష‌న్ సినిమాలాగా లేద‌నీ, ఓ యానిమేష‌న్ సినిమాలా ఉంద‌నీ అనేక‌మంది కామెంట్స్ చేస్తున్నారు.  వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ కూడా క్వాలిటీతో లేద‌నీ, సినిమా ఓ వీడియో గేమ్‌లాగా క‌నిపిస్తోంద‌నీ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న ఈ సినిమాని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.