తెలంగాణాలో తప్పుదోవ పట్టిస్తున్న కరోనా లెక్కలు!

Publish Date:Apr 28, 2020

Advertisement

* దేశంలోనే అత్యధిక కేసులు మహారాష్ట్రలో-5221,
* తెలంగాణలో 1003.
 

ఈ లెక్కలు చూసి తెలంగాణలో మొత్తం పరిస్తితి పూర్తిగా కంట్రోల్ లో ఉందని పప్పులో కాలేసేరు. కరోనా కేసులు చేసే పరీక్షల మీద ఆధారపడి ఉంటాయి. పరీక్షలు ఎక్కువ చేస్తే ఎక్కువ, తక్కువ చేస్తే తక్కువ, అసలు చేయకుంటే అసలు ఒక్క కేసూ ఉండదు. ఒక్కొక్క ఇంట్లో పదుల సంఖ్యలో కేసులు బయటబడుతుంటే ఇంకా తెలంగాణలో త‌క్కువ కేసులెందుకు వున్నాయి. ఈ  అనుమానం చాలామందికి రావచ్చు. 

ఒకసారి లెక్కలను మరింత లోతుగా విశ్లేషిద్దాం...? 
తెలంగాణలో ఇప్పటివరకూ చేసిన పరీక్షలు : 13200.  అయితే బ‌యటపడిన కేసులు: 943 మాత్ర‌మే.

ప్రతీ 100 పరీక్షలకు తెలంగాణలో బయటపడుతున్న కేసులు: (100/13200)x1003 = 7.59

మహారాష్ట్రలో ఇప్పటివరకూ చేసిన పరీక్షలు: 75838. అయితే
బయటపడిన కేసులు: 5221

ప్రతీ 100 పరీక్షలకు మహారాష్ట్రలో బయటపడుతున్న కేసులు: (100/75838)x5221 =6.88

అంటే, తెలంగాణలో ప్రతీ 100 కేసులకూ 7.59 పాజిటివ్ వస్తే, మహారాష్ట్రలో ఈ సంఖ్య మనకన్నా తక్కువగా (6.88) ఉంది. అంటే కేసుల శాతం తెలంగాణలో మహారాష్ట్ర కన్నా ఎక్కువగా ఉంది.  

తెలంగాణలో కూడా మహారాష్ట్ర మాదిరిగా పరీక్షలు నిర్వహిస్తే తెలంగాణలో బయటపడదానికి అవకాశం ఉన్న కేసుల సంఖ్య: (75838/13200) x 1003 = 5762. ఇది మహారాష్ట్ర కన్నా 541 ఎక్కువ.

అసలు రోగులే లేకుంటే, పరీక్షలు చేసినా  పాజిటివ్ కేసులేలా బయటపడతాయ్? అని కొందరు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది, తెలంగాణలో పరీక్షల సంఖ్య పెరిగినప్పుడల్లా కేసుల సంఖ్య పెరగడం. ఉదాహరణకు మొన్న 450 పరీక్షలు చేస్తే, అందులో 49 పాజిటివ్ కేసులు వచ్చాయి. అంటే పది శాతం కన్నా ఎక్కువ. పరీక్షలు చేసిన చోటల్లా పుట్టల్లా కేసులు బయటపడుతుంటే అసలు రోగులే లేరనడం అమాయకత్వం. 

మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఆసుపత్రుల్లో మరణించిన వారికి కరోనా పరీక్షలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. మరణించిన వారికి అంత్యక్రియలు కరోనా రోగులకు నిర్వహించినట్లుగానే నిర్వహించాలి కానీ, వారికి కరోనా పరీక్షలు చేయవద్దని చెప్పడానికి కారణం ప్రభుత్వం వివరించలేదు. దీంతో కరోనా మరణాల లెక్కలు తెలంగాణలో చాలా తక్కువగా నమోదైతాయి. 

అలాగే, కరోనా రోగుల సెకండరీ కాంటాక్ట్ లకు కరోనా పరీక్షలు చేయవద్దని నిన్న ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి చర్యలతో రాష్ట్రంలో చూపించే కరోనా కేసుల సంఖ్య వాస్తవ సంఖ్య కన్నా గణనీయంగా తక్కువ ఉంటుంది. 

అసలు వేల సంఖ్యలో కరోనా పరీక్షలతో సాధించేదెముంది? 
‘వేల సంఖ్యలో కరోనా పరీక్షలతో సాధించేదెముంది? ఖర్చు తప్ప...” అనే అనుమానం చాలా మందికి రావచ్చు. తెలంగాణలో కోటి మందికి పరీక్షలు చేసినా 600 కోట్ల రూపాయల ఖర్చుకాదు. తెలంగాణలో రెండు రోజులు లాక్ డౌన్ తో ప్రభుత్వం కోల్పోయే ఆదాయం (సుమారు రూ800కోట్లు) కన్నాఈ ఖర్చు తక్కువ.
కాబట్టి పరీక్షలకు ఖర్చుకు సంబంధం లేదు. 

మరి పరీక్షలతో లాభం ఏంటి?
దీనికన్నా ముందు, అసలు లాక్ డౌన్ తో లాభమెంటోతెలుసుకోవాలి. లాక్ డౌన్ తో వైరస్ సమాజం నుండి తొలగిపోదు. లాక్ డౌన్ కరోనా వ్యాప్తికి తాత్కాలికంగా కట్టడి వేస్తుంది. ప్రజా ఆరోగ్య వ్యవస్థ మీద ఒకే సారి తీవ్రభారం పడకుండా ఆపుతుంది. 

ఈ లోగా ప్రభుత్వం కరోనాను నిర్మూలించాలంటే లాక్ డౌన్ తో పాటు పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచడం, గుర్తించిన రోగులను ఇతరుల నుండి వేరు పరచడం, చికిత్సనందించడం ఒక్కటే మార్గమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన విషయం గుర్తుంచుకోవాలి.

తెలంగాణ పరీక్షల సంఖ్యను అనేక రెట్లు పెంచాల్సిన అవసరం ఉంది. మన కన్నా తక్కువ పరీక్షలు చేస్తున్న రాష్ట్రాలు మనకు ఆదర్శం కాకూడదు. ఇలా కాకుండా కేవలం లాక్ డౌన్ ఒక్కటే మార్గమనుకుంటే, కరోనా వ్యాప్తిని అరికట్టలేం సరికదా దీర్ఘకాలిక లాక్ డౌన్ లతో ప్రజల జీవితాలు, రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి ఛిన్నాభిన్నమవుతుంది. 

మరోవైపు కేసులు తక్కువగా ఉన్నాయని లాక్ డౌన్ ఎత్తివేస్తే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్తితి భిన్నంగా ఉండి, కరోనా మరింతగా విజృంభించే చేతులు దాటిపోయే  ప్రమాదం ఉంది. 

ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచి కరోనా కట్టడికి యుద్ద ప్రాతిపదిక పై చర్యలు చేపట్టాలి. పరిస్తితి నియంత్రణలోకి రాగానే లాక్ డౌన్ దశల వారీగా ఎత్తివేయాలి.

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.