జగన్ కాళ్ల బేరాలు.. కాంగ్రెస్ నుంచి ఛీత్కారాలు!

Publish Date:Oct 23, 2024

Advertisement

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఇబ్బందులు మొద‌ల‌య్యాయి. అధికారంలో కొన‌సాగిన ఐదేళ్లు త‌న ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించిన జ‌గ‌న్‌కు.. ఇప్పుడిప్ప‌డే జ్ఞానోద‌యం అవుతున్న‌ట్లు ప్ర‌స్తుత ప‌రిణామాలను చూస్తే అర్థ‌మ‌వుతోంది. అధికారం మ‌త్తులో జ‌గ‌న్‌, ఆయ‌న అనుచరులు రెచ్చిపోయారు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌పైనేకాక‌.. ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించిన వారిపై అక్ర‌మ కేసులు బ‌నాయించి జైళ్ల‌కు పంపించారు. 2019 ఎన్నిక‌ల్లో త‌న గెలుపులో కీల‌క భూమిక పోషించిన కుటుంబ స‌భ్యుల‌ను సైతం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌గన్ దూరం చేసుకున్నాడు.

ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి త‌రువాత జ‌గ‌న్ పాత కేసుల‌తో పాటు.. అధికారంలో ఉన్న స‌మ‌ యంలో  పాల్పడిన అవినీతి అక్ర‌మాల‌ కేసులు కూడా రెడీగా ఉన్నాయి. దీంతో త్వ‌ర‌లో జ‌గ‌న్, వైసీపీలోని ముఖ్య‌నేత‌లు జైలుకెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే గ‌డిచిన‌ ఐదేళ్ల కాలంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని రెచ్చిపోయిన వైసీపీ నేత‌ల‌పై కూట‌మి ప్ర‌భుత్వం కొర‌డా ఝుళిపిస్తోంది. గ‌తంలో జ‌గ‌న్ ఏం చేసినా కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు అండ‌గా ఉంటూ వ‌చ్చారు. ప్ర‌స్తుతం ఏపీలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీల‌తో బీజేపీ పొత్తులో ఉంది. దీంతో జ‌గ‌న్ ఏకాకి అయ్యారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పార్టీకి ద‌గ్గ‌ర‌య్యేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.  

రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు, శాశ్వ‌త శ‌త్రులు ఉండ‌రు. ఎప్ప‌టిక‌ప్పుడు మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాలను బ‌ట్టి పార్టీల మ‌ధ్య పొత్తులు, నేత‌ల మ‌ధ్య సంబంధాలు మారుతుంటాయి. ప్ర‌స్తుతం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా అదే సూత్రాన్ని ఫాలో అవుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌రువాత ఒట‌రి అయిన జ‌గ‌న్‌.. జాతీయ స్థాయిలో ప‌లుకుబ‌డి ఉండాలంటే ఏదో ఒక జాతీయ పార్టీతో సంఖ్య‌త‌తో ఉండాల‌ని భావిస్తున్నారు. ఇన్నాళ్లు బీజేపీ జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌గా.. జ‌గ‌న్ ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌ను చూసి ఆ పార్టీ తెలుగుదేశం, జ‌న‌సేనతో పొత్తు పెట్టుకొని ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉంది. దీంతో జ‌గ‌న్ కు కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు అనివార్య‌మైంది.

గ‌తంలో కాంగ్రెస్ పార్టీతో ఎట్టి ప‌రిస్థితుల్లో క‌లిసేది లేద‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  పలుమార్లు చెప్పారు. అంతేకాక‌.. సోనియా, రాహుల్ గాంధీపై వైసీపీ నేతలు విమ‌ర్శ‌లు  కూడా చేశారు. సింహం సింగిల్ గా వస్తుంది. జగన్ మోహన్ రెడ్డికి పొత్తులూ మద్దతులూ అవసరం లేదని విర్రవీగారు. కానీ  ప్ర‌స్తుతం కాంగ్రెస్ తో క‌ల‌వాల్సిన ప‌రిస్థితి జ‌గ‌న్ కు ఏర్ప‌డింది. దీంతో ఆమేర‌కు జ‌గ‌న్‌ మంత‌నాలు చేస్తున్నారు. కాంగ్రెస్  పార్టీతో దోస్తీ చేయాలంటే ముందుగా చెల్లెలు ష‌ర్మిల‌తో విబేధాల‌కు స్వ‌స్తి చెప్పాల్సిన ప‌రిస్థితి. ప్ర‌స్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ష‌ర్మిల ఉన్నారు. షర్మిల  ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌ను ప్ర‌జ‌ల్లో తీవ్ర స్థాయిలో ఎండ‌గ‌ట్టారు. జ‌గ‌న్ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్ర‌మే రావ‌డానికి ష‌ర్మిల కూడా ఓ కార‌ణమ‌ని చెప్పడానికి సందేహించాల్సిన ప‌నిలేదు. 

వైఎస్ఆర్ మ‌ర‌ణం త‌రువాత కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి జ‌గ‌న్  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అప్ప‌టి నుంచి జ‌గ‌న్ వెంట ఆయ‌న త‌ల్లి విజ‌య‌మ్మ‌, చెల్లెలు వైఎస్ ష‌ర్మిల ఉన్నారు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ పార్టీకి మ‌ద్ద‌తుగా ష‌ర్మిల విస్తృత ప్ర‌చారం చేశారు. జ‌గ‌న్ జైలుకెళ్లిన స‌మ‌యంలో పాద‌యాత్ర‌  చేశారు. 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ గెలుపులో ష‌ర్మిల కీల‌క భూమిక పోషించారు. తండ్రి మ‌ర‌ణం త‌రువాత జ‌గ‌న్‌కు అండ‌గా ష‌ర్మిల నిల‌బ‌డ్డారు. అయితే, అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ష‌ర్మిల‌ను జ‌గ‌న్ పూర్తిగా విస్మ‌రించారు. వాస్త‌వానికి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌తికిఉన్న స‌మ‌యంలో త‌న ఆస్తిలో ష‌ర్మిళ‌కుకూడా స‌మాన వాటా ఉండాల‌ని ప‌లుసార్లు ప్ర‌స్తావించారు.

జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ష‌ర్మిలకు వాటా ఇచ్చేది లేద‌ని చెప్ప‌డంతోపాటు.. ఆమెను పార్టీ నుంచి ప‌క్క‌కు త‌ప్పించారు. ష‌ర్మిల‌తోపాటు త‌ల్లి విజ‌య‌మ్మ‌ సైతం పార్టీకి దూరం అయ్యారు. ఆ త‌రువాత కొద్దికాలం తెలంగాణ రాజ‌కీయాల్లో కొన‌సాగిన ష‌ర్మిల‌.. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలిగా ఏపీ రాజ‌కీయాల్లో  ఎంట్రీ ఇచ్చారు. ఎన్నిక‌ల ముందు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ష‌ర్మిల తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. ఐదేళ్ల వైసీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌తోపాటు.. ష‌ర్మిల జ‌గ‌న్ గురించి చెప్పిన నిజాల‌ను ప్ర‌జ‌లు బ‌లంగా న‌మ్మారు. దీంతో వైసీపీ అధికారం కోల్పోవ‌డంతోపాటు.. క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదాకూడా నిల‌బెట్టుకోలేక పోయింది.

అధికారం కోల్పోవ‌డంతో ఎదుర‌వుతున్న ఇబ్బందుల నుంచి కొంతైనా త‌ప్పించుకునేందుకు కాంగ్రెస్ పార్టీతో దోస్తీకి జ‌గ‌న్ తాప‌త్ర‌య ప‌డుతున్నారు. బెంగ‌ళూరు వేదిక‌గా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత, క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ ద్వారా జ‌గ‌న్ కాంగ్రెస్ పార్టీ పెద్ద‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. అయితే, ష‌ర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా ఉండ‌టంతో ఆమెతో ఉన్న విబేధాల‌కు స్వ‌స్తి చెప్పేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ష‌ర్మిల వ‌ద్ద‌కు కాళ్ల‌ బేరానికి వ‌చ్చి ఆమెకు తండ్రి ఆస్తిలో  రావాల్సిన వాటాను ఇచ్చేందుకు జ‌గ‌న్ ఒప్పుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కాంగ్రెస్ పార్టీతో దోస్తీకోసం అన్నిఅడ్డంకుల‌ను తొల‌గించుకోవాల‌ని జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 

అయితే, కాంగ్రెస్ జాతీయ నాయ‌క‌త్వం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని న‌మ్మే ప‌రిస్థితుల్లో లేదు. జ‌గ‌న్ తీరుప‌ట్ల వేచి చూసే ధోర‌ణిలో రాహుల్‌, సోనియా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అసలు జగన్ ను కలుపుకునే విషయంలో కాంగ్రెస్ లో మెజారిటీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. అందుకే జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ తటపటాయిస్తోంది. వాస్తవానికి జ‌గ‌న్ తో దోస్తీకి రాహుల్ గాంధీ స‌సేమీరా అంటున్న‌ట్లు స‌మాచారం. దీనికి ప్ర‌ధాన కార‌ణం  వైసీపీ ఐదేళ్ల పాల‌న‌లో జ‌గ‌న్ అరాచ‌క పాల‌న సాగించ‌డ‌మే. ఎలాంటి త‌ప్పు చేయ‌ని చంద్ర‌బాబును జైళ్లో పెట్ట‌డంతోపాటు, సొంత చెల్లి ష‌ర్మిల‌ను జ‌గ‌న్ ఇబ్బందుల‌కు గురిచేయ‌డాన్ని రాహుల్ తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు కాంగ్రెస్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. రాహ‌ల్ గాంధీ ధోర‌ణి చూస్తుంటే ఇప్ప‌ట్లో కాంగ్రెస్ పార్టీకి జ‌గ‌న్ ద‌గ్గ‌ర‌య్యే అవ‌కాశాలు లేవ‌నే విష‌యాన్ని   వైసీపీ నేత‌లు చెబుతున్నారు. మొత్తానికి ఓట‌మి త‌రువాత ఎవ‌రితో ఎలా ఉండాల‌నే విష‌యం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బోధప‌డింద‌ని ఏపీ రాజ‌కీయాల్లో  చ‌ర్చ జ‌రుగుతుంది.

By
en-us Political News

  
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై  చార్జ్‌షీట్‌  విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్  ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు.  తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో  గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన  బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న  నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి. 
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష  నాయకురాలు తారాహై కత్‌బర్ట్  మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.
కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి. 
 ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.